విశాఖపట్నం : విశాఖ జిల్లా రోలుగుంట మండల పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 160 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని నిందిగొండ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వాహనంలో బస్తాల్లో తరలిస్తున్న 160 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొకరు పరారయ్యారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.