Anu Malik
-
ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్‌గా బుడ్డోడు.. ఇప్పుడు
సోషల్ మీడియా రాకతో కుగ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తమలోని కళలు, ప్రతిభను ప్రదర్శించడానికి సోషల్ మీడియా మంచి వేదికగా మారింది. సామాజిక మాధ్యమాలతో ఓవర్‌నైట్ స్టార్లుగా మారుతున్న వారిని చూస్తున్నాం. తాజాగా ఓ బుడతడు కూడా ఒక పాట పాడి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ఒక్క పాటతో ఇప్పుడు ఏకంగా ప్రఖ్యాత పాటల షోలో ప్రత్యక్షమయ్యాడు. (చదవండి: ఆ పాట నన్ను నిద్రపోనివ్వడం లేదు.. అనుష్క శర్మ) ఆ బుడ్డోడే చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్ డిర్డో. పాఠశాలలో ‘బచ్ పన్ కా ప్యార్ హై’ పాట సరదాగా పాడుతుండగా కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు చేరింది. ఆ బుడతడి గొంతు విని అందరూ ఫిదా అయ్యారు. జూలై 3వ తేదీన విడుదలైన ఆ వీడియో ఇప్పటివరకు 9 మిలియన్లకు పైగా వ్యూవ్స్ పొందింది. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ఆ బాలుడు హసదేవ్ని ప్రశంసలతో ముంచెత్తారు. తన వద్దకు పిలిచి మరీ ‘బచ్ పన్ కా ప్యార్’ అంటూ పాట పాడించుకుని దీవించారు. అనంతరం ఆ వీడియోను సీఎం నెటిజన్లతో పంచుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఫిదా అయిపోయారు. ఇప్పుడు హసదేవ్ సోనీ టీవీ నిర్వహించే ఇండియన్ ఐడల్ పాటల -12 పోటీల్లో ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ నేపథ్య గాయకుడు ఆదిత్య నారాయణ్ తెలిపాడు. సహదేవ్ ఇండియన్ ఐడల్ షోలో సందడి చేస్తున్న వీడియోను ఆదిత్య షేర్ చేశాడు. ఈ సమయంలో సహదేవ్ మళ్లీ బచ్పన్ కా ప్యార్ పాట పాడుతూ కనిపించాడు. బుడ్డోడు పాట పాడుతుంటే జడ్జిలు అను మాలిక్, సోనూ కక్కర్తో పాటు పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన గాయనీగాయకులు చిందేస్తున్నారు. సహదేవ్ రాకతో సందడిగా మారింది. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ పోటీలు సెమీ ఫైనల్‌కు చేరాయి. ఆగస్టు 15వ తేదీన ఫైనల్ పోటీలు జరగనున్నాయి. View this post on Instagram A post shared by Aditya Narayan (@adityanarayanofficial) View this post on Instagram A post shared by vishnu_singh91 (@only_mod031zzz) -
ఆ పాట కాపీనా? మ్యూజిక్ డైరెక్టర్ని ఆడేసుకుంటున్న నెటిజన్లు
సినిమా ఇండస్ట్రీలో కాపీల వివాదాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. స్టోరీ, పోస్టర్లు, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలా చాలా విషయాల్లో ఇతర సినిమా నుంచి కాపీ కొట్టారనే ఆరోపణలు అనేక సందర్భంలో రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో కాపీల వివాదాలు కోకొల్లలుగా పుడుతున్నాయి. తెలుగు నుంచి బాలీవుడ్, హాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనుమాలిక్ సినిమాలోని పాటపై వివాదం చుట్టుముట్టింది. అనుమాలిక్ సంగీతం అందించిన దిల్జాలే సినిమా బాలీవుడ్లో 1996లో విడుదలైంది. ఇందులో ‘మేరా ముల్క్ మేరా దేశ్’ అనే పాట ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. టోక్యో ఒలింపిక్స్‌లో ఇజ్రాయిల్ జిమ్నాస్ట్ అర్టెమ్ డోల్గోప్యాట్ రెండోసారి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న తర్వత వారి జాతీయ గీతం హత్వికాను ప్లే చేశారు. ఇది విన్న భారత నెటిజన్లు అప్పటి నుంచి అనుమాలిక్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇజ్రాయిల్ జాతీయ గీతం హతిక్వా, అను ముల్క్ మేరా దేశ్ పాటకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇజ్రాయిల్ జాతీయ గీతాన్ని దొంగిలించి తన చిత్రంలో ఉపయోగించుకున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేలాది మంది వరుస ట్వీట్లు చేస్తూ అను మాలిక్ పేరును ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిపారు. నెటిజన్లు కామెంట్లు ఇలా ఉన్నాయి. ‘అను మాలిక్ తమ పాటను కాపీ కొట్టారని ఒలంపిక్ గోల్డ్ తెలుసుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 1996 లోని దిల్జాలేలోని మేరా ముల్క్ మేరా దేశ్ పాట ట్యూన్ కాపీ చేస్తున్నప్పుడు అను మాలిక్ ఇజ్రాయెల్ జాతీయ గీతాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఇంటర్నెట్కు ధన్యవాదాలు., ఇది ఇప్పుడైనా మనకు తెలిసింది. బాలీవుడ్ ఇజ్రాయిల్ జాతీయ గీతాన్ని కాపీ కొట్టింది.. ఇది నెక్స్ట్ లెవల్.. అనుమాలిక్ ఎంతో కచ్చితంగా ఉన్నాడు. ఇజ్రాయిల్ ఎప్పటికీ గోల్డ్ మెడల్ సాధించదని, ఇక తన దొంగతనం బయటపడదని’ అంటూ సంగీత దర్శకుడిని ఓ ఆట ఆడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై మాలిక్ స్పందించలేదు. So Anu Malik didn’t spare even Israeli national anthem while copying tune for Diljale’s Mera Mulk Mera Desh in 1996 Thanks to internet we now know thispic.twitter.com/LtQMyU5dp2 — Monica (@TrulyMonica) August 1, 2021 It took 25 years and Olympic gold 🥇 to realise That Anu Malik copy "Mera Mulk Mera Desh"😅😅😅😅😅😅 https://t.co/Nrgd3uokSM — ₭₳฿łⱤ ₱₳₮ɆⱠ (@kabeerbackup) August 1, 2021 Bollywood copied Israel's national anthem tune, this is next level ..... Anu Malik !! 😂 https://t.co/bZ0VUjJ0dG — Veer Phogat (@VeerPhogat1) August 1, 2021 Anu Malik had confidence Israel will never win a gold and his robbery will remain hidden 😭 https://t.co/PJQClHAJHx — Straight Cut (@StraightCut_) August 1, 2021 No it is not just you. 100% true. I can't get over it. Anu Malik actually copied the Israeli national anthem for one of his songs! Utha le re baba 😂😂 WDTT https://t.co/GvXdvlusyu — Anand Ranganathan (@ARanganathan72) August 1, 2021 -
‘రియా కోసం అతడి గుండె రక్తమోడుతోంది’
ముంబై: బాలీవుడ్ ప్రముఖ సింగర్ విశాల్ దద్లానీపై గాయని సోనా మహాపాత్ర విమర్శలు గుప్పించారు. కాలానికి, మనుషులకు తగ్గట్లుగా ఆయన మనసు మారిపోతూ ఉంటుందని వంగ్యాస్త్రాలు సంధించారు. కాగా నటి తనూ శ్రీ దత్తా నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణ నేపథ్యంలో బాలీవుడ్లో మీటూ ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోనా సహా పలువురు ఆమె మద్దతుగా నిలబడ్డారు. మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ జడ్జి, సంగీత దర్శకుడు అను మాలిక్ తమను లైంగికంగా వేధించాడంటూ పలువురు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అనూ మాలిక్‌కు వ్యతిరేకంగా సోనా బలంగా తన గొంతు వినిపించారు. బాధితుల పక్షాన నిలబడ్డారు. అయితే అనూ మాలిక్‌తో అదే వేదికను పంచుకున్న సింగర్ విశాల్ దద్లానీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టైన విషయం విదితమే. అనేక పరిణామాల అనంతరం వీరిద్దరికి బెయిలు లభించగా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఈ విషయం గురించి గురువారం ట్విటర్లో ప్రస్తావించిన విశాల్.. ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అక్కాతమ్ముళ్ల అందమైన భవిష్యత్తును నాశనం చేశారంటూ మండిపడ్డాడు. తన రాజకీయ గురువులను ప్రసన్నం చేసుకునేందుకే ఇలా చేశాడంటూ ఆరోపించాడు.(చదవండి: ‘బెల్ట్ తీసి కొట్టేవాడు.. వేళ్లు విరిచేవాడు’) ఈ విషయంపై స్పందించిన ఓ నెటిజన్.. గురువుల మెప్పు పొందేందుకు మీటూ ఉద్యమం గురించి నోరు తెరవని నువ్వు ఇప్పుడిలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. అనుమాలిక్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని మీకు డబ్బు గురించి ఆలోచనే తప్ప ఇంకేమీ పట్టదంటూ ఘాటుగా విమర్శిస్తూ సోనా మహాపాత్రను ట్యాగ్ చేశారు. ఇందుకు బదులుగా.. ‘‘ మన అవసరాన్ని, సౌలభ్యాన్ని బట్టి ఏది సరైంది, ఏది కాదు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. రియా చక్రవర్తి కోసం దద్లానీ గుండె రక్తమోడుతోంది. కానీ ఇండియన్ ఐడల్‌లో ఆయన సహచరుడు అనూ మాలిక్ గురించి ఎంతో మంది మహిళలు ఆరోపణలు చేసినప్పుడు మాత్రం ఎలాంటి న్యాయన్యాయాలు గుర్తుకురాలేదు’’ అంటూ విమర్శించారు. “What is right is often forgotten by what is convenience.” Dadlani’s heart bleeds for Rhea Chakraborty & 🤟🏾🙏🏾.None of this justice bent came into play for Vishal when endless women called out his #IndianIdol colleague Anu Malik. @IndiaMeToo .#WontBeForgotten #India #WillRemember https://t.co/tHwsaXKdhC — Sona Mohapatra (@sonamohapatra) December 10, 2020 -
అతడు క్రూర జంతువు.. నీచుడు: నేహా
దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రకంపనలు సృష్టించిన ‘మీటూ ఉద్యమం’ మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్... పాటల కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా రావడమే ఇందుకు కారణం. పని ప్రదేశాల్లో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల గురించి బట్టబయలు చేస్తూ హాలీవుడ్లో మొదలైన మీటూ ఉద్యమం.. భారత్‌లోనూ క్రమంగా వ్యాపించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా.. విలక్షణ నటుడు నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణలతో ఉధృతమైన ఈ ఉద్యమం సినిమా, క్రీడలు, జర్నలిజం ఇలా ప్రతీ రంగంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న ఎంతో మంది మృగాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ గాయనీమణులు శ్వేతా పండిట్, సోనా మహాపాత్ర అను మాలిక్ తమ పట్ల ప్రవర్తించిన తీరును ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అను మాలిక్‌ను ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం నుంచి నిర్వాహకులు తొలగించారు. అయితే సెప్టెంబరులో మళ్లీ అతడిని న్యాయ నిర్ణేతగా తీసుకురావడం పట్ల ప్రముఖ గాయని నేహా బాసిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్పీ రేట్ల కోసం అతడిని మళ్లీ తీసుకువచ్చామంటూ నిర్వాహకులు తనతో చెప్పారని.. ఇది సరికాదంటూ మరోసారి గళమెత్తిన సోనాకు ఆమె అండగా నిలిచారు. ‘నేను నీతో ఏకీభవిస్తున్నాను. లింగవివక్ష కలిగిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అందులో అను మాలిక్ ఒక దిగజారుడు వ్యక్తి. 21 ఏళ్ల వయస్సులో నేను కూడా అతడి అసహజ చర్యల నుంచి తప్పించుకుని పారిపోయాను. ఓ రోజు స్టూడియోకు వెళ్లిన సమయంలో సోఫా మీద పడుకుని ఎదురుగా నన్ను కూర్చోమంటూ నా కళ్ల గురించి వర్ణించడం మొదలుపెట్టాడు. అయితే నేను మాత్రం వెంటనే విషయాన్ని పసిగట్టి కింద అమ్మ ఎదురుచూస్తోంది అని అబద్ధం చెప్పి అతడి నుంచి తప్పించుకున్నాను. ఆ తర్వాత కూడా అతడు నాకు మెసేజ్‌లు, కాల్స్ చేసి విసిగించేవాడు. కానీ నేను మాత్రం వాటికి స్పందించకుండా మిన్నకుండిపోయాను. అతడు ఒక క్రూర జంతువు’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా నేహా చేసిన వ్యాఖ్యలకు పలువురు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. అను మాలిక్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా జాగ్ ఘూమియా వంటి హిట్‌సాంగ్స్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేహా.. తెలుగులోనూ అటు నువ్వే ఇటు నువ్వే(కరెంట్), నిహారికా నిహారికా(ఊసరవెళ్లి), స్వింగ్ జరా(జై లవ కుశ) తదితర పాటలు పాడి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. I agee with you. We do live in a very sexist world. Anu Malik is a predetor, i too have run away from his strange moves when i was 21. I didn't let myself get into a sticky situation beyond him lying on a sofa in front of me talking about my eyes in a studio. I fleed lying https://t.co/tQgStLrYyT — Neha Bhasin (@nehabhasin4u) October 30, 2019 -
ఆరోపణలు సరే.. ఆధారాలేవి..?
మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మీడియా, సిని, రాజకీయ రంగాల్లోని పలువురు ప్రముఖులు మీటూ దెబ్బకు ఠారెత్తిపోయారు. కలలో కూడా ఊహించని వారి పేర్లు తెరమీదకు వచ్చాయి. మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బాలీవుడ్ ఇండస్ట్రీ పక్కకు పెట్టింది. ఇలా నిషేధం ఎదుర్కొంటున్న వారిలో కంపోజర్ అను మాలిక్ కూడా ఉన్నారు. సింగర్స్ సోనా మొహపాత్రా, శ్వేతా పండిట్ అను మాలిక్ తమను లైంగికంగా వేధించారని ఆరోపించారు. మరో ఇద్దరు మహిళలు కూడా అను మాలిక్ మీద ఇలాంటి ఆరోపణలే చేశారు. దాంతో బాలీవుడ్ అను మాలిక్ మీద నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాజ్ఞలను గాయకుడు సోను నిగమ్ వ్యతిరేకించారు. ఇలా చేసి అతని కుటుంబాన్ని బాధిస్తున్నారని ఆరోపించారు. అజెండా ఆజ్‌తక్‌తో మాట్లాడిన సోను నిగమ్, అను మాలిక్‌కు మద్దతిస్తూ.. ‘ఒక వేళ మీరు నాతో తప్పుగా ప్రవర్తించానని నేను ఆరోపిస్తే.. వెంటనే మీరు ఆధారాలేంటని అడుగుతారు. మరి అను మాలిక్ మీద ఆరోపణలు చేశారు. సరే ఇవి నిజమా, కాదా అనేది కూడా ఆలోచించకుండా జనాలు మిమ్మల్ని నమ్మారు. అలాంటప్పుడు సరైన ఆధారాలు చూపించాలి కదా. మరి ఆధారాలేవి? లేవు. కానీ ఇవేం ఆలోచించకుండా అతని మీద నిషేధం విదించారు. ఇది కరెక్టెనా. అతనికి పని దొరక్కుండా చేయడం ఎంత వరకూ న్యాయం. అతని కుటుంబాన్ని ఎలా హింసిస్తారు’ అంటూ ప్రశ్నించారు. మరోకరి జీవితాల్లోని తప్పోప్పులను నిర్ణయించే హక్కు మీకు ఎరిచ్చారన్నారు. మీరు అతన్ని నిందించవచ్చు, అవమానించవచ్చు. కానీ అతని కుటుంబాన్ని శిక్షించకూడదు. ముందు ఆధారాలు తీసుకురండి అన్నారు. సోను నిగమ్ మాట్లాడుతూ.. ‘అధికారం ఏ విధంగా దుర్వినియోగం అవుతోందో చెప్పడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు ‘మీటూ’ అంటున్నారు. కానీ పదేళ్ల క్రితమే నేను దీనిని ప్రారంభించాను. అప్పుడు ఒక జర్నలిస్ట్ నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఓ దర్శకుని దగ్గరకు వెళ్లి నాతో పనిచేస్తే తనను తాను చంపుకుంటానని సదరు జర్నలిస్ట్ దర్శకున్ని బెదిరించాడు’ అంటూ తనకు ఎదురైన అనుభవాల్ని చెప్పుకొచ్చారు. అంతేకాక నాకు ఇద్దరు సోదరీమణులున్నారు. నేను వారికి అండగా నిలబడతాను. దాని అర్థం మరోకరికి పని దొరక్కుండా చేస్తానని కాదు అన్నారు. హింస, వేధింపు, ఎక్కడైనా ఉంటాయి. కార్పొరేట్ ప్రపంచంలో కూడా జరుగుతున్నాయి. -
గెస్ట్‌హౌస్‌కు వస్తే నీకు సింగర్‌గా చాన్స్లిస్తా!
సినిమా సంగీత రంగంలో ఇన్ని అపస్వరాలు ఉన్నాయని మీటూ ఉద్యమంతో తేటతెల్లమైంది. ఒక తెలుగు సినిమాలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్. త్రిష అప్‌కమింగ్ సింగర్. కాంపిటీషన్‌కు ముందే ఆమె మీద కన్నేసిన బ్రహ్మానందం గదిలోకి పిలిచి ‘డీల్’ మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ‘నువ్వు గెస్ట్‌హౌస్‌కు వస్తే నీకు సింగర్‌గా చాన్స్లిస్తా’ అంటాడు. త్రిష ఒప్పుకోదు. అది కడుపులో పెట్టుకుని కాంపిటీషన్ సమయంలో ఆమె మీద కేకలేస్తాడు. ‘నిన్ను ఎక్కడికో తీసుకెళ్దామనుకుంటే నువ్వు రావు’ అంటాడు. లైంగికంగా వేధించడం ఒక వేధింపు అయితే పని పరంగా వేధించడం మరో వేధింపు. ఇలా వేధించే సంగీతకారులు హిందీ సినిమా రంగంలో ఉండటం ఒక వర్తమాన వాస్తవం అని మీటూ ఉద్యమం ద్వారా తెలుస్తోంది.‘బాజీగర్’ సినిమాలోని ‘ఏ కాలీ కాలీ ఆంఖే’ వంటి పెద్ద హిట్ పాటలిచ్చిన అనూ మలిక్‌పై మీటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బప్పీలహరి ప్రభ ముగిశాక బాలీవుడ్లో వెలిగిన సంగీత దర్శకుల్లో అనూ మలిక్ ఒకడు. ‘బోర్డర్’, ‘ఇష్క్’, ‘మై హూ నా’ వంటి చాలా సినిమాలు అతడి ఖాతాలో ఉన్నాయి. అతడి దృష్టిలో పడితే సింగర్‌గా మంచి కెరీర్ దక్కుతుందని కొత్త సింగర్లు ఆశిస్తారు. ఆ ఆశనే అతడు అవకాశంగా మలుచుకున్నాడని మీటూ ఆరోపణల వల్ల తెలుస్తున్నది. గాయనులు శ్వేతా పండిట్, సోనా మహాపాత్ర అతనిలోని కీచక స్వరాన్ని లోకానికి చాటారు. ‘2000 సంవత్సరంలో నాకు పాట ఇస్తానని స్టూడియోకి పిలిచి రికార్డింగ్ రూమ్‌లో హఠాత్తుగా నన్ను ముద్దు పెట్టమన్నాడు. అప్పుడు నాకు 15 ఏళ్లు కూడా లేవు. ఏమీ తెలియదు. కానీ అతడి పెదాల మీద పూసిన విషపు నవ్వుని చూసి భయంతో వణికిపోయాను. మా అమ్మకు కూడా ఈ విషయం చెప్పక ఇంటికి రాగానే దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను’ అని శ్వేతా పండిట్ చెప్పింది. మరో గాయని సోనా మహాపాత్ర అయితే ‘అతడు నాతో ప్రదర్శించిన వైఖరిలోనే లైంగిక చొరబాటు ఉంది’ అని చెప్పింది. ఇప్పుడు తాజాగా మరో గాయని కారలిసా మంటేరో ఈ ఇద్దరితో జత కలిసి అనూను తప్పు పట్టింది. ‘అతడు నన్ను ఊరికూరికే ఇంటికి రమ్మని ఇబ్బంది పెట్టేవాడు. పాట ఏదైనా ఉంటే రికార్డింగ్ స్టూడియోలోనే కలుస్తాను. ఇంట్లో కలవను అని చెప్పేదాన్ని. అప్పటికీ ఒకసారి వెళ్లాల్సి వస్తే నా స్నేహితుణ్ణి తీసుకుని వెళ్లాను’ అని చెప్పిందామె. తెలిసిన గాయనుల అనుభవాలు ఇలా ఉండగా అంతగా వృద్ధిలోకి రాకపోయినా అనూతో హడలెత్తించే అనుభవాలున్న మరో ఇద్దరు గాయనులు కూడా పత్రికలలో తమ పేర్లు ప్రస్తావించకుండా అనూ చేసిన దౌష్ట్యాలు చెప్పుకొచ్చారు. ‘అతడు నన్ను ఇంటికి పిలిచాడు. ఇంట్లో ఎవరూ లేరని అక్కడకు వెళ్లాక తెలిసింది. అతడు నన్ను దాదాపు రేప్ చేయబోయాడు. ఈలోపు బెల్ మోగడంతో బతికిపోయాను. ఆ తర్వాత నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్న నెపంతో దారిలో తప్పుగా వ్యవహరించాడు. దారి మధ్యలో కారు ఆపి బలవంతం చేశాడు’ అని ఒక సింగర్ చెప్పగా మరో సింగర్ ‘రికార్డింగ్ రూమ్‌లో అతడు నా ఒళ్లంతా తడిమేశాడు’ అని చెప్పింది. అనూ మలిక్ మీద వచ్చిన ఆరోపణల దుమారానికి అతడు ఇండియన్ ఐడల్ జడ్జి పదవి నుంచి తప్పుకున్నాడు. లాయర్ ద్వారా ఈ ఆరోపణలన్నీ అభాండాలు అని చెప్పిస్తున్నాడు. కానీ అనూ మలిక్ అలాంటి వాడేనని అతని మీద వచ్చిన అభియోగాల్లో ప్రతి అక్షరం సత్యమే అయ్యే అవకాశం ఉందని సీనియర్ గాయనీమణి అలీషా చినాయ్ ప్రకటన చేసింది. రెండు దశాబ్దాల క్రితం అనూ మలిక్ తనతో చెడుగా వ్యవహరించాడని కోర్టులో కేసు వేసిన అలీషా అతడి అసలు రూపాన్ని లోకానికి వెల్లడి చేసే ప్రయత్నం చేసింది. ఆ కేసును అనూ మలిక్ ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నాడు. అలీషా, అనూ కలిసి పని చేశారు కూడా. అయినప్పటికీ ఆ పాత గాయాన్ని ఆమె మర్చిపోలేదు. తాజా ఆరోపణల నేపథ్యంలో తనూ గొంతు కలిపింది. ‘ఆ రోజుల్లో నేను ఒక్కదాన్నే పోరాడాను. ఇవాళ చాలామంది కలిసి పోరాడుతున్నారు’ అని అందామె. ‘గాయపడినవాళ్లకే ఆ గాయం తాలూకు నొప్పి తెలుస్తుంది’ అని కూడా అంది. లైంగిక చొరబాటుకు, చెడు వర్తనకు ఏవో ఏకాంత ప్రదేశాలు, హోటల్ రూములు అక్కర్లేదని ఇల్లే పెద్ద ప్రమాదకరమైన ప్రదేశం అని అనూ మలిక్ ఉదంతం ద్వారా తెలుస్తోంది. అనూ మలిక్ స్త్రీలను ఇబ్బంది పెట్టేందుకు తన ఇంటినే ఎక్కువగా ఎంచుకున్నాడు. కుటుంబీకులు ఇంట్లో ఉన్నా లేకపోయినా అతడు కొత్త అమ్మాయిలతో చెడుగా వ్యవహరించడానికి తెగించేవాడని ఉదంతాలు చెబుతున్నాయి.మరోవైపు గాయకుడు కైలాష్ ఖేర్ మీద కూడా ఇలాంటి ప్రవర్తన గురించి ఫిర్యాదులు వచ్చాయి. గాయని సోనా మహాపాత్ర, గాయని వర్షా సింగ్ అతని వైఖరి అభ్యంతరకరం అని ప్రకటనలు చేశారు. హిందీ సినిమా సంగీతంలో గొప్ప గొప్ప సంగీతకారులు, గాయకులు ఉన్నారు. హిందీ సినిమా సంగీతం పట్ల కోట్లాదిమంది అభిమానులకు గౌరవం, ప్రేమా ఉన్నాయి. అలాంటిది ఆ రంగంలో ఇలాంటి స్వరముఖ వ్యాఘ్రాలు ఉండటం వాంఛనీయం కాదు.మీటూ చాలా వాటిని కరెక్ట్ చేస్తోంది. సినిమా రంగాన్ని తగిన స్వరంలో పెడుతుందని ఆశిద్దాం. -
ఇకపై కొనసాగరు!
బాలీవుడ్లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్‌పై ‘మీటూ’ ఉద్యమం ప్రభావం చూపింది. ఇండియన్ ఐడల్ 10 మ్యూజిక్ షోకు అను మాలిక్ ఇకపై జడ్జ్‌గా కొనసాగరని సంబంధిత సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్లు బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. సింగర్స్ సోనా మహాపాత్ర, శ్వేతా పండిట్లు అను మాలిక్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘‘ఇండియన్ ఐడల్ షోకు అను మాలిక్ చాలా కాలం నుంచి జడ్జ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఇండియన్ ఐడల్ 10 షోకు విశాల్ దద్లాని, నేçహా కక్కర్తో కలిసి కో–జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇకపై ఇండియన్ ఐడల్ 10 షో జడ్జ్ ప్యానెల్లో అను మాలిక్ కొనసాగరు. ముందుగా ప్లాన్ చేసిన విధంగా షో కొనసాగుతుంది. విశాల్, నేహాలతో పాటు ఇండియన్ మ్యూజిక్‌లో మంచి పేరు సంపాదించుకున్న ఒక వ్యక్తి ఈ షోకు కో–జడ్జ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు’’ అని ఇండియన్ ఐడల్ షో యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నారని బాలీవుడ్ టాక్. -
అను మాలిక్ ఇంట్లో సెలబ్రిటీల సందడి
-
నవంబర్ 2 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: షారూఖ్ ఖాన్ (నటుడు), అను మాలిక్ (సంగీత దర్శకుడు) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఎంతో చాకచక్యంగా విజయాలు సాధించి, కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. మధురంగా మాట్లాడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి వీరు పుట్టిన తేదీ 2. ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యం, ఊహాశక్తి పుట్టుకతోనే వస్తాయి. ఈ సంవత్సరం గురు చంద్రుల కలయిక వల్ల చేసే వృత్తిలో తెలివితేటలతోపాటు చొరవ చూపడం వల్ల ప్రమోషన్ రావడం లేదా ఉన్నతమైన ఉద్యోగావకాశం లభిస్తుంది. అనూహ్యంగా ఫారిన్ ఛాన్స్ వస్తుంది. విద్యార్థులు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు పొందుతారు. జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు, వేదపండితులు గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను పొందుతారు. లక్కీ నంబర్స్: 1,2,3; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండిల్; లక్కీ డేస్: ఆది, సోమ, గురువారాలు. సూచనలు: అనాథాశ్రమాలు/ దేవాలయాలు/ చర్చిలు/ మదరసాలకు బియ్యాన్ని విరాళంగా ఇవ్వడం, ఇంటికి వచ్చిన వారికి ప్రేమతో పాయసం తినిపించడం, పండితులను, మతగురువులను గౌరవించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్