వీడియో దృశ్యాలు
అడవి జంతువుల నుంచి మనషులకు జరిగే నష్టం కంటే.. మనుషుల నుంచి జంతువులకు జరిగే నష్టమే అధికంగా ఉంటుంది. మనిషి అడవుల్ని ఆక్రమించి అడవి జంతువులకు నిలువనీడ లేకుండా చేస్తున్నాడు. ఆకలితోనో, దాహంతోనో ఊర్ల బాట పట్టిన వాటిని దారుణంగా హింసించి తరిమేస్తున్నాడు. అడవి జంతువులపై మనుషులు అమానుషంగా ప్రవర్తించిన సంఘటనలు కోకొళ్లలు. గుంపులు గుంపులుగా జనం ఏనుగును వెంటాడుతున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సుధా రమెన్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారి ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ మాటల్లేవు.. ఇక్కడ జంతువెవరో నాకు అర్థంకావటం లేదు. ప్రతీ కేసు ఓ ప్రత్యేమైనది. వీటికి ఓ స్థిరమైన పరిస్కారం అంటూ ఉండదు. మనుషుల మానవత్వం లేని చర్యల వల్ల జంతువులు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. దీనిపై అవగాహన అవసరం’ అని పేర్కొన్నారు.
ఆ వీడియోలో.. రాత్రి వేళ ఓ ఏనుగు రోడ్డుపై పరిగెడుతూ ఉంది. దాని వెనకాల గుంపులు గుంపులుగా జనం గట్టిగా అరుస్తూ, తరుముతూ ఉన్నారు. ఆ ఏనుగు చావు భయంతో పరిగెడుతూ మరింత చీకట్లలో కలిసిపోయినా జనం దాన్ని వదల్లేదు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ దీన్ని ఏమని పిలవాలి? ఆ జనం చేసింది సిగ్గు లేని పని’’.. ‘‘ బాధాకరం, జంతువుల్ని కాపాడాలని జనాలకు ఎలా చెప్పాలి?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
No words!! Wondering who is the animal here 😔 pic.twitter.com/LAcY276HdX
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) March 17, 2021
Comments
Please login to add a commentAdd a comment