food agency
-
హోటల్ బిజినెస్ డల్
సాక్షి, హైదరాబాద్: హోటల్ ఫుడ్‌పై వినియోగదారుల్లో నమ్మకం పోయింది. హైదరాబాద్ సహా తెలంగాణలో పేరున్న హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నాసిరకం ఆహారం అందిస్తున్నాయని తేలడంతో బయటి ఆహారం తినడానికి ప్రజలు ఇష్టపడటం లేదు. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని ఫుడ్‌సేఫ్టీ అధికారుల అంచనా ప్రకారం ఈ దాడుల అనంతరం ఏకంగా 30 శాతం హోటల్ బిజినెస్ తగ్గింది. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ సంస్థల ద్వారా ఫుడ్ డెలివరీ కూడా భారీగా తగ్గిందని తెలుస్తోంది. ఆన్లైన్ డెలివరీల ద్వారా మరింత నాసిరకం ఫుడ్ సరఫరా ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీల్లో చాలా వరకు పరిశుభ్రతలోపం, ఆహార పదార్థాల్లో నాణ్యత లేమి స్పష్టంగా కనిపించినట్టు సమాచారం. పాడైపోయి, కాలంచెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. దాడుల్లో పేరుమోసిన హోటళ్లు, బేకరీలు, ఐస్‌క్రీం సెంటర్లున్నాయి. ప్రముఖ హోటళ్లలో పాడైపోయిన ఆహారపదార్థాలు వాడటమే కాకుంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగ్గా పాటించడం లేదు. ఫుడ్‌సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలోని టాస్‌్కఫోర్స్ బృందాలు విడుదల చేసిన జాబితా ప్రకారం క్రీమ్‌స్టోన్, న్యాచురల్స్ ఐస్‌క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరీ కాఫీహౌస్, షాగౌస్, కామత్ హోటల్, 36 డౌన్‌టౌన్ బ్రూపబ్, మాకౌ కిచెన్ అండ్ బార్, ఎయిర్‌లైవ్, టాకోబెల్, అహా దక్షిణ్, సిజ్జిలింగ్ జో, ఖాన్‌సాబ్, హోటల్ సుఖ్‌సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్, రెస్ట్ ఓ బార్ వంటి అనేక హోటళ్లు, బేకరీలు ఉన్నాయి. వాటిల్లో ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పదార్థాలతో వండటం వంటి వాటిని గుర్తించారు. రోజుల తరబడిగా నిల్వ ఉంచిన మాంసంతో వండటం వంటివీ గుర్తించారు. హైదరాబాద్‌లో సగం హోటళ్లలో నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారని, అపరిశుభ్రమైన కిచెన్ వంటివి ఉన్నాయని నిర్థారించారు. కేసులు పెట్టి జరిమానాలు విధించడంతోపాటు శుభ్రత, నాణ్యత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు నేరుగా హాటల్‌కు లేదా రెస్టారెంట్లకు వచ్చే వినియోగదారుల కంటే, ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ విషయంలో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తేలింది. ఆన్లైన్ డెలివరీ సంస్థల ద్వారా అత్యంత నాసిరకమైన ఫుడ్ వినియోగదారులకు సరఫరా చేశారని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.దాడులేనా.. సీజ్ చేయరా...? ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు చేసి ప్రజల్లో ఒకరకమైన భయం సృష్టించారు. అయితే కుటుంబసభ్యులతో సరదాగానో లేదా అవసరంరీత్యానో హాటళ్లకు వెళ్లే వినియోగదారులకు భరోసా కలి్పంచడంలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడుల సమయంలో కుళ్లిపోయిన మాంసం, పాడైపోయిన ఆహారం వంటివి గుర్తించినా, తక్షణమే ఆయా హోటళ్లను ఎందుకు సీజ్ చేయడం లేదని వినియోగదారులు ప్రశి్నస్తున్నారు. కేవలం కేసులు పెట్టి వదిలేయడం, పద్ధతి మార్చుకోవాలని సమయం ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనమని వాపోతున్నారు. భరోసా కలి్పంచకపోతే ఎలా? హోటళ్లపై దాడులు చేశాక, వాటిపై తక్షణ చర్యలు తీసుకోకపోతే మార్పు రాదు. హోటళ్లలో ధైర్యంగా తినేలా వినియోగదారులకు భరోసా కలి్పంచాల్సిన బాధ్యత అధికారులతోపాటు హోటల్ యజమానులపైనా ఉంది. వేలాది రూపాయలు వసూలు చేసే పెద్ద హోటళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టాలని డిమాండ్ చేసే అధికారం ఉంటుంది. అవసరమైతే కిచెన్‌లోకి వెళ్లి చూసేలా వెసులుబాటు ఉండాలి. లేదంటే ఓపెన్ కిచెన్ కానీ, సీసీ టీవీ కెమెరాల ద్వారా కిచెన్‌లో ఉండే పదార్థాలు, వండే విధానం వంటి వాటిని తినేవారు నేరుగా స్క్రీన్‌పై చూసే వెసులుబాటు కలి్పంచాలి. శ్రీనివాస్ శెట్టి, హైదరాబాద్సీజ్ చేసే అధికారం మాకు లేదు హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేశాక. వాటిని సీజ్ చేసే అధికారం మాకు లేదు. కేసులు పెట్టడం, జరిమానాలు విధించడం వరకే మాపని. అయితే తక్షణమే సీజ్ చేసే అధికారం పురపాలకశాఖకు ఉంటుంది. వినియోగదారుల్లో అవగాహన కలి్పస్తున్నాం. హోటల్, రెస్టారెంట్ల యజమానులను పిలిపించి నిబంధనలు పాటించాలని ఆదేశిస్తున్నాం. – ఆర్వీ కర్ణన్, కమిషనర్, ఫుడ్ సేఫ్టీపెద్ద హోటళ్లే ఇలా చేయడం విస్మయం కలిగిస్తుంది పెద్ద హోటళ్లే నాసిరకం ఫుడ్ పెట్టడంతో డాక్టర్లతో సహా వినియోగదారులంతా విస్మయానికి గురయ్యారు. వీకెండ్లో కుటుంబాలతో వెళాదామనుకునే వారికి షాక్ ఇచ్చారు. నాసిరకం, కలర్స్ వాడిన ఆహారం, కుళ్లిపోయిన మాంసం, అపరిశుభ్రత వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఆహార ప్రియులకు భరోసా కలి్పంచాలి. – డాక్టర్ అనిల్‌కుమార్ మన్నవ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి -
పిల్లలతో ఇంటింటికి తిరుగుతూ ఫుడ్ డెలివరీ.. నెటిజన్లు ఫిదా!
అవాతంరాలను దాటుకుంటూ కుటుంబ పోషన కోసం ఫుడ్ డెలివరీ చేస్తున్న పలువురి వీడియోలు సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. అలాంటి వీడియోనే మరోకటి వెలుగులోకి వచ్చింది. ఓ జొమాటో డెలివరీ బాయ్.. తన కూతురిని ఎత్తుకుని, కొడుకుని చేతపట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఆహారం అందిస్తున్నాడు. ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వాని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘ఆయనను చూడంటం నాకు స్ఫూర్తినిచ్చింది. ఒకవ్యక్తి కావాలనుకుంటే ఏదైనా చేయగలడనే విషయాన్ని మనం నేర్చుకోవాలి.’ అంటూ రాసుకొచ్చారు సౌరభ్. ఆ వీడియోలో.. ఓ వ్యక్తి తనకు వచ్చిన ఆర్డర్‌ను డెలివరీ చేస్తున్నాడు. ఈ క్రమంలో తన బిడ్డను ఎత్తుకుని కనిపించాడు. ఆ వెనకాలే అతడి కుమారుడు తిరుగుతూ కనిపిస్తున్నాడు. పిల్లలతో కలిసి డెలివరీ చేసేందుకు రావటంపై ఆ వ్యక్తిని అడగగా.. కూతురిని ఇంట్లో వదిలేయలేక తనతో తీసుకొస్తున్నానని, తన కొడుకు డెలివరీ చేయటంలో సాయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. జొమాటో స్పందన.. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సైతం స్పందించింది. తమ ఉద్యోగులకు అందించే చైల్డ్‌కేర్ ప్రయోజనాలను అందించేందుకు ఆ డెలివరీ బాయ్ వివరాలను కోరింది. ‘ఆర్డర్ వివరాలను ప్రైవేట్ మెసేజ్ ద్వారా తెలపగలరు. దాంతో ఆ డెలివరీ బాయ్‌ని కలిసి అవసరమైన సాయం అందిస్తాం.’ అని కామెంట్ చేసింది సంస్థ. మరోవైపు.. జీవితం చాలా అందమైనది, కానీ చాలా కష్టం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. తండ్రి నిజమైన హీరో అంటూ మరొకరు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Saurabh Panjwani (@foodclubbysaurabhpanjwani) ఇదీ చదవండి: ప్లాస్టిక్‌లా మారిపోయిన యువతి చర్మం.. అదే కారణమా? -
బెంగళూరులో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
సాక్షి, బెంగళూరు: అనుమానిత ఉగ్రవాది ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి తిలక్‌నగరలో ఉంటున్న అస్సాంకు చెందిన అఖ్తర్ హుస్సేన్ లష్కర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. పదో తరగతి వరకు చదువుకున్న అఖ్తర్ యువతకు ఉగ్రవాద సంస్థలతో గల సంబంధాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఇతడి నుంచి ల్యాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సోమవారం మరో అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
ఆ యాప్ ద్వారా ఫ్రీ ఫుడ్, మందు.. క్షణాల్లోనే వందల ఆర్డర్స్
వాషింగ్టన్: ఆఫర్లో తక్కువ ధరకే ఏదైనా వస్తువు వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. అలాంటిది ఉచితంగా ఆహారం, మందు వస్తుంటే ఊరుకుంటారా? ఓ యాప్ ద్వారా ఉచితంగా ఫుడ్, లిక్కర్ వస్తోందని తెలుసుకుని వందల మంది ఆర్డర్ చేశారు. క్షణాల్లోనే కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు రావటంతో నిర్వహకులు అవాక్కయ్యారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. డోర్‌డాష్ అనే ఫుడ్ డెలివరీ యాప్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల ఈ సంఘటన ఎదురైంది. ఆ యాప్‌లో పేమెంట్ గేట్‌వే లేకుండానే ఆర్డర్లు బుక్కయ్యాయి. ఈ ఆఫర్ తెలుసుకున్న పలువురు ఆర్డర్ చేయటమే కాదు.. తాము ఉచితంగా పొందామని తమ ఆర్డర్ చిత్రాలను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అందులో టెకిలా వంటి అత్యంత ఖరీదైనవి సైతం ఉండటం గమనార్హం. దీంతో శుక్రవారం మధ్యాహ్నానికి డోర్‌డాష్ యాప్ ట్విట్టర్లో ట్రెడింగ్‌లోకి వచ్చింది. అయితే.. ఈ సమయంలో ఎంత మంది పేమెంట్ లేకుండా ఆర్డర్ చేశారనేది మాత్రం తెలియరాలేదు. అయితే.. అలాంటి ఆర్డర్లను తొలగిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలపటం ఉచితంగా ఆహారం, మందు పొందాలనుకున్న వారిని నిరాశకు గురి చేసింది. 'జులై 7న సాయంత్రం డోర్‌డాష్ యాప్‌లో పేమెంట్ సమస్య తలెత్తింది. ఆ తర్వాత కొద్ది సేపు ఎలాంటి పేమెంట్ లేకుండానే పలువురు యూజర్లు ఆర్డర్ బుక్ చేయగలిగారు. అలా కొందరు వినియోగదారులు ఆర్డర్ చేశారని తెలుసుకుని.. వెంటనే సమస్యను పరిష్కరించాం.' అని డోర్‌డాష్ ప్రతినిధి ఒకరు తెలిపారు. Doordash glitch went crazy im all stocked up free of charge pic.twitter.com/3gvtGZXPtL — annabelle. (@oomfabelle) July 8, 2022 Ain’t gone be a wing left in Chicago with this DoorDash glitch going on 🤦🏾♂️🤦🏾♂️🤦🏾♂️ pic.twitter.com/ghqIyF2Ktj — Follow Da Realest (@Cameron_773) July 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
డెలివరీ బాయ్‌గా మారిన అంతర్జాతీయ క్రికెటర్
ఒలింపిక్ చాంపియన్... ఈ ఒక్క మాట చాలు ఆటగాళ్ల రాతను మార్చేందుకు... మనలాంటి దేశంలో అయితే ఒలింపిక్ స్వర్ణం సాధించిన ఆటగాడు మిగతా జీవితం గురించి ఆలోచించాల్సిన, బెంగ పడాల్సిన పనే ఉండదు. కోట్ల రూపాయలు, కానుకలతో కనకాభిషేకం కురుస్తుంది. కానీ అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఒలింపిక్ విజయం సాధించినా సరే... అవసరమైనప్పుడు బతుకుతెరువు కోసం ఎలాంటి చిన్న పనికైనా సిద్ధం కావాల్సిందే. అదీ వెనిజులా లాంటి దేశం నుంచి వచ్చిన ఆటగాడి పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరం. లాడ్జ్ (పోలాండ్): దక్షిణ అమెరికా దేశం వెనిజులా... ఆ దేశం తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. 