T20 World Cup 2022 - Ind Vs Pak- Virat Kohli- Hardik Pandya: ‘‘విరాట్ కోహ్లి కొట్టిన ఆ రెండు షాట్లు ఎంత ముఖ్యమైనవో నాకు బాగా తెలుసు. ఒకవేళ గనుక కోహ్లి ఒక్క షాట్ మిస్ చేసినా.. వాళ్లు మనపై ఒత్తిడి పెంచేవాళ్లు. నేను చాలాసార్లు సిక్సర్లు బాదాను. అయితే, ఈ రెండు సిక్స్‌లు మాత్రం ఎంతో ఎంతో ప్రత్యేకమైనవి.
మా ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైనవి. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నో షాట్లు ఆడాను. కానీ ఇలాంటి షాట్లు మాత్రం మిస్టర్ కోహ్లి తప్ప ఇంకెవరూ కొట్టలేరు’’ అంటూ టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా .. రన్‌మెషీన్ విరాట్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
విలువైన ఇన్నింగ్స్ ఆడి
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో కోహ్లి(53 బంతుల్లో 82 పరుగులు- నాటౌట్), పాండ్యా(37 బంతుల్లో 40 పరుగులు) విలువైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయం అందించిన విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించి గెలుపు బాట పట్టించారు.
ఆ రెండు సిక్స్‌లు ఇంకెవరికీ సాధ్యం కావు
ముఖ్యంగా కీలకమైన సమయంలో కోహ్లి విశ్వరూపం ప్రదర్శించడంతో నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో విజయం భారత్‌ను వరించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కోహ్లితో ముచ్చటించిన హార్దిక్.. కింగ్ మరపురాని ఇన్నింగ్స్ గురించి మరోసారి గుర్తుచేసుకున్నాడు. 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిన రెండు సిక్స్‌లు మ్యాచ్‌ను మలుపు తిప్పాయని పేర్కొన్నాడు.
ఒత్తిడికి లోనయ్యాను.. అయితే
అదే విధంగా పాక్‌తో మ్యాచ్ సందర్భంగా తన అనుభవాల గురించి పంచుకుంటూ.. ‘‘నేను కాస్త ఒత్తిడికి లోనయ్యాను. మైదానంలోకి వచ్చే ముందు ఎందుకో నా మనసు అల్లకల్లోంగా మారింది. అయితే, ప్రతికూలతలు, ఒత్తిడిని అధిగమించి నేను ఈరోజు ఇలా ఆడగలిగానంటే జట్టులోని సభ్యుల సహకారం వల్లే.
నీకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఆడాను. ఎందుకంటే ఛేజింగ్‌లో నువ్వేం చేయగలవో అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో నీకంటే గొప్పగా ఎవరు ఆడగలరు’’ అంటూ కోహ్లితో వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. కాగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిని 4 వికెట్ల తేడాతో ఓడించిన రోహిత్ సేన శుభారంభం చేసింది.
చదవండి: T20 WC 2022 Ind Vs Pak: 'ఆడింది చాలు ఇక వెళ్లు'.. హార్దిక్ చర్య వైరల్
T20 WC PAK Vs IND: కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌కు రోహిత్ ఫిదా.. భుజంపై ఎత్తుకుని మరి!
Of special knocks, game-changing sixes & thrilling victory at the MCG! 👌 💪
𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹: Men of the moment - @imVkohli & @hardikpandya7 - chat after #TeamIndia beat Pakistan in the #T20WorldCup. 👏 👏 - By @RajalArora
Full interview 🎥 🔽 #INDvPAKhttps://t.co/3QKftWa7dk pic.twitter.com/sK7TyLFcSI
— BCCI (@BCCI) October 24, 2022
Comments
Please login to add a commentAdd a comment