'అమెరికన్ ఐడల్'కు ర్యాన్ సీక్రెస్ట్ గుడ్ బై? | Ryan Seacrest to quit 'American Idol'? | Sakshi
Sakshi News home page

'అమెరికన్ ఐడల్'కు ర్యాన్ సీక్రెస్ట్ గుడ్ బై?

Published Sun, Apr 20 2014 10:28 AM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM

'అమెరికన్ ఐడల్'కు ర్యాన్ సీక్రెస్ట్ గుడ్ బై? - Sakshi

'అమెరికన్ ఐడల్'కు ర్యాన్ సీక్రెస్ట్ గుడ్ బై?

యూఎస్ లో అత్యధిక జనాదరణ పొందిన 'అమెరికన్ ఐడల్' టెలివిజన్ కార్యక్రమానికి యాంకర్, ప్రొడ్యూసర్ ర్యాన్ సీక్రెస్ట్ గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. నిర్మాతగా కార్యక్రమాలను రూపొందించడానికి 'అమెరికన్ ఐడల్'కు వదులుకునేందుకు సిద్దపడినట్టు ఓ వైబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. 2002లో ప్రారంభమైన 'యూఎస్ రియాల్టీ పాటల పోటీ'కి అమెరికాలో అత్యంత జనాదరణ లభించింది. 
 
'అమెరికన్ ఐడల్'కు ఇదే చివరి సీజన్ అని మిత్రులకు ర్యాన్ తెలిపినట్టు ఓ గాసిప్ వెబ్ సైట్ వెల్లడించింది. ఆస్కార్ రేంజ్ లో చిత్రాలను నిర్మించడానికి, మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలకు స్వీకారం చుట్టేందుకు ర్యాన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 'అమెరికన్ ఐడల్' కుదుర్చుకున్న 30 మిలియన్ డాలర్ల కాంట్రాక్టు పూర్తి కావొస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 'అమెరికన్ ఐడల్'ను స్పూర్తిగా తీసుకుని భారత్ లో 'ఇండియన్ ఐడల్' టెలివిజన్ కార్యక్రమం ఆరంభమై దేశవ్యాప్తంగా జనాదరణ పొందిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement