విశాఖపట్నం : విశాఖ జిల్లా లో పెద్ద ఎత్తున గంజాయిని అక్రమంగా తరలిస్తూ ఐదుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. జిల్లా పరిధిలోని చింతపల్లి నుంచి తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి వెళ్తుతున్న లారీని శుక్రవారం ఉదయం నర్సీపట్నంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న విషయం వెలుగు చూసింది.
దీంతో లారీలో ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వాహనంతో పాటు 600 కేజీల గంజాయి, 5 సెల్‌ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని సమాచారం.
(నర్సీపట్నం)