ప్రేమంటే అంత ద్వేషం దేనికి? | Singer Sri Ramachandra to debut as hero in Telugu movie | Sakshi
Sakshi News home page

ప్రేమంటే అంత ద్వేషం దేనికి?

Published Mon, Mar 24 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

ప్రేమంటే అంత ద్వేషం దేనికి?

ప్రేమంటే అంత ద్వేషం దేనికి?

ప్రపంచమంతా ప్రేమ మయం. యూత్ అయితే ప్రేమనామస్మరణతో తరించిపోతున్నారు. ఇలాంటి ఈ రోజుల్లో ఈ కుర్రాడు ‘ప్రేమా లేదు.. గీమా లేదు’ అంటున్నాడు. కూరలో కరివేపాకులా ప్రేమను తీసిపారేస్తున్నాడు. ఇంతకీ ఈ కుర్రాడెవరు? ప్రేమపై అంత ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నాడు? చివరకు ఈ కుర్రాడి జీవితంతో ప్రేమ ఎలా ఆడుకుంది? ఆనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమా గీమా జాన్‌తా నయ్’.
 
 ‘ఇండియన్ ఐడల్’ శ్రీరామచంద్ర, బార్బీ హండా జంటగా నటించారు. సుబ్బు ఆర్వీ దర్శకుడు. మద్దాల భాస్కర్(భాను), దాడి బాలభాస్కర్ నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ రెండోవారంలో విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘గాయకుడు శ్రీరామచంద్రను  హీరోగా స్థిరపరిచే సినిమా ఇది.

మహానటుడు ఎస్వీఆర్ మనవడు జూనియర్ ఎస్వీరంగారావు విలన్‌గా నటించారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. యువతరం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునే సినిమా అవుతుంది’’ అని తెలిపారు. నరేష్, భానుచందర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: సురేందర్‌రెడ్డి, జగదీష్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement