అవాతంరాలను దాటుకుంటూ కుటుంబ పోషన కోసం ఫుడ్ డెలివరీ చేస్తున్న పలువురి వీడియోలు సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. అలాంటి వీడియోనే మరోకటి వెలుగులోకి వచ్చింది. ఓ జొమాటో డెలివరీ బాయ్.. తన కూతురిని ఎత్తుకుని, కొడుకుని చేతపట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఆహారం అందిస్తున్నాడు. ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వాని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘ఆయనను చూడంటం నాకు స్ఫూర్తినిచ్చింది. ఒకవ్యక్తి కావాలనుకుంటే ఏదైనా చేయగలడనే విషయాన్ని మనం నేర్చుకోవాలి.’ అంటూ రాసుకొచ్చారు సౌరభ్.
ఆ వీడియోలో.. ఓ వ్యక్తి తనకు వచ్చిన ఆర్డర్‌ను డెలివరీ చేస్తున్నాడు. ఈ క్రమంలో తన బిడ్డను ఎత్తుకుని కనిపించాడు. ఆ వెనకాలే అతడి కుమారుడు తిరుగుతూ కనిపిస్తున్నాడు. పిల్లలతో కలిసి డెలివరీ చేసేందుకు రావటంపై ఆ వ్యక్తిని అడగగా.. కూతురిని ఇంట్లో వదిలేయలేక తనతో తీసుకొస్తున్నానని, తన కొడుకు డెలివరీ చేయటంలో సాయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి.
జొమాటో స్పందన..
ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సైతం స్పందించింది. తమ ఉద్యోగులకు అందించే చైల్డ్‌కేర్ ప్రయోజనాలను అందించేందుకు ఆ డెలివరీ బాయ్ వివరాలను కోరింది. ‘ఆర్డర్ వివరాలను ప్రైవేట్ మెసేజ్ ద్వారా తెలపగలరు. దాంతో ఆ డెలివరీ బాయ్‌ని కలిసి అవసరమైన సాయం అందిస్తాం.’ అని కామెంట్ చేసింది సంస్థ. మరోవైపు.. జీవితం చాలా అందమైనది, కానీ చాలా కష్టం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. తండ్రి నిజమైన హీరో అంటూ మరొకరు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్లాస్టిక్‌లా మారిపోయిన యువతి చర్మం.. అదే కారణమా?
Comments
Please login to add a commentAdd a comment