1968లో బాక్సర్ ఫ్రాన్సిస్కో రోడ్రిగ్స్ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్ క్రీడాంశంలో రూబెన్ లిమార్డో గాస్కన్ బంగారు పతకం సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా లిమార్డోకు పెద్దగా ఏమీ కలిసి రాలేదు. కానీ లోటు లేకుండా మాత్రం జరిగిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనా... ఇప్పుడు మళ్లీ టోక్యో ఒలింపిక్స్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా రూబెన్ లిమార్డో; ‘లండన్’ స్వర్ణంతో... రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ రజతాలు కూడా గెలుచుకున్న 35 ఏళ్ల లిమార్డో... ఇందుకోసం యూరోపియన్ దేశం పోలాండ్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఇంత కాలం ఒక ఆటగాడిగా స్పాన్సర్షిప్ నుంచే వచ్చే డబ్బులతో అంతా సవ్యంగానే సాగింది. అయితే కరోనా ఒక్కసారిగా అన్నీ మార్చేసింది. టోక్యో క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో పాటు స్పాన్సర్లు కూడా వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము అండగా నిలవలేమంటూ చేతులెత్తేశారు. ఒకవైపు శిక్షణ, మరోవైపు భార్య, ఇద్దరు పిల్లల బాధ్యత కూడా ఉంది. ఒక క్రీడాకారుడిగా ఇన్నేళ్లు గడిపిన తనకు మరో పని తెలీదు. దాంతో కుటుంబ పోషణ కోసం లిమార్డో ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. ఉదయమే ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం తన సైకిల్‌పై ఫుడ్ ఆర్డర్లు అందించేందుకు బయల్దేరడం, సాయంత్రం వచ్చి మళ్లీ సాధన కొనసాగించడం అతని దినచర్య. అయితే డెలివరీ బాయ్‌గా పని చేయడం పట్ల తాను బాధ పడడం లేదని, కోవిడ్–19 కాలంలో కనీసం బతికేందుకు ఒక ఆధారం దొరికినందుకు సంతోషిస్తున్నానని చెప్పినప్పుడు లిమార్డోలో ఒక ఒలింపిక్ చాంపియన్ కాకుండా ఎలాగైనా పోరాటం సాగించాలనుకునే ఒక సామాన్యుడు కనిపించాడు. మరో ఒలింపిక్ పతకం తన కల అని, దానిని నెరవేర్చుకునేందుకు ఎంతౖకైనా కష్టపడతానని అతను చెబుతున్నాడు. అతని స్వదేశం వెనిజులా నుంచి అయితే అసలు ఆశించడానికి ఏమీ లేదు. తీవ్ర రాజకీయ సంక్షోభం కారణంగా ఆ దేశం ప్రస్తుతం కనీస ఆహారం, మందులు కూడా లేకుండా భయంకర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అక్కడ 1 యూఎస్ డాలర్ విలువ సుమారు 10 వేల వెనిజులన్ బొలీవర్స్కు పడిపోవడం దాని తీవ్రతను చూపిస్తోంది. అంతర్జాతీయ క్రికెటర్ కూడా... నెదర్లాండ్స్‌కు చెందిన 28 ఏళ్ల పాల్ ఆడ్రియాన్ వాన్ మీకెరన్ది కూడా ఇదే తరహా బాధ. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడైన ఈ ఫాస్ట్ బౌలర్ జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు, 41 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2020 టి20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టులో అతను కూడా సభ్యుడు. అయితే ఇప్పుడు టి20 ప్రపంచకప్ వాయిదా పడటం అతడికి సమస్య తెచ్చిపెట్టింది. సాధారణంగా నెదర్లాండ్స్ క్రికెటర్లు వేసవిలో మాత్రమే క్రికెట్ బరిలోకి దిగి ఆటకు అనువుగా ఉండని శీతాకాలంలో ఇతర ఉద్యోగాలు చేసుకుంటారు. అక్టోబర్–నవంబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ప్రపంచ కప్ జరిగి ఉంటే వారికి డబ్బు వచ్చి ఉండేది. కానీ ఆ అవకాశం లేకపోవడంతో వాన్ మీకెరన్ కూడా ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్‌గా పని మొదలు పెట్టాడు. ‘ఈ రోజు ప్రపంచకప్ క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ ఈ శీతాకాలంలో డబ్బుల కోసం ఉబెర్ ఈట్స్ డెలివరీలు చేయాల్సి వస్తోంది. పరిస్థితులు ఎలా మారిపోతాయో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే బాధేమీ లేదు. అంతా నవ్వుతూ ఉండండి’ అని మీకెరన్ ట్వీట్ చేశాడు. -
213 పట్టణాలకు విస్తరించిన జొమాటో
