హమ్మయ్య జీతాలిచ్చారు! | finally some employees got salary | Sakshi
Sakshi News home page

హమ్మయ్య జీతాలిచ్చారు!

Published Wed, Jan 22 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

గురువుల ఇక్కట్లు కాస్త తీరాయి. జీవీఎంసీ ‘దీర్ఘకాలిక’ ఉ పాధ్యాయుల కేసులో బాధితులకు స్వల్ప ఊరట లభించింది. గతేడాది మే నెల నుంచి ఇప్పటి వరకు జీతాల కోసం అగచాట్లు పడుతున్న వారి దీన గాథను ‘ అ-అప్పు.. ఆ-ఆవేదన’ శీర్షికన సాక్షిలో ఈ నెల 19న వెలువడిన కథనానికి అధికారులు స్పందించారు.

 సాక్షి, విశాఖపట్నం: గురువుల ఇక్కట్లు కాస్త తీరాయి. జీవీఎంసీ ‘దీర్ఘకాలిక’ ఉ పాధ్యాయుల కేసులో బాధితులకు స్వల్ప ఊరట లభించింది. గతేడాది మే నెల నుంచి ఇప్పటి వరకు జీతాల కోసం అగచాట్లు పడుతున్న వారి దీన గాథను ‘ అ-అప్పు.. ఆ-ఆవేదన’ శీర్షికన సాక్షిలో ఈ నెల 19న వెలువడిన  కథనానికి అధికారులు స్పందించారు. రెండు మాసాలుగా తమ చుట్టూ తిప్పించుకుంటున్న ట్రెజరీ అధికారులు ఎట్టకేలకు కరుణించారు.
 జిల్లా విద్యాశాఖ చేపట్టిన బదిలీల ద్వారా జీవీఎంసీ పరిధిలోని స్థానాల్లోకి చేరిన 23 మందికి గతేడాది మే 16 నుంచి జూన్ 30 వరకు, డిసెంబర్ నెల జీతాలు రూ.10,95,892 వారి బ్యాంకు ఖాతాలకు మంగళవారం జమ చేశారు.
 
 కోర్టు ఉత్తర్వుల పేరిట పాత స్థానాల్లో కొనసాగుతున్న 35 మంది(వీరిలో ఐదుగురు డిసెంబర్లోనే బదిలీ స్థానాల్లో చేరిపోయారు)కి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలకుగాను రూ.29,66,674లు వారి ఖాతాల్లో జమయ్యాయి.
 
 విద్యాశాఖ ఉత్తర్వులతో కొత్తగా ఆ స్థానా ల్లో చేరిన 23 మందికి ఇంకా జూలై నుంచి నవంబర్ వరకు జీతాలు రావాల్సి ఉంది.
 
 బదిలీ ఉత్తర్వుల్ని అందుకోకుండా మెడికల్ లీవులో ఉన్న 30 మందికి డిసెంబర్ నుంచి జీతా లు రావాల్సి ఉన్నప్పటికీ వారెక్కడ పనిచేస్తున్నా రో.. తెలియని కారణంగా జీతాల బిల్లులు పెట్టలేమంటూ డీఈవో లింగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
 
 23 మందికి మిగిలిన ఐదు మాసాల జీతాలను కూడా 20 శాతం హెచ్‌ఆర్‌ఏతో తక్షణమే చెల్లించాల్సిందిగా వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిరికి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
 
 డీఈవో ఉత్తర్వుల మేరకే..
 డీఈవో ఆదేశాల మేరకు ‘కొత్త’ టీచర్ల కు వారు పనిచేస్తోన్న జీవీఎంసీ పరిధిలోని 20 శాతం హెచ్‌ఆర్‌ఏతోనే జీతా లు, బకాయిలు చెల్లించే ఏర్పాట్లు చే శాం.జనవరి నెల బిల్లులు సిద్ధమయ్యా యి. జూలై నుంచి నవంబర్ వరకు చెల్లించాల్సిన జీతాభత్యాలను కూడా డీఈవో ఉత్తర్వుల ఆధారంగా నాలుగు మండలాల్లో ఖాళీగా ఉన్న 20 శాతం హెచ్‌ఆర్‌ఏతో కలిపి చెల్లిస్తాం. బదిలీ టీచర్లకు ఎల్‌పీసీ, ట్రెజరీ ఐడీలను వారికి కేటాయించిన గ్రా మీణ మండలాలకు ఇప్పటికే బదిలీ చేశాం.
 - సి.ఆర్.కె.దేవరాయలు,
 ఎంఈవో, పెందుర్తి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement