ఇలా చేస్తే ఏటా రూ 4600 కోట్లు ఆదా
Published Sun, Sep 17 2017 4:30 PM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM
సాక్షి, ముంబయిః మహానగరాల్లో ఉద్యోగం అంటే రోజూ ఆఫీసుకు వెళ్లిరావడానికే నాలుగైదు గంటలు వెచ్చించడంతో పాటు చార్జీలు, పెట్రోల్ ఖర్చు తడిసిమోపెడవ్వాల్సిందే...ఈ క్రమంలో కార్యాలయాలకు దగ్గర్లో ఉంటే ముంబయి మహానగర వాసులు ఏటా రూ 4600 కోట్లు ఆదా చేయవచ్చని ఓ సర్వే వెల్లడించింది. ఇలా చేస్తే ముంబయి నగర ప్రజలు అంతా కలిసి ఏటా కోట్లాది రూపాయలు ఆదా చేయడంతో పాటు 1.35 లక్షల సంవత్సరాల విలువైన ప్రయాణ సమయమూ కలిసివస్తుందని సర్వే తేల్చింది.
తమ పని ప్రదేశానికి తగినట్టుగా ప్రజలు జీవించడం ప్రారంభిస్తే వారి ప్రయాణ కష్టాలు గణనీయంగా తగ్గుతాయని, దేశ ఆర్థిక రాజధానిలో ఉత్పాదకతా మరింత మెరుగవుతుందని ప్రాపర్టీ వెబ్‌సైట్ నోబ్రోకర్ వెల్లడించింది.ముంబయిలో పనిచేసే జనాభా 78.2 లక్షల మందిలో 62.5 లక్షల మందికి పైగా వారానికి ఐదు రోజులు కార్యాలయాలకు ప్రయాణిస్తుంటారని ఈ పోర్టల్ పేర్కొంది.ముంబయి సిటీ రోడ్లపై రోజూ 30 లక్షల పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అయితే పనిప్రదేశాలకు సుదూర ప్రయాణాలు తగ్గిస్తే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, ఇది 6.3 కోట్ల చెట్లతో సమానమని సర్వే తేల్చింది.
Advertisement