రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి(PC: BCCI)
Asia Cup 2022 India Vs Pakistan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత బౌలర్లతో ప్రాక్టీసు సెషన్‌లో పాల్గొన్నాడు హిట్‌మ్యాన్. యజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా సహా ఇతర ఆటగాళ్ల బౌలింగ్‌లో తనదైన షాట్లతో అలరించాడు. సిక్సర్లు, ఫోర్లు బాదాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి రంగంలోకి దిగాడు. భారీ షాట్లతో సొంత జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరి ప్రాక్టీసుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది.
కాగా ఆసియా కప్-2022లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్-2021 ఈవెంట్‌లో దాయాది చేతిలో 10 వికెట్ల తేడాతో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.
🔊 Sound 🔛#TeamIndia captain @ImRo45 & @imVkohli get into the groove ahead of the first clash against Pakistan.#AsiaCup2022 | #AsiaCup pic.twitter.com/GNd8imnmM3
— BCCI (@BCCI) August 25, 2022
అయితే, పాకిస్తాన్ మీద, ఆసియా కప్ టోర్నీలో కూడా కోహ్లికి అద్బుత రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌లో అతడు ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టిన తర్వాత అతడి సారథ్యంలో భారత్ ఆడనున్న తొలి మేజర్ టోర్నీ ఇదే.
మరింత ప్రతిష్టాత్మకం! హైప్ అవసరం లేదు!
దీంతో ఈ ఈవెంట్ హిట్‌మ్యాన్‌కు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా.. రోహిత్ కిక్ స్కూటర్‌పై గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఆగష్టు 28న భారత్- పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారని తెలుసు. అలాంటప్పుడు ఒత్తిడి సహజమే. అందులో ఎలాంటి సందేహం లేదు.
అయితే, మా ఆటగాళ్లపై ఆ ఒత్తిడి పడకుండా చూసుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఇంతవరకు ఆడని ఆటగాళ్లకు.. మిగతా అన్ని జట్లలాగే ఇది కూడా! పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేదని చెప్పాను’’ అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌కు మరీ ఎక్కువ హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
Vroooming 🛴 into the end of practice session - Captain @ImRo45 style 👌 👌#TeamIndia | #AsiaCup2022 | #AsiaCup pic.twitter.com/OqF9eksgCP
— BCCI (@BCCI) August 25, 2022
చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీలో పాల్గొనబోయే టీమ్‌లు.. అన్ని జట్ల ఆటగాళ్ల వివరాలు
Shaheen Afridi: నేనూ నీలాగే ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టాలనుకుంటున్నా పంత్: పాక్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment