real hero
-
బిడ్డ కోసం మెట్రో ట్రాక్‌పై దూకిన తల్లి! అంతలోనే..
Real Hero Video: సమయస్ఫూర్తి.. ఒక్కోసారి దీని వల్ల పెను ముప్పులు తప్పుతుంటాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించడం వల్లే ఓ తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచాయి. అందుకే అంతా ఆయన్ని హీరోగా అభినందిస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి మూడేళ్ల పిల్లాడు మెట్రో టాక్ మీద పడిపోగా..ఆ వెంటనే అతని రక్షించేందుకు అతని తల్లి దూకేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి చేరుకుని వాళ్లను పైకి లాగే యత్నం చేశారు. ఈలోపు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ సకాలంలో స్పందించకుండా ఉంటే.. ఘోరమే జరిగేది. Heroic #PuneMetro Guard Saves 3-Year-Old's Life with Quick Thinking Read More: https://t.co/dQMGU1PHAe pic.twitter.com/YW4Q6f1wAx — Punekar News (@punekarnews) January 19, 2024 పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆయన అక్కడున్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దీంతో స్టేషన్‌కు మరికొద్ది క్షణాల్లో చేరాల్సిన రైలు.. 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఈలోపు ట్రాక్ మీద నుంచి ఆ తల్లీబిడ్డలిద్దరినీ పైకి లాగారు అక్కడున్న జనాలు. వాళ్లిద్దరికీ చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు పేరు వికాస్ బంగర్. పుణే సివిల్ కోర్టు మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇలాంటి చోట్ల పిల్లలతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. -
రియల్ హీరో వీడియో వైరల్.. ఊహించని ట్విస్ట్
పరోపకారిగా బతికే మనుషులు.. ఈరోజుల్లో కనిపించడం అరుదైపోయింది. కొందరు తాము చేసింది చిన్నసాయంగానే ఫీలైనప్పటికీ.. అవతలి వాళ్లు మాత్రం దానిని విలువైందిగా భావించొచ్చు. అలా ఓ పసిప్రాణాన్ని కాపాడిన వ్యక్తి అదేమంత పెద్దసాయం కాదని అంటుంటే.. ఊహించని ప్రతిఫలం, అదీ ఎంతోకాలంగా అతను ఎదురుచూస్తుందే దక్కింది ఇప్పుడు.. కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి ఓ పసికందును కాపాడిన వీడియో గత కొన్నిరోజులుగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ఒక పెద్దావిడ ఓ చిన్నారిని స్ట్రోలర్‌లో పెట్టుకుని తీసుకెళ్లే యత్నం చేస్తుంది. ఆ టైంలో ఆమె కారులో ఏదో సర్దుతుంటే.. గాలి బలంగా వీయడంతో ఆ స్ట్రోలర్ దానంతట అదే వాహనాలు తిరుగుతున్న రోడ్డు వైపుగా వెళ్తుంటుంది. ఆమె అప్రమత్తమయ్యేలోపు కిందపడిపోగా.. ఓ వ్యక్తి ఆపద్బాంధవుడిలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్నారిని రోడ్డు మీదకు వెళ్లకుండా రక్షించాడు. కట్ చేస్తే.. ఆ వ్యక్తి చేసిన సాహసానికి ఇప్పుడు నజరానా లభించింది. అదేంటో కాదు.. అతనికి ఉద్యోగం!. ఆ ఘటనకు ముందు ఆపిల్‌బీ అనే రెస్టారెంట్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యాడతను. అది అయిపోయి బయటకు రాగానే.. ఈ ఘటన జరిగింది. అయితే.. ఆ వ్యక్తి సాహసం వైరల్ కావడంతో.. ఆ కంపెనీ వాళ్లు అతన్ని పిలిచి మరీ తమ ఫ్రాంచైజీల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇచ్చారట. దీంతో అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఆ వ్యక్తి పేరు రోన్ నెస్మ్యాన్. సొంతిల్లు లేదు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గత ఎనిమిది నెలల నుంచి దగ్గరి బంధువు ఇంట్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ ఇంటర్వ్యూకు వెళ్లిన అతనికి.. ఆపదలో ఉన్న చిన్నారి కంటపడింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను రక్షించి.. రియల్ హీరోగా అందరితో ప్రశంసలు అందుకున్నాడు. ఆ క్షణం ఆ పెద్దావిడ భయంతో వణికిపోతుంటే.. ఆమెను కౌగిలించుకుని ధైర్యం చెప్పి ఓదర్చాడట ఈ రియల్ హీరో. Another HERO😊 surveillance video captures a homeless man saving a baby in a stroller rolling toward heavy traffic. The baby’s aunt was unloading items on the backseat of her SUV parked outside of the A1 Hand Car Wash, when the stroller started to roll away towards the street.… pic.twitter.com/wihD0EmNFQ — DeL2000 (@DeL2000) May 4, 2023 -
వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో..
అకస్మాతుగా సంభవించిన భారీ వరదలో చిక్కుకున్న ఇద్దరు బాలురను ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ వ్యక్తి. ఇద్దరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి ఆ పిల్లల తండ్రి అయి ఉంటాడని అనుకున్నారు. కానీ ఓ సాధరణ వ్యక్తి అని తెలిశాక అభినందించారు. పిల్లల్ని కాపాడిన వ్యక్తిని ఫొటోగ్రాఫర్ అలీ బిన్ నాసర్ అల్ వార్దిగా గుర్తించారు. ఒమన్‌లో ఈ ఏడాది మొదట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిజెన్ అనే మహిళ దీన్ని షేర్ చేయగా.. దాదాపు నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వ్యక్తి సాహసాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఇతను రియల్ హీరో అంటూ కొనియాడారు. He is a hero! 💞pic.twitter.com/wKcUKVQpmH — Figen (@TheFigen_) December 21, 2022 చదవండి: గుట్టలు గుట్టలుగా శవాలు.. అయినా కరోనాతో ఒక్కరూ చనిపోలేదట..! -
పిల్లలతో ఇంటింటికి తిరుగుతూ ఫుడ్ డెలివరీ.. నెటిజన్లు ఫిదా!
అవాతంరాలను దాటుకుంటూ కుటుంబ పోషన కోసం ఫుడ్ డెలివరీ చేస్తున్న పలువురి వీడియోలు సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. అలాంటి వీడియోనే మరోకటి వెలుగులోకి వచ్చింది. ఓ జొమాటో డెలివరీ బాయ్.. తన కూతురిని ఎత్తుకుని, కొడుకుని చేతపట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఆహారం అందిస్తున్నాడు. ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వాని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘ఆయనను చూడంటం నాకు స్ఫూర్తినిచ్చింది. ఒకవ్యక్తి కావాలనుకుంటే ఏదైనా చేయగలడనే విషయాన్ని మనం నేర్చుకోవాలి.’ అంటూ రాసుకొచ్చారు సౌరభ్. ఆ వీడియోలో.. ఓ వ్యక్తి తనకు వచ్చిన ఆర్డర్‌ను డెలివరీ చేస్తున్నాడు. ఈ క్రమంలో తన బిడ్డను ఎత్తుకుని కనిపించాడు. ఆ వెనకాలే అతడి కుమారుడు తిరుగుతూ కనిపిస్తున్నాడు. పిల్లలతో కలిసి డెలివరీ చేసేందుకు రావటంపై ఆ వ్యక్తిని అడగగా.. కూతురిని ఇంట్లో వదిలేయలేక తనతో తీసుకొస్తున్నానని, తన కొడుకు డెలివరీ చేయటంలో సాయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. జొమాటో స్పందన.. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సైతం స్పందించింది. తమ ఉద్యోగులకు అందించే చైల్డ్‌కేర్ ప్రయోజనాలను అందించేందుకు ఆ డెలివరీ బాయ్ వివరాలను కోరింది. ‘ఆర్డర్ వివరాలను ప్రైవేట్ మెసేజ్ ద్వారా తెలపగలరు. దాంతో ఆ డెలివరీ బాయ్‌ని కలిసి అవసరమైన సాయం అందిస్తాం.’ అని కామెంట్ చేసింది సంస్థ. మరోవైపు.. జీవితం చాలా అందమైనది, కానీ చాలా కష్టం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. తండ్రి నిజమైన హీరో అంటూ మరొకరు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Saurabh Panjwani (@foodclubbysaurabhpanjwani) ఇదీ చదవండి: ప్లాస్టిక్‌లా మారిపోయిన యువతి చర్మం.. అదే కారణమా? -
రియల్ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!
తన ప్రాణం పోతుందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, తన ప్రాణం పోయినా.. ఇతరులను కాపాడాలని చూసేవాళ్లను ఏం అనాలి?. రియల్ హీరో అనడం ఎంతమాత్రం తక్కువ కాదు. క్షణాల్లో ఘోర ప్రమాదం జరుగుతుందని తెలిసి.. తన ప్రాణం పోయిన పర్వాలేదనుకుని వంద మందికి పైగా ప్రాణాలు నిలబెట్టాడు యాంగ్ యోంగ్. దక్షిణ చైనాలో హైస్పీడ్ బుల్లెట్ రైలు డీ2809 శనివారం ప్రమాదానికి గురైంది. గుయిజౌ ప్రావిన్స్‌లో బుల్లెట్ రైలు ప్రమాదానికి గురికాగా.. డ్రైవర్ కోచ్ నుజ్జునుజ్జు అయ్యి అందులోని డ్రైవర్ యాంగ్ యోంగ్ ప్రాణం విడిచాడు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడగా.. 136 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు చేపట్టిన అధికారులకు.. ట్రైన్ డేటా ఆధారంగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. డీ2809 రైలు.. గుయియాంగ్ నుంచి రోంగ్జియాంగ్ స్టేషన్ల మధ్య ఒక టన్నెల్ వద్దకు చేరుకోగానే.. డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు అధికారులు. అయితే.. టన్నెల్‌కు చేరుకునే ముందు ట్రాకుల మీద అసాధారణ పరిస్థితులను యాంగ్ గుర్తించాడు. వెంటనే.. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేశాడు. దీంతో ముందున్న బురద, మట్టి కుప్పలను బలంగా ఢీకొట్టి రైలు సుమారు 900 మీటర్ల దూరం జారుకుంటూ ముందుకు వెళ్లింది. ఆపై స్టేషన్ వద్ద బోల్తా పడడంతో డ్రైవర్ కోచ్ బాగా డ్యామేజ్ అయ్యింది. Train driver on D2809 "5 second braking" : Emergency braking becomes muscle memory, Yang Yong did everything he could pic.twitter.com/IkiMUvcknt — tigers tiger (@tigerstiger1) June 5, 2022 యోంగ్ బ్రేకులు గనుక వేయకుండా ఉంటే.. పూర్తిగా బల్లెట్రైలే ఘోర ప్రమాదానికి గురై భారీగా మృతుల సంఖ్య ఉండేది!. కానీ, యోంగ్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. తన ప్రాణం కన్నా ప్రయాణికులే ముఖ్యం అనుకున్నాడు. యోంగ్ నేపథ్యం.. ఆయన ఇంతకు ముందు సైన్యంలో పని చేశారు. రిటైర్ అయిన తర్వాత.. కో-డ్రైవర్‌గా, అసిస్టెంట్ డ్రైవర్‌గా, ఫోర్‌మ్యాన్‌గా, డ్రైవర్ ఇన్‌స్ట్రక్టర్‌గా, గ్రౌండ్ డ్రైవర్‌గా.. చివరికి ట్రైన్ డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టాడు. దేశం కోసం సేవలు అందించిన వీరుడు.. చివరకు జనాల ప్రాణాలను కాపాడడం కోసమే ప్రాణాలు వదిలాడు. యోంగ్ చేసిన త్యాగం.. ఆ దేశాన్ని కంటతడి పెట్టించింది. రియల్ హీరోగా ఆయన్ని అభివర్ణిస్తోంది. తనను తప్ప.. మిగతా అందరినీ కాపాడుకున్న ఆ హీరోను ఆరాధిస్తోంది ఇప్పుడు అక్కడ. యోంగ్ పార్థివదేహానికి అతని స్వస్థలం గుయిజౌలోని జున్యీ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో ప్రజల కన్నీళ్ల మధ్య ఘనంగా జరిగింది. The heroic driver of #D2809 Yang Yong returned to his hometown of #Zunyi , #Guizhou , under the escort of the convoy. Locals spontaneously lined the way to bid farewell Welcome home heroes. 6月5日,D2809司机杨勇在车队护送下回到家乡贵州遵义。当地人自发夹道送别:“欢迎英雄回家!” pic.twitter.com/c8OokOdx24 — Michael Franklin ( 100% follow back) (@Michael04222710) June 6, 2022 -
సోనూసూద్: ఓ ఇంట్రస్టింగ్ వీడియో
సాక్షి,హైదారాబాద్: వలస కార్మికులు,పిల్లలు పెద్దలు ఇలా కరోనా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నవ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే..ఎవరికైనా మదిలో మెదిలో ఒకే ఒక్క పేరు నిస్సందేహంగా సోనూ సూద్. తన విశేష సేవలతో రిలయ్ హీరోగా ప్రశంసంలందుకుంటున్న సోనూసూద్‌కు అనేకమంది అనేక రకాలుగా తమ కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలోని ఆయన నివాసానికి వెళ్లి తమ సంతోషాన్ని పంచు కుంటున్నారు. తాజాగా ఒక ఆర్టిస్టు వీడియో ఒకటి ఆసక్తికరంగా నిలిచింది. కోవిడ్ వారియర్‌గా సోనూసూద్ అందిస్తున్న సేవలకు ట్రిబ్యూట్‌గా పుచ్చకాయతో సోనూసూద్ చిత్రాన్ని అందంగా తీర్చి దిద్దారు ఆర్టిస్ట్ పర్వేష్. ఇటీవల ఒక డ్యాన్స్ రియాలిటీ షోకు అతిథిగా హాజరైన సోను ఒక కంటెస్టెంట్ ఉదయ్ సింగ్ షేర్ చేసిన అంశాలపై కదిలిపోయారు. లాక్డౌన్ కాలంలో మధ్యప్రదేశ్లోనిఇ నీముచ్ గ్రామస్తులు పడుతున్న కష్టాలపై ఉదయ్ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో వెంటనే స్పందించిన సోనూ ఒక నెల, రెండు నెలలు లేదా ఆరు నెలలు ఎన్నాళ్లు లాక్డౌన్ కొనసాగినా, తిరిగి మామూలు పరిస్థితులు వచ్చేంతవరకూ గ్రామం మొత్తానికి రేషన్ అందించేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సోనూ వాయిస్ బ్యాక్ గ్రౌండ్‌తో సాగే ఈ విడియో ప్రస్తుతం నెటిజనులను ఆకట్టుకుంటోంది. కాగా కరోనా మహమ్మారి, జాతీయ లాక్డౌన్లో సొంతూళ్లకు పయనమైన వలస కార్మికుల వెతలతో చలించిపోయిన సోనూ సూద్ నేనున్నానటూ రంగంలోకి దిగారు. అది మొదలు ఎడతెరిపి లేకుండా బాధితులకు అండగా నిలుస్తునే ఉన్నారు. ముఖ్యంగా సెకండ్‌వేవ్‌లో మందులు కొరత, ఆక్సిజన్ కొరతతో ఊపిరి ఆడక అల్లాడిపోతున్నవారిని ఆదుకునేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. సోనూ సూద్ ఫౌండేషన్ ద్వారా నిర్మాణాత్మక కార్యక్రమాలతో వేలాదిమందికి అండగా నిలుస్తూ నిరంతాయంగా సేవలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్ Tell us you are @SonuSood fan without telling us you are a Sonu Sood fan? we’re all thankful to all the Covid Warriors and here’s a small tribute to him. ❤️🙏 .@SoodFoundation .#sonusood #sonusood_a_real_hero #sonusoodfoundation #sonusoodfans pic.twitter.com/VmXi1mEUbW — Artistparvesh (@parveshkumarart) June 5, 2021 -
సోనూ సూద్ క్రేజ్ అంటే ఇదే!
సాక్షి, హైదరాబాద్ : ‘వదల బొమ్మాళీ’ అంటూ రీల్ విలన్‌గా అభిమానులను ఆకట్టుకున్న విలక్షణ నటుడు సోనూ సూద్ కరోనా సంక్షోభం సమయంలో తన పెద్ద మనసుతో రియల్ హీరోగా అవతరించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా కూడా వదల బొమ్మాళీ తరహాలో వెంటాడుతున్నారు. కానీ వీరంతా వెంటాడుతున్నది మాత్రం తాము అభిమానించే రియల్ హీరోమీద ఉన్న అంతులేని అభిమానంతో. తాజాగా షిర్డీలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన పరిణామం గురించి తెలుసుకోవాలి. (వంద స్మార్ట్ఫోన్లు గిప్ట్ ఇచ్చిన రియల్ హీరో) సోనూసూద్ షిరిడీ సాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. సోనూ సూద్ రాకతో ఆలయ అధికారులు, అర్చకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో అక్కడ అభిమానుల కోలాహం నెలకొంది. సోనూ వచ్చారనే వార్త తెలియగానే భక్తులతో పాటు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. సోనూని చూడగానే ‘రియల్ హీరో, రియల్ హీరో’.. ‘లవ్యూ సార్’.. అంటూ నినాదాలు చేశారు. ఫోటోలు క్లిక్‌మనిపిస్తూ.. వారంతా సందడి చేశారు. దీంతో సోనూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలోఎందరో వలస కార్మికులను ఆపద్బాంధవుడిలా ఆదుకున్నవారిలో సోనూ సూద్ టాప్‌లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ఇప్పటికీ అవసరమైన వారికి సాయమందిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దీనికి బాధితుల కృతజ్ఞతలతోపాటు, పలువురి ప్రశంసలను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆచార్య యూనిట్ సభ్యులకు 100 స్మార్ట్పోన్లను ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. కాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో సోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సోనూ సూద్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘అల్లుడు అదుర్స్’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. -
రియల్ హీరో
-
చెయ్యి వదల్లేదు
‘మగాళ్లు’ సినిమాల్లోనే ఉంటారు. ఒకేసారి పదిమందిని చితక్కొట్టేస్తుంటారు. సిటీలో ‘భాయ్’ మనుషుల్ని ... (బీప్) పోయిస్తుంటారు. బంగీ జంప్‌లు చేస్తుంటారు. లుంగీ డ్యాన్స్‌లు వేస్తుంటారు. ఓ సినిమాలో విలన్ అంటాడు.. హీరో గురించి.. ‘ఆడు మగాడ్రా బుజ్జే..’ అని! మీరిప్పుడు అలాంటి మగాణ్ణే రియల్ లైఫ్‌లో చూడబోతున్నారు! అతడు ఫైట్ చేసింది, చేస్తున్నది.. తన భార్యపై సామూహిక అత్యాచారం జరిపిన తొమ్మిది మంది కీచకులకు శిక్ష వేయించడం కోసం! మూడేళ్లు అతడీ పోరాటం చేస్తున్నాడు. భార్యతో కలిసి చేస్తున్నాడు. అతడి పేరు జితేందర్ ఛాతర్. హరియాణా రాష్ట్రానికి చెందిన సాధారణ యువ రైతు. కీచక సంతతి చేతిలో చిత్రవధ అనుభవించిన అభాగ్యురాలికి కొత్త జీవితాన్ని ఇవ్వడమే కాకుండా న్యాయం కోసం నిరంతర పోరాటం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ న్యాయ పోరాటానికి దారి తీసిన పరిస్థితులేమిటి? అతడి మాటల్లోనే విందాం.‘‘ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. కొన్నేళ్ల క్రితం నా భార్యపై ఎనిమిది మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ఫొటోలు, వీడియో తీశారు. వాటితో ఆమెకు ఏడాదిన్నర పాటు నరకం చూపించారు. ఈ కిరాతకం జరిగేనాటికింకా మాకు పెళ్లి కాలేదు. 2015, సెప్టెంబర్‌లో మాకు నిశ్చితార్థం జరిగింది. హరియాణాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆచారం ప్రకారం పెళ్లికొడుకు పెళ్లి వరకు అమ్మాయిని మళ్లీ చూడటానికి వీల్లేదు. మేము ఫోన్లో తరచు మాట్లాడుకునేవాళ్లం. మాది జింద్ జిల్లాలోని ఛాతర్ గ్రామం. జింద్ నగరంలో ఆమె ఉండేది. మా రెండూళ్ల మధ్య 30 కిలోమీటర్ల దూరం. ఓరోజు నాతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని, వెంటనే రావాలని కోరింది. అమ్మానాన్నతో కలిసి రెండోసారి వాళ్ల ఊరెళ్లాను. ఆమె నోటి నుంచి వచ్చిన మాట వినగానే.. ఏం మాట్లాడాలో కాసేపు అర్థం కాలేదు. ‘నన్ను పెళ్లి చేసుకోవద్దు. వివాహ బంధానికి నేను పనికిరాను’ అని చెప్పడంతో నిర్ఘాంతపోయాను. ఏం జరిగిందని అడిగితే అసలు విషయం చెప్పింది. తాను అత్యాచార బాధితురాలినని, దీన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని సజల నేత్రాలతో నాపైపు సూటిగా చూస్తూ చెప్పేసరికి నేనేమీ మాట్లాడలేకపోయాను. నా అంతరాత్మ లోలోపల నన్ను ప్రశ్నిస్తోంది. ‘ఈమెను పెళ్లి చేసుకోకపోతే దేవుడు నిన్ను క్షమించడు’అని మనస్సాక్షి ఘోషించడంతో ‘నిన్నే పెళ్లి చేసుకుంటాన’ని ప్రమాణం చేశాను. పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, నీకు న్యాయం జరిగేలా చేస్తానని దృఢవిశ్వాసంతో మాటిచ్చాను. బెదిరింపులు.. ప్రలోభాలు నాకు కాబోయే భార్య ఇంటికి వెళ్లొచ్చిన రెండు వారాల తర్వాత రేపిస్టుల భరతం పట్టే పనికి శ్రీకారం చుట్టాను. ఎనిమిది మంది దుండగులపై అప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా న్యాయవాదిని నియమించుకుని న్యాయ పోరాటం మొదలుపెట్టాను. నాకు, ఆమె కుటుంబానికి బెదిరింపులు వచ్చినా లెక్కచేయకుండా 2015 డిసెంబర్లో మేము పెళ్లి చేసుకున్నాం. నిందితులు యువకులు. పైగా రాజకీయ నేపథ్యం ఉన్న ధనవంతులు. మా ఇంటికి రౌడీలను పంపించి మమ్మల్ని బెదిరించారు. పోలీసులకు మేము ఇచ్చిన ఆధారాలు కోర్టు ముందుకు రాకుండా చేశారు. అంతేకాదు నామీద మూడు తప్పుడు కేసులు పెట్టించారు. ఆ సమయంలో మా ఇద్దరికీ మా అమ్మానాన్న అండగా నిలిచారు. ఎన్నివిధాలుగా బెదిరించినా లొంగకపోవడంతో మమ్మల్ని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. కేసు వెనక్కి తీసుకుంటే భారీగా డబ్బు ఇస్తామని ఆశ చూపారు. నిందితులను జిల్లా కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంతో నేను హైకోర్టు తలుపు తట్టాను. న్యాయం జరిగే వరకు పోరాడాలన్న పట్టుదలతో ముందుకు సాగాను. కోర్టు ఫీజుల కోసం ఛాతర్ గ్రామంలో మాకున్న స్థలంలో కొంత అమ్మేసి రూ. 14 లక్షలు సమకూర్చుకున్నాను. అంతేకాదు కోర్టుకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో సొంత ఊరిని, మాకున్న వ్యాపారాన్ని వదిలిపెట్టి జింద్ నగరంలో మకాం పెట్టాం. ఈ సమయంలో ఎంతో మానసిక వేదన అనుభవించాం. నా భార్యపై అమానుషకాండ సాగించిన కామాంధులకు శిక్ష పడాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. మరోవైపు కోర్టు ఫీజులు భరించలేక, ఇతర లాయర్లపై నమ్మకం సడలిపోవడంతో న్యాయవాద విద్య అభ్యసిస్తున్నాను. నా భార్యను కూడా లాయర్ కోర్స్ చదివిస్తున్నాను. చండీగఢ్ వెళ్లిపోతున్నాం మేము సాగిస్తున్న సుదీర్ఘ న్యాయపోరాటానికి నా తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. వారు అందించిన అండదండల కారణంగానే ఛాతర్ గ్రామస్తుల్లో చాలా మంది మా పక్షాన నిలబడ్డారు. నా భార్య తరపున న్యాయ పోరాటం చేయాలన్న నిర్ణయాన్ని మా పెళ్లికి ముందే మొత్తం పంచాయతీ సమర్థించింది. మా చదువు పూర్తైన తర్వాత చండీగఢ్‌కు వెళ్లిపోవాలనుకుంటున్నాం. మేమిద్దరం కలిసి న్యాయవాదులుగా అక్కడ ప్రాక్టీస్ మొదలు పెడతాం. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు న్యాయ సేవలు అందించేందుకు మా చదువును ఉపయోగిస్తాం. మాకిప్పుడు రెండేళ్ల బాబు ఉన్నాడు. హరియాణాలోని దుష్ట పితృస్వామ్య వ్యవస్థ ఛాయలు మా కుమారుడిపై పడకుండా వాడిని చండీగఢ్‌లో చదివించాలనుకుంటున్నాం. మహిళల జీవితాలను నాశనం చేస్తున్న అత్యాచార సంస్కృతికి దూరంగా వాడిని పెంచాలనుకుంటున్నాం. మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి గొంతు విప్పే రోజులు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నాను. ఇప్పటికే అర్బన్ ఇండియాలో మీటూ ఉద్యమం మొదలైంది. పల్లెటూరి పడతుల విషయంలోనూ పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నాం. ఇందుకోసం నేను, నా భార్య మా వంతు ప్రయత్నం చేస్తాం. మార్పు కోసం ఎదురు చూస్తున్నాం’’ అని వివరించాడు జితేందర్. ఇలా స్ఫూర్తిదాయక పోరాటం సాగిస్తున్న జితేందర్ ఛాతర్పై ‘సన్ రైజ్’ పేరుతో త్వరలో డాక్యుమెంటరీ రానుంది. జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ ఫిల్మ్ మేకర్ విభా బక్షి ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ హీరో గురించి మరికొంచెం హరియాణాలో మహిళలపై లైంగిక దాడులు చాలా పెద్ద సమస్య. హరి (విష్ణువు) నిలయంగా వాసికెక్కిన హరియాణాలో దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లోనూ జరగనన్ని సామూహిక అత్యాచారాలు నమోదయ్యాయి. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా బయటకి చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు. సమాజం మొత్తం బాధిత మహిళలనే నిందిస్తుంది కాబట్టి తమపై జరిగే దారుణాల గురించి బయటపెట్టడానికి భయపడతారు. విష్ణువు నడయాడిన నేలగా చెప్పుకుంటున్న హరియాణాలో ఆడపిల్లల మానప్రాణాలకు రక్షణ లేకపోవడం జితేందర్‌ను ఎంతగానో కలచివేసింది. ఛాతర్ గ్రామంలో బాలికల పాఠశాల దగ్గర జులాయిలు కాపుకాసి అమ్మాయిలను నిత్యం అల్లరి పెట్టేవారు. తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ స్కూల్ మాన్పించేస్తారోనన్న భయంతో ఆ బాలికలు మౌనంగా ఇవన్నీ భరించేవారు. ఛాతర్ నుంచి ఆర్టీసీ బస్సులో జింద్ నగరానికి వెళ్లే కాలేజీ అమ్మాయిలు ప్రతిరోజూ పోకిరీల వెకిలి చేష్టల బారిన పడుతుంటారు. ఇలాంటివి భరించలేక చాలా కుటుంబాలు అమ్మాయిలను కాలేజీ మాన్పించేశాయి. ఆ నేపథ్యంలో.. ఎటువంటి భయం లేకుండా అమ్మాయిలు కాలేజీకి వెళ్లేందుకు జితేందర్ తన వంతు ప్రయత్నం చేశాడు. మహిళల కోసం ప్రత్యేకంగా బస్సు నడపాలని విద్యార్థిగా ఉన్నప్పుడే 2004లో ఆర్టీసీ జిల్లా మేనేజర్‌కు లేఖ రాశాడు. కొన్ని నెలల తర్వాత లేడీస్ స్పెషల్ బస్సు ఛాతర్– జింద్ మార్గంలో రోడ్డెక్కింది. అక్కడితో తన పోరాటాన్ని ఆపలేదు అతడు. లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యల నిర్మూలనకు స్థానిక ఖాప్ పంచాయతీ సహకారంతో 2013లో జింద్ జిల్లాలోని 24 గ్రామాల్లో ప్రదర్శనలు, ప్రయత్నాలు సాగించాడు. – పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
జనం కోసం తన ప్రాణాలు లెక్కచేయకుండా
-
జనం కోసం తన ప్రాణాలు లెక్కచేయకుండా..
సాక్షి, హైదరాబాద్ : పొరపాటున పట్టు తప్పితే.. అతని ప్రాణాలు నీళ్లలో కలిసిపోయేవి! కానీ ఆ సమయానికి అతను అక్కడ లేకపోతే.. నగరం ఒక పెను విషాదాన్ని చవిచూడాల్సి వచ్చేది!! అవును. ఇంకా పేరు వెల్లడికాని ఆ కానిస్టేబుల్‌ను నెటిజన్లు రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు... ఇంతకీ ఆయన చేసిన పనేంటి? ఎలా వెలుగులోకి వచ్చింది? రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరింది. పండుగ సీజన్ కావడంతో హోరువర్షంలోనూ నెమ్మదిగానైనా జనం రాకపోకలు సాగిస్తున్నారు. మాదాపూర్‌లోనైతే రికార్డు స్థాయిలో 8సెం.మీ వర్షపాతం నమోదయింది. దీంతో శుక్రవారం వరద నదిని తలపించే స్థాయిలో పారింది. అదే సమయంలో కాళి సుధీర్ అనే వ్యక్తి తన కారులో అటుగా వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని వీడియోతీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్ వైరల్ అయింది. రోడ్డు పక్కనే నిర్మాణంలో ఉన్న భవంతి వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఇనుప చువ్వలు మాత్రమే పైకి కనబడుతూ మృత్యుకుహరంలా తయారైంది. రోడ్డుపైన వెళ్లే వాహనదారులు కనీసం దానిని గుర్తించలేని పరిస్థితిలో ఓ సాధారణ ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ నిలబడి వాహనదారులకు సూచనలు ఇస్తూ కనిపించారు. కాళ్లను బలంగా నెట్టేస్తోన్న వరద.. పై నుంచి హోరు వర్షం.. వేటినీ లెక్కచేయకుండా కానిస్టేబుల్ తన విధిని నిర్వర్తించాడు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుధీర్.. ఆ కానిస్టేబుల్ ఎవరనేది తెలిస్తే, అతనికిగానీ, అతని పిల్లలకు గానీ బహుమానం ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కానిస్టేబుల్ పనిని గుర్తించినందుకుగానూ సుధీర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ హైదరాబాద్ పోలీసు శాఖ, ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. మొత్తంగా పేరు తెలియని కానిస్టేబుల్ రియల్ హీరోగా కితాబు అందుకున్నారు. @hydcitypolice this is incredible job guidng us to safety in #rains #hydpolice @KTRTRS @HYDTP salute!!! pic.twitter.com/HHUF8x2GHR — kaali Sudheer (@kaalisudheers) September 29, 2017 This is opp new care hospital . Pls let me know his details I would love to gift him something or may be his kids — kaali Sudheer (@kaalisudheers) September 29, 2017 -
92 మందిని కాపాడిన ఆపద్బాంధవుడు
-
అక్షయ్.. అసలైన హీరో!
హీరో అంటే.. అన్యాయాన్ని ఎదిరించేవాడు! హీరో అంటే.. ఆపదల్లో ఉన్నవారిని ఆదుకునేవాడు! హీరో అంటే.. సమస్యకు సరైన పరిష్కారం చూపేవాడు! ఇవన్నీ చేస్తున్నాడు కనుకే అక్షయ్ అసలైన హీరో!! మరి మిగతా హీరోలంతా ఇవే చేస్తున్నారు కదా..? కానీ అక్షయ్ తెరమీద కాదు.. నిజజీవితంలో చేస్తున్నాడు. అందుకే అతణ్ని అసలు సిసలైన హీరో అంటున్నాం. ఇంతకీ ఏం చేశాడో తెలియదా...? అయితే చదవండి.. తుపానులు వచ్చినప్పుడో, వరదలు ముంచెత్తినప్పుడో, భూకంపాలు సంభవించినప్పుడో.. ఇలా ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు మాత్రమే మన సెలబ్రిటీల్లోని మానవత్వం మేల్కొంటుంది. మీడియాకు ఫోజులిచ్చి మరీ సాయం చేస్తారు. చేసే గోరంత సాయానికి కొండంత ప్రచారం చేసుకుంటారు. కానీ వీరందరికీ భిన్నంగా.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తనలోని దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు. సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తనవంతు సాయం చేయడమే కాకుండా దేశ ప్రజల్లోనూ సమస్యపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే ముష్కరుల దాడిలో మన సైనికులు చనిపోయారు. వెంటనే చలించిన అక్షయ్ వారి కుటుంబాలకు కోటిరూపాయల ఆర్థిక సాయం అందజేశాడు. నేరుగా సైనికుల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమయ్యేలా ఓ లింక్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అంతే.. దేశ ప్రజల నుంచి కూడా కోట్లాది రూపాయల విరాళాలు అందాయి. దేశంలో ఏ ఘటనలు జరిగినా వాటి మీద కూడా ఎటువంటి బెరుకు, సంశయాలు లేకుండా తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పడం అక్షయ్‌కు అలవాటు. ఈ మధ్య బెంగళూరు నటిపై జరిగిన దాడిని కూడా అతను ఖండించాడు. ఎక్కడ ఎటువంటి ఘటన జరిగినా స్పందించాలని కోరాడు. ఆ తర్వాత వరుసపెట్టి బాలీవుడ్ అంతా బెంగళూరు ఘటనను ఖండించింది. పరిశుభ్ర భారత్ కోసం.. ఇప్పుడు మరొక వినూత్న కార్యక్రమం ద్వారా అక్కీ మన ముందుకు రాబోతున్నాడు. అదే టాయిలెట్ వీడియో. ఆరు నిమిషాల నిడివి గల ఈ వీడియో పేరు ‘‘సోచ్ ఔర్ సాచ్’’ దీనిలో మనదేశంలో టాయిలెట్ల అవసరాన్ని తెలుపుతూ.. ప్రజలలో అవగాహన కల్పించడం కోసమే ఈ వీడియో రూపొందించినట్లు ఆయన తెలిపారు. త్వరలో విడుదలయ్యే తన సినిమా ‘‘టాయిలెట్– ఒక ప్రేమ కథ’’ షూటింగ్ సందర్భంగా తెలుసుకున్న విషయాలు తనను కదిలించాయని అక్షయ్ తెలిపారు.అందుకనే బహిరంగ మల విసర్జనపై ప్రజల్లో అవగాహన.. మన దేశంలో మరుగుదొడ్ల కొరత గురించి ఈ వీడియోలో చూపించామన్నారు. ఆ వీడియోలో అక్షయ్ ఏమన్నాడంటే.. ‘గ్రామాలలో మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. వారికి మరుగు దొడ్లు లేక ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి పూట బహిర్భూమికి వెళ్తున్నారు. భారతదేశం అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదుగుతోంది. కానీ ఇప్పటికి చాలా మంది స్త్రీలు మరుగుదొడ్లు వాడటానికి ఇష్టపడటంలేదు. ఇలా బహిర్భూమికి వెళ్లే స్త్రీలు, పిల్లలు ప్రమాదకరమైన వ్యాధులబారిన పడుతున్నారు. దీనివల్ల రోజుకి దాదాపు 1000 మంది పిల్లలు చనిపోతున్నారు. మీకందరికి ఒకే ఇంట్లో పడక గది, ఒక కిచెన్ కావాలి. మరి మరుగు దొడ్డి ఎందుకు వద్దు? ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అందరూ పరిశుభ్రంగా ఉంటేనే స్వచ్ఛ్భారత్ కల నెరవేరుతుంది. ప్రజలంతా కొంత డబ్బుని సాయం చేయడం ద్వారా మత సంబంధిత కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించవచ్చు. - సాక్షి, స్కూల్ ఎడిషన్ -
నవ్విన వారిముందే రియల్ హీరో అయ్యాడు!
ఎవరు విసుక్కున్నా, చిరాకు పడినా నిరాశ పడలేదు హజబ్బా. వెనక్కి తగ్గలేదు. తాను పొదుపు చేసిన, సేకరించిన డబ్బుతో ఊళ్లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు. ఆ విదేశీ పర్యాటకులు ఒకటికి రెండు సార్లు అడిగినా హజబ్బా దగ్గర జవాబు లేదు. అతనికి అవమానంగా, బాధగా అనిపించింది. ‘‘నేను చదువుకొని ఉండి ఉంటే ఇలా జరిగేదా?’’ అనుకున్నాడు మనసులో. మంగుళూరు(కర్నాటక)కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప్డు గ్రామంలో కమలాఫలాలు అమ్ముతాడు హజబ్బా. ఒకరోజు ఆ ఊరికి వచ్చిన విదేశీ పర్యాటకులు కమలా ఫలాల ధర గురించి హజబ్బాను అడిగారు. వారు దేని గురించి అడుగుతున్నారో హజబ్బాకు అర్థం కాలేదు. కాస్త అవమానంగా కూడా అనిపించింది. ఈలోపు ఎవరో వచ్చి- ‘‘ఈ పండ్ల ధరల గురించి అడుగు తున్నారు’’ అని చెప్పారు. ఈ సంఘటన హజబ్బాలో చాలా మార్పు తీసుకొచ్చింది. ‘పేదరికం కారణంగా నేను చదువుకోలేకపోయాను. కాస్తో కూస్తో చదువుకొని ఉంటే వాళ్లు మాట్లాడింది అర్థం చేసుకునేవాడిని కదా. నాలాంటి పరిస్థితి పేద పిల్లలెవరికీ రాకూడదు. వారి కోసం ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నాడు. దానికోసం... ‘ఎలాగైనా సరే... నా ఊళ్లోని పేద పిల్లల కోసం ఒక బడి కట్టిస్తాను’ అనుకున్నాడు బలంగా. ఏ మంచి పనీ అవరోధాలు లేకుండా పూర్తి అవ్వదు అంటారు. హజబ్బాకి కూడా అలాంటి అవరోధాలే ఎదురయ్యాయి. పేద పిల్లల కోసం స్కూలు కట్టాలన్న అతని ఆలోచన విని కొందరు వెటకారంగా నవ్వారు. కొందరు ‘స్కూలు కట్టడం అంటే అంత తేలికను కున్నావా?’ అని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. హజబ్బా భార్య మైమూన కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘ముందు మన ముగ్గురు పిల్లల భవిష్యత్ గురించి ఆలో చించండి’’ అంది. అయితే భర్తలోని పట్టు దల, నిజాయితీ చూసి మనసు మార్చు కుంది. భర్తకు అండగా నిలబడింది. అయితే ఎవరి అండనూ కోరుకోలేదు హజబ్బా. అతని లక్ష్యం పట్ల అతనికి స్పష్టత ఉంది. అందుకే సాధన మొదలు పెట్టాడు. మొదట స్కూలు కోసం కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే స్కూలు కట్టించడానికి తాను పొదుపు చేసిన డబ్బు సరిపోదని అర్థమైంది. దాంతో గడపా గడపా తిరుగుతూ తోచిన సహాయం చేయమని కోరేవాడు. ఈ క్రమంలో అతనికి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఓసారి సహాయం కోసం ఒక సంపన్నుడి ఇంటికి వెళ్తే... ఒక్క పైసా సహాయం చేయకపోగా తన ఇంట్లో ఉన్న కుక్కను హజబ్బా మీదికి వదిలాడు. ఎవరు విసుక్కున్నా, చిరాకు పడినా, అదిలించినా, కోపగించుకున్నా నిరాశ పడలేదు హజబ్బా. తాను పొదుపు చేసిన, సేకరించిన డబ్బుతో ఊళ్లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు. ఆ విషయం పదిమంది దృష్టిలో పడింది. స్థానిక దినపత్రికలో హజబ్బా మీద స్ఫూర్తిదాయక కథనం వచ్చింది. ఒక జాతీయ చానల్ వాళ్లు ‘రియల్ హీరోస్’ అవార్డును ఇచ్చారు. వాళ్లు ఇచ్చిన అయిదు లక్షల్ని కూడా స్కూలు కోసమే వెచ్చించాడు హజబ్బా. దీంతో మొదట నవ్విన వాళ్లందరికీ అతడి నిజాయితీ అందరికీ అర్థమైంది. హజబ్బా నిర్మించిన స్కూలు ఇప్పుడు సెకెండరీ స్కూల్‌గా మారింది. ‘‘స్కూలు కట్టించడం వరకే నా పని’’ అంటూ ఆ స్కూలును ప్రభుత్వపరం చేశాడు హజబ్బా. స్కూలుకు తన పేరు పెట్టాలనే ప్రతిపాదనను కూడా తిరస్క రించాడు. దాంతో అతడి ఔన్నత్యం మరింత వెలుగులోనికి వచ్చింది. అతడికి అభిమానులు ఏర్పడ్డారు. అరకొర సౌకర్యా లున్న ఇంట్లో నివసిస్తూ అనారోగ్యానికి గురవుతున్న హజబ్బాకు వాళ్లంతా మంచి ఇల్లు కట్టించారు. తన పేదరికం గురించి ఆలోచించకుండా పేదపిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్న హజబ్బాపై జిల్లా, రాష్ర్ట స్థాయిలోనే కాదు జాతీయంగా కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే అవేమీ పట్టించుకోడు హజబ్బా. తన పని తాను చేసుకు పోతాడు. ప్రస్తుతం గ్రామంలో ప్రి-యూనివర్శిటీ నిర్మాణ పనుల్లో తలమునకలవుతున్నాడు. -
ఇది నిజమైన హీరో కథ
ముంబై: ఆయన నిజమైన హీరో. భారత దేశ స్వాతంత్య్రం కోసం దాదాపు ఐదేళ్లపాటు పోరాటం చేశారు. జైలుకు కూడా వెళ్లారు. పిన్న వయసులోనే పెద్ద పని చేశావంటూ సాక్షాత్తు జాతిపిత మహాత్మా గాంధీ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడిగా సర్టిఫికేట్ సాధించేందుకు భారత బ్యూరోక్రసీపై ఏకంగా 32 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఈ రెండో పోరాటంలో భాగంగా 321 ఆఫీసుల తలుపులు తట్టారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు 1043 లేఖలు రాశారు. 66000 మెట్లు ఎక్కారు. ఆయనే గౌర్ హరి దాస్. మహారాష్ట్ర సరిహద్దులోవున్న ఒడిశాలోని జాడ్పీపల్ గ్రామంలో పుట్టి పెరిగిన హరిదాస్ తన తండ్రి (సీనియర్ హరి దాస్. ఆయన కూడా స్వాతంత్య్ర సమర యోధుడే) నుంచి స్ఫూర్తి పొంది 14వ ఏటనే స్వాతంత్య్ర సంగ్రామంలో అడుగు పెట్టాడు. తోటి వారితో కలసి ‘వానర సేన’ను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన సాహిత్యాన్ని ప్రచురించడం, వాటిని రహస్యంగా ప్రజలకు అందజేయడం వానర సేన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని హరిదాస్ చిత్తశుద్ధిగా చేశారు. 1945, జనవరి 26వ తేదీన బ్రిటీషర్స్ ఆజ్ఞలను ధిక్కరించి ఓ వీధి కూడలిలో భారత జెండాను ఎగరవేసినందుకు అరెస్టయ్యారు. బాలాసోర్ జైల్లో రెండు నెలల పాటు శిక్ష అనుభవించారు. విడుదలైన అనంతరం కూడా దేశ స్వాతంత్య్ర కోసం పోరాటం కొనసాగించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక తండ్రి, అన్నాదమ్ములు, అక్కా చెళ్లెల్లతో కలసి ముంబాయికి మారారు. దేశం తొలి ఎన్నికల ప్రచారంలో కూడా హరిదాస్ చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు తనకు సహకరించిన లక్ష్మీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. 1975లో భారత ప్రభుత్వం తొలిసారి స్వాతంత్య్ర సమరయోధుల కోసం పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. అందుకు అందరిని సర్టిఫికేట్లు తీసుకోమంది. అప్పటికే ముంబైలోని ‘ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ)లో పనిచేస్తున్నందున హరి దాస్ తనకు సర్టిఫికెట్ అనవసరమని ఊరుకున్నారు. 1976లో తన పెద్ద కుమారుడిని రాష్ట్రంలోని 'వీర్ మాతా జీజాభాయ్ టెక్నాలోజికల్ ఇనిస్టిట్యూట్' ఇంజనీరింగ్ కోర్సులో చేర్చేందుకు తీసుకెళ్లారు. మార్కులు తక్కువున్నందున సీటు రాకపోవచ్చని, స్వాతంత్య్ర యోధుల పిల్లలకు కొంత రిజర్వేషన్ ఉందని, స్వాతంత్య్ర యోధుడిగా సర్టిఫికేట్ తీసుకురమ్మని కాలేజీ యాజమాన్యం సూచించింది. దాంతో హరి దాస్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముంబై మున్సిపాలిటీ, రాష్ట్ర సచివాలయం మధ్య కాళ్లు అరిగేలా తిరిగుతూ వచ్చారు. ఇరుగుపొరుగు వాళ్లు పిచ్చోడని ముద్ర వేశారు. పిచ్చా, వెర్రా? అంటూ తోటి వారూ గేలి చేశారు. అయినా ఆయన పట్టించుకోలేదు. ఒక్క భార్య లక్ష్మీ మాత్రమే ఆయన ఆవేదనను అర్థం చేసుకొని అండగా నిలిచింది. దేశ స్వాతంత్య్రం కోసం కూడా తాను ఎన్నడూ ఇంత కష్టపడలేదని, భారత బ్యూరోక్రసిపై పోరాటం చేయడమే కష్టంగా ఉందని ఆయన భావించిన రోజులున్నాయి. తండ్రిని నమ్ముకుంటే తన చదువుకాస్త గంగలో కలుస్తుందని భావించిన ఆయన కుమారుడు ఈలోగా కష్టపడి చదవి మెరిట్ ద్వారానే సీటు సంపాదించి ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశారు. అయినా సరే! తన పోరాటాన్ని హరి దాస్ ఆపలేదు. చివరకు తన అకుంఠిత పోరాటం వల్లనైతేమీ, తనకు సహకరించిన ఎన్జీవో సంస్థల తోడ్పాటు వల్లనైతేమీ 2008, చివరలో స్వాతంత్య్ర సమర యోధుడిగా సర్టిఫికేట్ సాధించారు. అయినా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. తనకు కావాల్సిందీ గుర్తింపు సర్టిఫికెట్‌గానీ పెన్షన్ కాదన్నారు. ఇప్పుడు ఆ హరి దాస్‌కు 84 ఏళ్లు. అల్జీమర్స్ తొలిదశ వల్ల జ్ఞాపక శక్తి, వినికిడి తగ్గింది. అయినా ఆయన తన పోరాటానికి సంబంధించిన ప్రతి కాగితాన్ని భద్రంగా దాచుకున్నారు. ఏ రోజు ఏ ఆఫీసుకు వెళ్లింది, అక్కడ ఎన్ని మెట్లు ఎక్కిందో కూడా కాగితాల్లో రాసుకున్నారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే ఆయన పోరాటం గురించి ఎన్జీవో మిత్రులు, పత్రికల ద్వారా తెలసుకున్న ప్రముఖ థియోటర్ ఆర్టిస్ట్, ప్రముఖ బాలివుడ్ దర్శకుడు అనంత్ మహదేవన్ ఆయన బయోపిక్‌ను చిత్రంగా తీయాలని ఆయన్ని సంప్రదించారు. తనపై చిత్రమేమిటని ముందుగా భావించిన హరిదాస్, ఆ తర్వాత దర్శకుడి చిత్తానికే వదిలేశారు. తొలిరోజుల్లో బాలివుడ్లో కమర్షియల్స్ సినిమాలు తీసిన మహదేవన్, ఆ తర్వాత ఆ తరహా చిత్రాలను వదిలేసి అర్థవంతమైన చిత్రాలను తీయడం ప్రారంభించారు. ఆయన గతేడాది తీసిన 'స్టేయింగ్ అవే' చిత్రం ప్రశంసలు అందుకుంది. ప్రముఖ సామాజిక కార్యకర్త 'సింధుతాయి సప్కల్'పై తీసిన ఆయన బయోపిక్ చిత్రమైతే నాలుగు జాతీయ అవార్డులు అందుకుంది. ఇప్పుడు ఆయన హరి దాస్‌పై తీసిన మరో బయోపిక్ చిత్రం 'గౌర్ హరి దస్తాన్-ది ఫ్రీడమ్ ఫైల్' పేరిట శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇందులో హరి దాస్‌గా వినయ్ పాఠక్, ఆయన భార్య లక్ష్మీగా కొంకణా సేన్ నటించారు. హరి దాస్ దస్తావేజులను ఆమూలాగ్రంగా చదవిన జర్నలిస్ట్, కవి సీపీ సురేంద్రన్ దీనికి స్క్రీన్ ప్లే రాశారు. -
రియల్ హీరో
చిన్నప్పటి నుంచి అతనికి సినిమాలంటే పిచ్చి. హీరో కావాలనే కోరిక. కానీ, రియల్ హీరో అవుతాడు. ఆ సంఘటన ప్రథానాంశంగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘బమ్ డమ్’. తుషార్ గౌతమ్, హర్షకుమార్, వెర్టికా గుప్తా ముఖ్య తారలు. దీపక్ బల్దేవ్ దర్శకత్వంలో గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రం ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్ బాగుందనీ, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. కాగా, ‘‘అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అని దర్శకుడు దీపక్ బల్దేవ్ చెప్పారు. -
రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో
హాలీవుడ్ ప్రముఖ నటుడు 72 ఏళ్ల హారిసన్ ఫోర్డ్ వెండితెర మీదే కాదు.. నిజజీవితంలో కూడా హీరోగానే ఉన్నారు. గురువారం ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానంలో ఇంజన్ పనిచేయక అత్యవసరంగా దాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా చాకచక్యంగా దాన్ని గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించి పరోక్షంగా ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడారు. స్టార్ వార్స్ సిరీస్ సినిమాల్లో, ఎయిర్‌ఫోర్స్ వన్ సినిమాలో స్వయంగా స్టంట్లు చేసిన హారిసన్ ఫోర్డ్ మంచి నైపుణ్యం గల పైలట్. ఆయన రెండో ప్రపంచయుద్ధం కాలం నాటికి చెందిన సింగిల్ ఇంజన్ గల చిన్న వింటేజ్ విమానంలో గురువారం నాడు విహారయాత్రకు వెళ్లాడు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో గగనతలంలో విహరిస్తుండగా హఠాత్తుగా అందులోని ఇంజన్ చెడిపోయింది. ఏ మాత్రం కంగారు పడకుండా దగ్గరలో ఉన్న శాంటా మోనికా విమానాశ్రయం వైపు విమానాన్ని మళ్లించారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం కోసం విమానాశ్రయం అధికారులను కోరారు. వారు అందుకు అనుమతించినా విమానాశ్రయం రన్‌వేకు చేరుకోలేకపోయారు. సమీపంలో ఉన్న జనావాస ప్రాంతాల వైపు వెళ్లకుండా విమానాన్ని ఆ పక్కనే ఉన్న కాలిఫోర్నియా గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించారు. అక్కడ కూడా భారీ చెట్లను తప్పించుకొని అత్యంత చాకచక్యంగా విమానాన్ని క్రాష్‌ల్యాండింగ్ చేశారు. విమానం జనావాస ప్రాంతాల వైపు వెళ్లకుండా ఉండేందుకు విమానాన్ని ఏకంగా 180 డిగ్రీల కోణంలో గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించడం సాహసోపేతమైన చర్యను ప్రమాదస్థలాన్ని సందర్శించిన విమానయాన నిపుణుడు రిక్ డేక్ తెలిపారు. చెట్లకు తగలకుండా అతి జాగ్రత్తగా విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయడం, అందులో 72 ఏళ్ల వయసులో అలా చేయడం మామూలు విషయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగిలి ఉక్లా మెడికల్ సెంటర్ ఆస్పత్రిలో చేరిన ఫోర్డ్‌కు ప్రాణాపాయం లేదని ఆయన కుమారుడు బెక్ ఫోర్డ్ తెలిపారు. 1966లోనే పైలట్ లైసెన్స్ పొందిన ఫోర్డ్ ఇంతకుముందు కూడా నిజ జీవితంలో పలు సాహసాలు చేశారు. 2000 సంవత్సరంలో టెటాన్ కౌంటీ (అమెరికా)లోని ఇడాహో ఫాల్స్ వద్ద గల పర్వతాల్లో 11,106 అడుగు ఎత్తులో చిక్కుకున్న ఓ మహిళా పర్వతారోహకురాలిని ప్రాణాలకు తెగించి అక్కడికి తన విమానంలో వెళ్లి ఆమెను రక్షించారు. ఆ తర్వాత 2001 సంవత్సరంలో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడవుల్లో తప్పిపోయిన బాలుడిని సాహసోపేతంగా రక్షించి తీసుకొచ్చారు. గతేడాది స్టార్‌వార్స్ ఏడో ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా మిలీనియం ఫెలికాన్ స్పేస్‌క్రాఫ్ట్ తలుపు విరిగిపడడంతో ఫోర్డ్ కారు విరిగింది. కోలుకున్నాక ఆ షూటింగ్‌ను పూర్తి చేశారు. -
రియల్ హీరో అక్కినేని: రోశయ్య
సాక్షి, సిటీబ్యూరో: అత్యంత ప్రజాభిమానం చూరగొన్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు రియల్ హీరో అని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కొనియాడారు. మంగళవారం రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్, కిన్నెర కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కినేని 91వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ నాగేశ్వరరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి మాట్లాడుతూ గొప్ప కారణజన్ముడు అక్కినేని అని తెలిపారు. అక్కినేని- కిన్నెర పురస్కారాన్ని గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా సాహితీ వేత్త, రచయిత డాక్టర్ ఓలేటి పార్వతీశానికి అందజేశారు. ఎస్వీ రామారావు రూపొందించిన ‘అక్కినేని జైత్రయాత్ర’ లఘు చిత్ర ప్రదర్శన, ప్రముఖ గాయకుడు ఆర్. సంపత్ బృందం నిర్వహించిన అక్కినేని చిత్ర సంగీత విభావరి అందర్నీ ఆకట్టుకుంది. రఘురామ్ రచించిన‘అక్కినేని అభిమానిగా..’ గ్రంథాన్ని గవర్నర్ రోశయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ సీఈవో డాక్టర్ పి. మధుసూదనరావు, సారిపల్లి కొండలరావు, సమత గోపాల్, సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు, కిన్నెర సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఆర్. ప్రభాకరరావు, కార్యదర్శి మద్దాలి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. -
నిజజీవితంలో కూడా అజిత్ హీరోనే!
