
తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా ఎప్పుడూ ప్రేక్షకులకు సరికొత్తగా వినోదం పంచే దిశగా అడుగు వేస్తోంది. అందుకే ప్రారంభమైన తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ప్రేక్షకుడి అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కంటెంట్‌ను అందిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితం కాకుండా టాక్ షోలతో డిజిటల్ వ్యూవర్స్‌కి సరికొత్త అనుభూతిని పంచేందుకు టాక్ షోలు నిర్వహిస్తోంది. ఇందుకోసం ఆరంభంలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత సామ్ జామ్ టాక్ షో నిర్వహించి టాలీవుడ్ బిగ్ సెలబ్రెటీలతో సందడి చేయించింది.
చదవండి: ‘పుష్ప’లో చేయనని చెప్పాను: నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం ఏకంగా అగ్ర హీరో నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాబుల్ విత్ బాలయ్య’ పేరుతో మరో టాక్ షో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో సంచలనానికి తెర తీసింది ఆహా. త్వరలోనే తెలుగు ఓటీటీలో ఇండియన్ ఐడల్ షోను పరిచయం చేయబోతున్నామంటూ ప్రకటన ఇచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్ ఐడల్ అంటే హిందీలో జరిగే సింగింగ్ రియాలిటీ షోని మనకు తెలిసిందే. హీందీలో 12 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పటి వరకు తెలుగులో లేదు. దీంతో ఇండియన్ ఐడల్ తెలుగులో పరిచయం చేసేందుకు ఆహా సన్నాహాలు చేస్తోంది.
చదవండి: షాకిస్తున్న అనసూయ లేటెస్ట్ లుక్, ఈ రేంజ్‌లో గ్లామర్ ఇచ్చిందా!
దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది ఆహా. తెలుగు సింగింగ్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఆడిషన్స్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించారు ఆహా నిర్వహకుల. డిసెంబర్ 26న తొలి ఆడిషన్స్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న గాయనీగాయకులకు ఆహ్వానం అందించారు. ఇక ఈ ఆడిషన్స్ హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఒయాసిస్ స్కూల్‌లో నిర్వహించనున్నారు.
Can it get better than this? WE THINK NOT. The former Indian Idol winner @singerrevanth to host first-ever #TeluguIndianIdol.@fremantle_india @instagram pic.twitter.com/6Wh6K6vUPW
— ahavideoIN (@ahavideoIN) December 18, 2021