ధోని ఫేర్‌వెల్‌ సాంగ్‌ వైరల్‌ | MS Dhoni Farewell Song Main Pal Do Pal Ka Shayar Viral | Sakshi
Sakshi News home page

3 కోట్ల వ్యూస్‌కు చేరువలో ధోని వీడ్కోలు పాట

Published Mon, Aug 17 2020 8:36 AM | Last Updated on Mon, Aug 17 2020 11:32 AM

MS Dhoni Farewell Song Main Pal Do Pal Ka Shayar Viral - Sakshi

న్యూఢిల్లీ: కోట్లాది అభిమానుల్ని నిరాశకు గురిచేస్తూ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నాడు. ‘నేనో రెండు నిముషాల కవిని. నాదో చిన్న ప్రయాణం. నాలా ఎందరో వచ్చారు. వెళ్లారు. నేనూ అంతే. మరెందరో నాలాంటి వారు వస్తారు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఓ పాట రూపంలో వెల్లడించాడు. 1976లో వచ్చిన సూపర్‌హిట్‌ మూవీ ‘కభీ కభీ’లోని ‘మై పల్‌ దో పల్‌ కా షాయర్‌’ పాటను ధోని షేర్‌ చేశాడు.

సాహిర్‌ లుధియాన్వి రచించిన ఈ పాటను ప్రఖ్యాత గాయకుడు ముఖేష్‌ ఆలపించారు. అప్పట్లో ఈ సాంగ్‌ విశేష ఆదరణ పొందింది. క్రికెట్‌లో తన 16 ఏళ్ల తన జర్నీని తెలిపే బెస్ట్‌ మూమెంట్స్‌తో కూడిన ఫొటోలను ఆ పాటతో మిక్స్‌ చేశాడు ధోని. ఈ పాట 2,86,09,653 వ్యూస్‌ సాధించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 64,77,407 మంది ఈ వీడియోను లైక్‌ చేశారు. క్రికెట్‌ జ్ఞానిగా పేరుతెచ్చుకున్న ధోని, వీడ్కోలుకు సంబంధించి ఉద్వేగభరితమైన పాత పాటను ఎంచుకోవడం విశేషం.
(చదవండి: ధోని...ధోని.. క్రికెట్ జ్ఞాని)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement