bijing
-
చైనా కర్కశత్వం.. వారిని పశువులకన్నా హీనంగా క్రేన్ల సాయంతో..!
బీజింగ్: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో కోవిడ్ రోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉంది. కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న క్రమంలో పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షల విధించింది జిన్‌పింగ్ ప్రభుత్వం. ఈ క్రమంలో కోవిడ్ సోకిన ఓ రోగిని క్రేన్ ద్వారా తీసుకెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు చైనా ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రోగులను పశువలకన్నా హీనంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఆంక్షలు విధించిన ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఓ భవనంలోని కిటికీలోంచి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సామాజిక దూరం పాటించే క్రమంలో వైరస్ సోకిన వ్యక్తిని క్రేన్ సాయంతో తీసుకెళ్లారు. ట్విటర్లో ఈ వీడియోను ఇప్పటి వరకు 221వేల మంది వీక్షించారు. 1.8వేల లైకులు వచ్చాయి. చైనాలో కరోనా వైరస్ కట్టడికి జీరో కోవిడ్ పాలసీని అవలంభిస్తోంది జిన్‌పింగ్ ప్రభుత్వం. కరోనా కేసులు వచ్చిన ప్రాంతంలో కఠిన లాక్డౌన్లు విధిస్తున్నారు. కీలక నగరాల్లో లాక్డౌన్లు విధించటం ద్వారా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉన్నందున చైనా ప్రభుత్వంపై అంతర్జాతీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ తొలిసారి గుర్తించిన వూహాన్ నగరంలో మళ్లీ లాక్డౌన్ విధించటం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్ 26 నుంచి 30వ తేదీ వరకు లాక్డౌన్ విధించగా.. 8 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. 中国式现代化。【方老师,投稿一个防疫大革命的荒谬视频。一个阳性患者被吊机吊出小区,因为他们不敢进去接,也不想患者的细菌留在地板上,这样能保证最小的接触面积。】 pic.twitter.com/2BM3Afm3V6 — 方舟子 (@fangshimin) October 25, 2022 ఇదీ చదవండి: పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?.. అమెరికా ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయ్ -
ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి.. 60 నిద్ర మాత్రలు మింగేశాడు!
బీజింగ్: ఒక్కొసారి జీవితంలో మనం ఊహించుకునే దానికి, జరిగే దానికి చాలా తేడా ఉంటుంది. మనం పెట్టుకున్న అంచనాలు.. పూర్తిగా తలకిందులుగా మారుతుంటాయి. ఇలాంటి పరిస్థితులను కొందరు ధైర్యంగా ఎదుర్కొంటే.. మరికొందరు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. ఈ సమయాల్లో వీరు .. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తమ మిత్రులకు గానీ, దగ్గరి వారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చెబుతుంటారు. ఈ సమయంలో అవతలివారు.. అప్రమత్తంగా వ్యవహరిస్తే.. బాధితుల ప్రాణాలు నిలుస్తాయి. తాజాగా, ఒక డెలీవరీ బాయ్ అప్రమత్తంగా వ్యవహరించడంతో.. ఒక నిండు ప్రాణం నిలిచింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాలు.. చైనాలోని హెనాన్ ప్రావీన్స్‌లో ఒక కస్టమర్ వ్యాపారంలో నష్టపోయాడు. ఈ క్రమంలో తాను.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే, తనకు ఇష్టమైన ఆహరం తిని చనిపోవాలనుకున్నాడో.. ఏమో గానీ.. ఫుడ్ కోసం ఆర్డర్ పెట్టాడు. ఈ క్రమంలో.. డెలీవరీబాయ్ డెలీవరీని ఇవ్వడానికి కస్టమర్ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ‘ది లాస్ట్ మీల్ ఇన్ మై లైఫ్ ’ ఇది నా జీవితంలో చివరి భోజనం.. అంటూ నోట్ రాసిపెట్టి ఉంది. దీన్ని చూసిన డెలీవరీబాయ్ షాక్‌కు గురయ్యాడు. కస్టమర్ ఇంటి తలుపు తట్టడానికి ప్రయత్నించాడు. ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కస్టమర్‌ను.. తలుపును తీయాలని కోరారు. అయితే, బలవంతంగా లోపలికి వస్తే.. కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో పోలీసులు బాధితుడిని ఓదార్చి.. మాటల్లో పెట్టారు. ఆ తర్వాత.. బాధితుడు చెప్పిన విషయాన్ని ఓపికతో విన్నారు. కాగా, కస్టమర్.. తాను చేస్తున్న వ్యాపారంలో నష్టం రావడంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. ఆ తర్వాత పోలీసులు చాకచక్యంగా గదిలోపలికి ప్రవేశించారు. కస్టమర్ అప్పటికే బాధతో 60 నిద్రమాత్రలు మింగినట్లు గుర్తించారు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సరైన సమయానికి ఆసుపత్రికి తరలించడంతో బాధితుడి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం .. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. డెలీవరీ బాయ్‌ను అభినందిస్తున్నారు. -
చైనాలో గ్యాస్ లీక్: ఏడుగురు మృతి
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో టాక్సిక్ గ్యాస్ లీకైనది. ఈ విష వాయువు పీల్చుకుని ఏడుగురు మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యిబిన్ నగరంలోని చాంగ్నింగ్ కౌంటీలోని ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఆ ఫ్యాక్టరీలో మరమ్మత్తు పనులు జరిగే సమయంలో ఈ గ్యాస్ లీకైనట్లు జిన్హువా కౌంటీ అధికారులు తెలిపారు. విషవాయువు పీల్చుకుని బాధితులు మొదట స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లారు. వారికి వైద్య చికిత్స అందించడానికి ఆస్పతికి తరలించగా మార్గమధ్యలోనే మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. (చదవండి: తగ్గుతున్న కరోనా: 2 లక్షల దిగువకు కొత్త కేసులు) -
బాస్‌ను చితక్కొట్టిన మహిళ, కారణం తెలిస్తే శభాష్ అనాల్సిందే!
బీజింగ్: పని ప్రదేశాలలో మహిళలను వేధించకూడదని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కొంత మంది దుర్మార్గులు మారడం లేదు. వారు తమ కింద పనిచేసే మహిళలకు అసభ్యకర సందేశాలు పంపుతూ పైశాచికానందాన్ని పోందుతుంటారు. అయితే ఆడదాన్ని అలుసుగా చూసి అసభ్య సందేశాలు పంపితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూపించిందో మహిళ. చైనాలోని ఓ ప్రభుత్వ కార్యాలయ అధికారి వాంగ్ ఆ ఆఫీస్‌లో స్వీపర్‌గా పనిచేసే మహిళతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆమెనే కాకుండా.. ఆఫీసులోని చాలా మంది మహిళలతోను ఇలానే ప్రవర్తించేవాడు. అతని బాధలు పడలేక అక్కడి నుంచి చాలా మంది మహిళలు వేరే ఉద్యోగాలకు మారిపోయేవారు. ఒకరోజు వాంగ్ ... జో అనే మహిళకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫొటోలు పంపించాడు. అయితే.. మొదట్లో ఉద్యోగం కోసం ఉరుకున్నా, వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఆమె ఉగ్ర అవతారమెత్తి ఆ బాస్‌పై తిరగబడింది. తన సహచరులతో కలసి అతని క్యాబిన్‌కు వెళ్లింది. నేలను తుడిచే గుడ్డ కర్రతో అతడిని చితక్కొట్టింది. దీన్ని తోటి ఉద్యోగులు వీడియో తీశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె చేసిన ధైర్యానికి తోటి ఉద్యోగులు అభినందిస్తున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు హ్యట్సాఫ్.. బాగా బుధ్దిచెప్పావంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన తర్వాత అక్కడి ప్రభుత్వం ఆ ఉద్యోగిని విధుల నుంచి తోలగించడమే కాక అతనిపై చర్యలు తీసుకుంది. -
స్మాగ్ ఫ్రీ .. రింగ్ గిఫ్ట్..
వాతావరణ కాలుష్యం.. ఈ పేరు చెబితేనే ప్రపంచంలోని అనేక దేశాలు వణికిపోతాయి. దీని వల్ల కలిగే అనర్థాలకు అంతే లేదు. మొన్నీమధ్య కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకొని చైనా రాజధాని బీజింగ్‌లో ప్రజలను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ సంఘటన చూసి డచ్‌కు చెందిన డాన్ రూసర్ గార్డె కాలుష్యానికి విరుగుడుగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్యూరిఫయర్ కనుగొన్నాడు. ఆకాశాన్ని కమ్ముకున్న కాలుష్య మేఘాల నుంచి కణాలను తన వైపు ఆకర్షించి స్యచ్ఛమైన గాలిలా మార్చే స్మాగ్ ఫ్రీ టవర్‌కు రూసర్ రూపకల్పన చేశాడు. అంతే కాకుండా కాలుష్య కణాలను ఆ టవర్ కంప్రెస్ చేసి డైమండ్ రూపంలో ఉన్న రాళ్లను ఉత ్పత్తి చేస్తుంది. చూడడానికి అందంగా ఉండే ఈ రాళ్ల రూపంలో ఉన్న వస్తువు ఆభరణంగా వాడడానికి పనికొస్తుంది. ఇది ఇయాన్ టెక్నాలజీతో పనిచేస్తుందని గార్డె తెలిపాడు. ఈ టవర్ చుట్టు పక్కల పరిసరాలను 75 శాతం వరకు క్లీన్‌గా ఉంచగ లుగుతుందని గార్డె తెలిపాడు. ఈ టవర్‌ను తొలిసారిగా సెప్టెంబర్‌లో బీజింగ్‌లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్మాగ్ ఫ్రీ టవర్ వాతావరణ కాలుష్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పాడు. హాలండ్‌లో నిర్వహించిన ముందస్తు పరీక్షల్లో స్మాగ్ ఫ్రీ టవర్ మంచి ఫలితాలను ఇచ్చింది. బీజింగ్‌లో అమర్చిన తర్వాత ప్రపంచంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని వాడనున్నారు.