
బీజింగ్: పని ప్రదేశాలలో మహిళలను వేధించకూడదని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కొంత మంది దుర్మార్గులు మారడం లేదు. వారు తమ కింద పనిచేసే మహిళలకు అసభ్యకర సందేశాలు పంపుతూ పైశాచికానందాన్ని పోందుతుంటారు. అయితే ఆడదాన్ని అలుసుగా చూసి అసభ్య సందేశాలు పంపితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూపించిందో మహిళ. చైనాలోని ఓ ప్రభుత్వ కార్యాలయ అధికారి వాంగ్ ఆ ఆఫీస్‌లో స్వీపర్‌గా పనిచేసే మహిళతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆమెనే కాకుండా.. ఆఫీసులోని చాలా మంది మహిళలతోను ఇలానే ప్రవర్తించేవాడు.
అతని బాధలు పడలేక అక్కడి నుంచి చాలా మంది మహిళలు వేరే ఉద్యోగాలకు మారిపోయేవారు. ఒకరోజు వాంగ్ ... జో అనే మహిళకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫొటోలు పంపించాడు. అయితే.. మొదట్లో ఉద్యోగం కోసం ఉరుకున్నా, వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఆమె ఉగ్ర అవతారమెత్తి ఆ బాస్‌పై తిరగబడింది. తన సహచరులతో కలసి అతని క్యాబిన్‌కు వెళ్లింది. నేలను తుడిచే గుడ్డ కర్రతో అతడిని చితక్కొట్టింది. దీన్ని తోటి ఉద్యోగులు వీడియో తీశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె చేసిన ధైర్యానికి తోటి ఉద్యోగులు అభినందిస్తున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు హ్యట్సాఫ్.. బాగా బుధ్దిచెప్పావంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన తర్వాత అక్కడి ప్రభుత్వం ఆ ఉద్యోగిని విధుల నుంచి తోలగించడమే కాక అతనిపై చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment