అను మాలిక్
బాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్‌పై ‘మీటూ’ ఉద్యమం ప్రభావం చూపింది. ఇండియన్ ఐడల్ 10 మ్యూజిక్ షోకు అను మాలిక్ ఇకపై జడ్జ్‌గా కొనసాగరని సంబంధిత సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. సింగర్స్ సోనా మహాపాత్ర, శ్వేతా పండిట్‌లు అను మాలిక్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘‘ఇండియన్ ఐడల్ షోకు అను మాలిక్ చాలా కాలం నుంచి జడ్జ్‌గా ఉన్నారు.
ఇప్పుడు ఇండియన్ ఐడల్ 10 షోకు విశాల్ దద్లాని, నేçహా కక్కర్‌తో కలిసి కో–జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇకపై ఇండియన్ ఐడల్ 10 షో జడ్జ్ ప్యానెల్‌లో అను మాలిక్ కొనసాగరు. ముందుగా ప్లాన్ చేసిన విధంగా షో కొనసాగుతుంది. విశాల్, నేహాలతో పాటు ఇండియన్ మ్యూజిక్‌లో మంచి పేరు సంపాదించుకున్న ఒక వ్యక్తి ఈ షోకు కో–జడ్జ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు’’ అని ఇండియన్ ఐడల్ షో యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నారని బాలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment