ఐర్లాండ్‌ బ్యాటర్ల వీరోచిత పోరాటం.. జింబాబ్వేపై సంచలన విజయం | Ireland Beat Zimbabwe By 4 Wickets In One Off Test | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌ బ్యాటర్ల వీరోచిత పోరాటం.. జింబాబ్వేపై సంచలన విజయం

Published Sun, Jul 28 2024 6:16 PM | Last Updated on Sun, Jul 28 2024 6:16 PM

Ireland Beat Zimbabwe By 4 Wickets In One Off Test

స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ అద్భుత విజయం నమోదు చేసింది. లొర్కాన్‌ టక్కర్‌ (56), ఆండీ మెక్‌బ్రైన్‌ (55 నాటౌట్‌) వీరోచితంగా పోరాడి ఐర్లాండ్‌కు చారిత్రక విజయం అందించారు. 

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్‌.. టక్కర్‌ వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్‌బ్రైన్‌.. మార్క్‌ అదైర్‌ (24)  సహకారంతో ఐర్లాండ్‌ను గెలిపించాడు. టెస్ట్‌ల్లో ఐర్లాండ్‌కు ఇది రెండో విజయం. ఈ ఏడాది ఐర్లాండ్‌ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చింది.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 210, రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 250, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement