work places
-
ఆఫీసులో ఫోన్ ఛార్జింగ్ పెడితే జీతం కట్!
స్మార్ట్ ఫోన్.. మనకి రోజూవారీ పనుల్లో ఓ భాగం అయ్యింది. బయటకు వెళ్లేప్పుడు మాస్క్ మరిచిపోతున్నా.. ఫోన్ మాత్రం వెంటే ఉంటుంది. మరి వాడకానికి తగ్గట్లు పాపం ఛార్జింగ్ కూడా అవసరం కదా! అందుకే చాలామంది పని చేసే చోట్ల కూడా ఫోన్లకు ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. అయితే ఇక్కడో బాస్ అందుకు అభ్యంతరం చెప్తున్నాడు. వర్క్‌ప్లేస్‌లో ఫోన్ ఛార్జింగ్ పెట్టడం కుదరదని అంటున్నాడు ఆ బాస్. ఆ బాస్, ఆఫీస్ ఎక్కడిదనేది క్లారిటీ లేదు. కానీ, ఇందుకు సంబంధించిన ఓ పేపర్ నోట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ అలవాటు కరెంట్ దొంగతనం కిందకే వస్తుందని, పనిచోట నైతిక విలువలకు సంబంధించిన విషయమని పేర్కొన్నాడు ఆ బాస్. ఈ నోట్ రెడ్డిట్ వెబ్సైట్లో చర్చకు దారితీసింది. గంటల తరబడి ఆఫీసుల్లో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతుందని, అలాంటప్పుడు ఆఫీస్ కరెంట్ ఉపయోగించుకోవడంలో తప్పేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు. మరికొందరేమో ఆ బాస్ చేసింది కరెక్టేనని, దీనివల్ల ఫోన్-ఇంటర్నెట్ వాడకం తగ్గుతుందని, అంతేకాదు మైండ్ డైవర్షన్ లేకుండా పనిలో నైపుణ్యం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే వర్క్ ప్లేస్‌లో ఫోన్, డివైస్ల ఛార్జింగ్‌ను చాలా కంపెనీలు వ్యతిరేకిస్తాయని, వాల్‌మార్ట్ లాంటి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ సైతం ఇలాంటి నిబంధనను అమలు చేస్తోందని గుర్తు చేస్తున్నారు ఇంకొందరు. ఇక ఈ నోట్ మూడేళ్ల క్రితమే రెడ్డిట్‌లో ఇలా చర్చకు దారితీయడం మరో విశేషం. చదవండి: Work From Home.. మారిన రూల్స్! ఏంటంటే.. -
బాస్‌ను చితక్కొట్టిన మహిళ, కారణం తెలిస్తే శభాష్ అనాల్సిందే!
బీజింగ్: పని ప్రదేశాలలో మహిళలను వేధించకూడదని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కొంత మంది దుర్మార్గులు మారడం లేదు. వారు తమ కింద పనిచేసే మహిళలకు అసభ్యకర సందేశాలు పంపుతూ పైశాచికానందాన్ని పోందుతుంటారు. అయితే ఆడదాన్ని అలుసుగా చూసి అసభ్య సందేశాలు పంపితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూపించిందో మహిళ. చైనాలోని ఓ ప్రభుత్వ కార్యాలయ అధికారి వాంగ్ ఆ ఆఫీస్‌లో స్వీపర్‌గా పనిచేసే మహిళతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆమెనే కాకుండా.. ఆఫీసులోని చాలా మంది మహిళలతోను ఇలానే ప్రవర్తించేవాడు. అతని బాధలు పడలేక అక్కడి నుంచి చాలా మంది మహిళలు వేరే ఉద్యోగాలకు మారిపోయేవారు. ఒకరోజు వాంగ్ ... జో అనే మహిళకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫొటోలు పంపించాడు. అయితే.. మొదట్లో ఉద్యోగం కోసం ఉరుకున్నా, వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఆమె ఉగ్ర అవతారమెత్తి ఆ బాస్‌పై తిరగబడింది. తన సహచరులతో కలసి అతని క్యాబిన్‌కు వెళ్లింది. నేలను తుడిచే గుడ్డ కర్రతో అతడిని చితక్కొట్టింది. దీన్ని తోటి ఉద్యోగులు వీడియో తీశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె చేసిన ధైర్యానికి తోటి ఉద్యోగులు అభినందిస్తున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు హ్యట్సాఫ్.. బాగా బుధ్దిచెప్పావంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన తర్వాత అక్కడి ప్రభుత్వం ఆ ఉద్యోగిని విధుల నుంచి తోలగించడమే కాక అతనిపై చర్యలు తీసుకుంది. -
ఆ వేధింపులపై నివేదికలు ఇవ్వాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రైవేట్ కంపెనీలు తమ ప్రాంగణాల్లో జరిగే లైంగిక వేధింపులు కేసుల వివరాలను ఇకపై వార్షిక నివేదికల్లో పొందుపరచాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీల (అకౌంట్స్) నిబంధనలు, 2014ను సవరించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ వినతి మేరకు ఈ మార్పులు చేపట్టారు. ప్రైవేట్ రంగంలో పని ప్రదేశాలను మహిళలకు సురక్షితంగా మలిచే క్రమంలో ఈ చర్య ఆహ్వానించదగినదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్వాగతించారు. కార్యాలయాల్లో మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులపై ఫిర్యాదులు,కేసుల వివరాలు చేపట్టిన చర్యలను వార్షిక నివేదికల్లో పొందుపరచని కంపెనీలపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
ఇలా చేస్తే ఏటా రూ 4600 కోట్లు ఆదా
సాక్షి, ముంబయిః మహానగరాల్లో ఉద్యోగం అంటే రోజూ ఆఫీసుకు వెళ్లిరావడానికే నాలుగైదు గంటలు వెచ్చించడంతో పాటు చార్జీలు, పెట్రోల్ ఖర్చు తడిసిమోపెడవ్వాల్సిందే...ఈ క్రమంలో కార్యాలయాలకు దగ్గర్లో ఉంటే ముంబయి మహానగర వాసులు ఏటా రూ 4600 కోట్లు ఆదా చేయవచ్చని ఓ సర్వే వెల్లడించింది. ఇలా చేస్తే ముంబయి నగర ప్రజలు అంతా కలిసి ఏటా కోట్లాది రూపాయలు ఆదా చేయడంతో పాటు 1.35 లక్షల సంవత్సరాల విలువైన ప్రయాణ సమయమూ కలిసివస్తుందని సర్వే తేల్చింది. తమ పని ప్రదేశానికి తగినట్టుగా ప్రజలు జీవించడం ప్రారంభిస్తే వారి ప్రయాణ కష్టాలు గణనీయంగా తగ్గుతాయని, దేశ ఆర్థిక రాజధానిలో ఉత్పాదకతా మరింత మెరుగవుతుందని ప్రాపర్టీ వెబ్సైట్ నోబ్రోకర్ వెల్లడించింది.ముంబయిలో పనిచేసే జనాభా 78.2 లక్షల మందిలో 62.5 లక్షల మందికి పైగా వారానికి ఐదు రోజులు కార్యాలయాలకు ప్రయాణిస్తుంటారని ఈ పోర్టల్ పేర్కొంది.ముంబయి సిటీ రోడ్లపై రోజూ 30 లక్షల పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అయితే పనిప్రదేశాలకు సుదూర ప్రయాణాలు తగ్గిస్తే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, ఇది 6.3 కోట్ల చెట్లతో సమానమని సర్వే తేల్చింది.