సినిమా హీరోల విషయంలో నటన ఒక తీరుగా ఉంటే, నిజజీవితం మరో విధంగా ఉంటుంది. సినిమాలలో హీరోయిజం చూపించినంతమాత్రాన, వారు నిజజీవితంలో కూడా అలాగే ఉండాలని ఏమీలేదు. అలాగే విలన్ వేషాలు వేసేవారు, వాస్తవ జీవితంలో కూడా అంతే దుష్టులుగా ప్రవర్తించారనుకుంటే పొరపాటే. అయితే తెరపైనే కాకుండా, తెర వెనుక కూడా హీరో అనిపించుకుంటూ జనాల హృదయాల్లో నిలిచిపోయేవారు అతితక్కువ మంది ఉంటారు. అలాంటి అరుదైన హీరోల్లో తమిళ టాప్ హీరో అజిత్ ఒకరు. అతని స్టైలే వేరు. ఆ విషయం అభిమానులకు, పరిశ్రమలో అందరికీ తెలుసు. సినిమా, కుటుంబం ఈ రెండే అతని ప్రపంచం. అజిత్ 2000లో నటి శాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్య దంపతులుగా వారికి పేరుంది. వారికి ఆరేళ్ల అనౌష్క అనే కుమార్తె ఉంది. తను ఒక్కడే బాగుంటే చాలు అనుకోకుండా, తన వద్ద పనిచేసే వారు కూడా బాగుండాలని హీరో అజిత్ కోరుకుంటారు. ఆయనను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ అజిత్ హీరో అని అందరితోనూ మెప్పు పొందుతున్నారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలూ లేకుండా ఆర్థిక సమస్యల్లో ఉన్నవారిని ఆదుకోవటం అజిత్‌కు అలవాటు. అంతేకాకుండా అజిత్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దానిని అములులో కూడా పెట్టేశారు. వాచ్‌మేన్, పని మనిషి, కారు డ్రైవర్, వంట మనిషి... ఒకరేమిటీ ఇలా తన వద్ద పని చేసేవారందరికీ ఇళ్లు కట్టించాలనుకున్నారు. కట్టించేశారు. తన వద్ద పనిచేసేవారందరికీ ఇళ్ళు కట్టించడానికి పాత మహాబలిపురం రోడ్డులో కొంత స్థలాన్ని కూడా అజిత్ కొన్నారు. మనిషికి అర ఎకరం చొప్పున పది మందికి వారి పేరిటే రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఆ ఇళ్ల నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. తన చిత్రాలతో నిత్యం వార్తల్లో నిలిచే అజిత్, తెర వెనుక కూడా హీరో అనిపించుకున్నారు. అభిమానులు గర్వించతగిన రియల్ హీరో అజిత్. - శిసూర్య -
వీరసైనికుడు రాజారెడ్డికి సలాం
-
రియల్ హీరోగా మారిన రీల్ హీరో
-
నా అదృష్ట దేవత నయనతార
హీరో హీరోయిన్లు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం అన్నది కొత్తేమి కాదు. అయితే నటుడు ఆర్యను మాత్రం చాలా మంది హీరోయిన్లు రియల్ హీరోగా పేర్కొంటుంటారు. అందరితోనూ కలుపుగోలుతనంగా మసులుకోవడం వల్లే ఆర్య అందరికీ ఇష్టంగా మారారన్నది హీరోయిన్ల మాట. ఆయన ప్లేబాయ్ అని అందుకే హీరోయిన్లు లైక్ చేస్తారన్నది సినీ వర్గాల మాట. ఏదేమయినా క్రేజీ భామలు అనుష్క, నయనతార, హన్సిక వంటి వారు ఆర్య మంచి స్నేహితుడంటూ కితాబిస్తుంటారు. మరి ఆర్య ఏమంటున్నారో తెలుసా? నయనతార తన అదృష్ట దేవత అంటున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన బాస్ ఎన్గిర భాస్కరన్, ఇటీవల నటించిన రాజారాణి విశేష ప్రజాదరణ పొందాయి. అయితే ఈ చిత్రాల షూటింగ్ సందర్భంగా ఈ జంటపై పలు రకాల వదంతులు వచ్చాయి. ఇవి జరిగి చాలా రోజులైనా ఆర్య మళ్లీ వీటి ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన మాట్లాడుతూ రాజారాణి చిత్ర ప్రచారంలో భాగంగా తనకు నయనతారకు వివాహం అంటూ ఆహ్వాన పత్రికలతో ప్రచారం చేశారన్నారు. దీనికి చాలా మంచి పబ్లిసిటీ లభించిందన్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగలేదన్నారు. బయట ఎక్కడ చూసినా అభిమానులు నయనతారను పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించడం ప్రారంభించారని తెలిపారు. అది చిత్ర ప్రచారంలో భాగం అని వివరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నిజం చెప్పాలంటే నయనతార తన అదృష్ట దేవత అని వ్యాఖ్యానించారు. ఆమెతో కలిసి నటించే అవకాశం రావడం తనకు లభించిన అదృష్టం అని పేర్కొన్నారు. మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? అని మీడియా వర్గాలు అడుగుతున్నారని సినీ పరిశ్రమలో ఇలాంటి వదంతులు సహజం అని అన్నారు. నిజానికి తమ ఇరువురికి అలాంటి ఆలోచన లేదని ఆర్య స్పష్టం చేశారు. అయితే నయనతారను అదృష్ట దేవతగా సంబోధించాల్సిన అవసరమేమిటని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. -
రిటైరయ్యే వయసులో రియల్ హీరో అయ్యాడు
పేరు చెప్పక్కర్లేదు. బిగ్ బి అంటే చాలు!. ఆయన నటన గురించి ఎందరు చెప్పినా... ఏం చెప్పినా... తక్కువే!. అలాంటి అమితాబ్‌కు రిటైర్మెంటు వయసులో వచ్చాయి కష్టాలు. అందరూ హాయిగా విశ్రాంత జీవితం గడపటానికి రెడీ అయ్యే సమయంలో ఆయన తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. నష్టాల్లో కూరుకుపోయిన సొంత కంపెనీ ఏబీసీఎల్... ఆయన్నూ కష్టాల్లోకి నెట్టేసింది. ఇల్లు కూడా అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. మళ్లీ జీరో దగ్గర జీవితాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. సినిమాల్లో మాదిరే జీవితంలో కూడా అమితాబ్ హీరోలానే నిలబడ్డారు. కష్టాలకు ధైర్యంగా ఎదురొడ్డారు. కష్టాలనుంచి బైటపడ్డారు. కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షోతో నిజంగానే మళ్లీ కరోడ్‌పతి అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్‌నూ సక్సెస్ చేసి చూపించారు. ఒకప్పుడు దివాలా పరిస్థితి ఎదుర్కొన్న అమితాబ్ బచ్చన్ వ్యక్తిగత సంపద ప్రస్తుతం రూ.500 కోట్లపైనే ఉంటుందని అంచనా. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. 2013లో ఆయన ఆదాయం సుమారు రూ.147 కోట్లు. 70 ఏళ్లు దాటినా అదే ఉత్సాహంతో ఎడాపెడా సిని మాలు, ప్రకటనలు, టీవీ షోలూ చేస్తూనే ఉన్నారు బిగ్ బి. పెట్టుబడుల్లో వైవిధ్యం... అమితాబ్ తన పెట్టుబడుల్ని ఏ ఒక్క రంగానికో, ఏ ఒక్క సాధనానికో పరిమితం చేయలేదు. వైవిధ్యాన్ని పాటించారు. కొన్నాళ్ల కిందట వెల్లడించిన వివరాల ప్రకారం... బ్యాంకుల్లో ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ సుమారు రూ.92 కోట్లు. సేకరించిన కళాకృతుల విలువ సుమారు రూ.3 కోట్లు, బంగారం.. ఆభరణాలు మొదలైన వాటి విలువ దాదాపు రూ.25 కోట్లు. వ్యవసాయ.. వ్యవసాయేతర భూముల విలువ సుమారు రూ.30 కోట్లు. ఇక రియల్టీలో పెట్టుబడుల విలువ దాదాపు డెభ్బై కోట్ల పైనే ఉంటుంది. ఒకప్పుడు తనను నిలువునా ముంచిన ఏబీసీఎల్ కంపెనీని పునరుద్ధరించి ఏబీ కార్ప్‌గా మార్చారు అమితాబ్. పా లాంటి విజయవంతమైన సినిమాలూ తీశారు. అంతేకాక స్టాక్‌మార్కెట్లలోనూ ఇబ్బడిముబ్బడిగా ఇన్వెస్ట్ చేశారు. జస్ట్ డయల్ వంటి కంపెనీల షేర్లలో రూ.6 లక్షలు పెడితే.. ఆ విలువ ప్రస్తుతం రూ.10 కోట్లకు చేరింది. ఏతావాతా అమితాబ్ స్టోరీ చెప్పేదేంటంటే.. సంపాదించడమే కాదు. దాన్ని భద్రంగా చూసుకోవటమూ ముఖ్యమే. ఆ విషయాన్ని లేటుగా గుర్తించినా.. తగిన ప్రణాళికతో ముందుకెళ్లారు అమితాబ్. అందర్నీ గుడ్డిగా నమ్మకూడదని గుర్తించారు. డబ్బంతా ఒకేచోట ఇన్వెస్ట్ చేయకుండా రియల్టీ, ఎఫ్డీలు, బంగారం, కళాకృతులు ఇలా వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా తీర్చిదిద్దుకున్నారు.