
మ్యాచ్‌లో హైలైట్స్.. వైరల్ అవుతున్న వీడియోలు
T20 World Cup 2022 - Ind Vs Pak- Virat Kohli: టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ మధ్య ఆదివారం నాటి పోరు క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.
రన్‌మెషీన్ విరాట్ కోహ్లి తన కెరీర్‌లో బెస్ట్ ఇన్నింగ్స్‌గా చెప్పుకోగదగ్గ ఇన్నింగ్స్ ఆడి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. కింగ్ కోహ్లితో ఇట్లా ఉంటది మరి అన్నట్లు ఆకాశమే హద్దుగా(53 బంతుల్లో 82 పరుగులు- నాటౌట్) చెలరేగి టీమిండియాకు మరోసారి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ముగిసి గంటలు గడుస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. మ్యాచ్‌కు సంబంధించిన మరపురాని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మిలియన్స్ కొద్దీ లైకులు.. వేలల్లో షేర్లతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్- పాక్ మ్యాచ్ సందర్భంగా ఐసీసీ షేర్ చేసిన వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి. ఆ బెస్ట్ మూమెంట్స్ చూసి ఆనందించండి!
(చదవండి: Virat Kohli: అప్పుడు మాటలు పేలావు! తట్టుకోలేరన్నావు! ఇప్పుడు తుస్సుమన్నావు! మ్యాచ్‌కే హైలైట్‌గా..)
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను గోల్డెన్ డక్ చేసిన అర్ష్‌దీప్ సింగ్
కోహ్లి మిస్ చేసిన రనౌట్!
షమీ బౌలింగ్‌లో అశ్విన్ అద్భుత క్యాచ్
పాపం రాహుల్.. బట్ వెల్ ట్రైడ్
హార్దిక్ పాండ్యా చేసెను అద్భుతం
పాండ్యా హైలైట్ సిక్స్
కోహ్లి అద్భుత ఇన్నింగ్స్