హైదరాబాద్: ఆన్లైన్ రెస్టారెంట్స్, ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటో... తన ఆన్లైన్ ఆర్డర్ సేవలు, ఫుడ్ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా 200కు పైగా పట్టణాలకు విస్తరించినట్టు సోమవారం ప్రకటించింది. నూతనంగా 17 పట్టణాల్లో సేవలు ప్రారంభించగా ఇందులో ఆరు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండడం గమనార్హం. దీంతో తమ సేవలు అందుబాటులో ఉన్న పట్టణాల సంఖ్య 213కు చేరినట్టు వెల్లడించింది. దీంతో దేశ నలుమూలలా ఎర్ర చొక్కాతో కూడిన తమ డెలివరీ ఏజెంట్లను చూడొచ్చని పేర్కొంది. కొత్తగా, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, ఒంగోలు, నంద్యాల, భీమవరం, మచిలీపట్నం, శ్రీకాకుళం, కేరళలోని కొట్టాయం, కొల్లామ్, పంజాబ్‌లోని ఖన్నా, గురుదాస్‌పూర్, తమిళనాడులోని అంబుర్, జార్ఖండ్‌లో దియోగఢ్, యూపీలో బులంద్‌షహర్, షాజహాన్‌పూర్ పట్టణాలు, హిమాచల్ ప్రదేశ్‌లో సోలన్, హర్యానాలో పల్వాల్లో తమ సేవలను ప్రారంభించినట్టు తెలియజేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 20 కోట్ల మంది ప్రజలకు సేవలు అందించగమలని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 500 పట్టణాలకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. -
సాగుకు స్కానింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వివిధ ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునే పరిస్థితికి చరమగీతం పాడాలని, రైతు ఆదాయాన్ని మరింత పెంచాలని భావిస్తోంది. విరివిగా ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపించాలని యోచిస్తోంది. అందుకు రాష్ట్ర వ్యవసాయాన్ని పంట కాలనీలుగా తయారు చేయాలని నిర్ణయించింది. ఇటీవల సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ, దాని అనుబంధ విభాగ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు పంట కాలనీల ఏర్పాటుపై సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. పంటల వివరాలతో పాటు రైతుల వివరాలను సేకరించనుంది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 60 లక్షల మంది రైతులు ఒక్కొక్కరు ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేస్తారో తెలుసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. దాదాపు 3 నెలల పాటు సర్వే చేపట్టాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన 26 అంశాలతో కూడిన నమూనా సర్వే పత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) రైతుల వద్దకు వెళ్లి ఈ సమాచారాన్ని సేకరించనున్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణను ఈ నెల 25 లోపు పూర్తిచేసి, వచ్చే ఖరీఫ్‌లో పైలట్ ప్రాజెక్టు కింద పంట కాలనీలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఈవోలు సేకరించే సమాచారంతో పట్టాదారు నంబర్, రైతు పేరు, తండ్రి పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, సామాజిక పరిస్థితి, ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణం ఉంది సర్వే నంబర్ వారీగా నమోదు చేసుకుంటారు. నీటి సదుపాయం, బోరు బావుల ద్వారా ఎంత పండుతుంది.. కాలువల కింద ఎంత సాగవుతుందో అంచనా వేస్తారు. వర్షాధార సాగు విస్తీర్ణం, భూసార పరీక్ష కార్డులు అందాయో లేదో సేకరిస్తారు. పంట రకం.. దిగుబడి కూడా.. సాగయ్యే పంటలు.. వాటిల్లో ఏ రకం, ఏ సర్వే నంబర్‌తో ఎంత విస్తీర్ణంతో సాగు చేస్తున్నారో ప్రత్యేక టేబుల్లో నమోదు చేస్తారు. ఎంత దిగుబడి వస్తుందో కూడా తెలుసుకుంటారు. ఇలా ఖరీఫ్, రబీలకు వేర్వేరుగా వివరాలు నమోదు చేస్తారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మనీటి సేద్యం ఎంతమేరకు అందుబాటులో ఉందనే వివరాలను సేకరించనుంది. పంట రుణాలు కూడా ఎంత మొత్తంలో తీసుకున్నారు.. ఎంత విస్తీర్ణంలో పంటకు బీమా చేయించారనే సమగ్ర వివరాలు నమో దు చేయనున్నారు. పండించిన పంటలో మార్కెట్లో ఎంత విక్రయించారనే వివరాలు కూడా ఉంటా యి. అధిక ఉత్పత్తి ఉన్న పంటలకు ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపన ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులను స్వయం సహాయక బృందాల ద్వారా ప్రోత్సహించటానికి ఈ ప్రణాళిక రూపొందిస్తున్నారు. వచ్చే ప్రయోజనం? రాష్ట్రంలో రైతులు సంప్రదాయ పంటలనే సాగు చేస్తున్నారు. లాభ నష్టాలను లెక్క చేయకుండా జీవనం కోసం పంటలు పండిస్తున్నారు. దీనివల్ల అనేకసార్లు రైతులు నష్టాల పాలవుతున్నారు. పంటలు సరిగా పండకపోవడం, పండినా మద్దతు ధర రాకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. శాస్త్రీయ అంచనా లేకుండా ఎవరికి వారు ఇలా పంటలు సాగు చేస్తుండటంతో రైతుల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ఈ దుస్థితిని మార్చాలని సీఎం కేసీఆర్ ఏడాది కిందటే పంట కాలనీలు అంశం తెరపైకి తెచ్చారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండుతాయో శాస్త్రీయ పద్ధతిలో గుర్తించి, ఆ మేరకు పంట కాలనీలు ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మిరప పంట అధికంగా సాగవుతుందనుకుందాం. ఆ ప్రాంతాన్ని మిర్చి పంట కాలనీగా ప్రకటిస్తారు. ఆ మేరకు రైతులకు అవసరమైన సాంకేతిక సాయం అందజేస్తారు. నాణ్యమైన విత్తనాలను అందిస్తారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేలా అవగాహన కల్పిస్తారు. మార్కెట్లో దానికి సరైన ధర అందించేలా ప్రభుత్వమే పూనుకుంటుంది. మిర్చితో కారం పొడి తయారు చేయించేలా ప్రత్యేకంగా ఆహారశుద్ధి పరిశ్రమ నెలకొల్పుతారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు పండే ప్రాంతాన్ని కూడా ఓ పంట కాలనీగా గుర్తిస్తారు. రాష్ట్రానికి అవసరమైన కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు 60 శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. కూరగాయలు పండించే ప్రాంతాల రైతులకు అవసరమైన సాయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూరగాయలు పండించే ప్రాంతాలను కూడా పంట కాలనీలుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో ఏ పంటలకు కొరత ఉందో గుర్తించి ఆ మేరకు కొత్త పంటలను ప్రోత్సహిస్తారు. పంట కాలనీల ప్రధాన ఉద్దేశం స్వయం సమృద్ధి. కాబట్టి రాష్ట్రంలో ప్రజలు ఏ ఆహారాలను ఏ మోతాదులో వినియోగిస్తున్నారన్న దానిపై గతేడాది జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమగ్ర సర్వే నిర్వహించింది. ఆ నివేదికను సీఎంకు అందజేసింది. -
తమ్ముళ్ల డిష్యుం డిష్యుం
శింగనమల : మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్నారు. మండల పరిధిలోని నాగులగుడ్డం తాండాకు సంబంధించి మధ్యాహ్న భోజన ఏజెన్సీపై కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. గ్రామస్థాయి టీడీపీ నాయకులు తమకు కావాలంటే తమకు కావాలని పోటీ పడ్డారు. ఇందులో భాగంగానే సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని భావించి అనంతపురంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు దగ్గరకు వెళ్లారు. అయితే ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఓ టీడీపీ నాయకుని వద్ద సమస్యను చర్చించారు. మాటా మాటా పెరగడంతో ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న నాయకులు, కార్యకర్తలు వారిని విడిపించి అక్కడి నుంచి పంపించివేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకునేలోపే తమ్ముళ్లు వెళ్లిపోయారు.