విశాఖపట్టణం : అక్రమంగా తరలిస్తున్న 15 బస్తాల గంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... విశాఖపట్టణం జిల్లా రొలుగుంట మండలంలోని పెదగడ్డ వంతెన వద్ద పోలీసులు వాహనాలు పరిశీలిస్తుండగా గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు.
కాగా తనిఖీలను గమనించిన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పట్టు బడిన గంజాయి విలువ రూ. 50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
(రోలుగుంట)