ఆడిపాడే పదిహేడేళ్ల ప్రాయంలో ముంబై అమ్మాయి కాంచన్ డేనియల్‌పై క్యాన్సర్ అనే పిడుగు పడింది. ఎటుచూసినా చీకటి... మనసు నిండా నిరాశ! ఏవేవో ఆలోచనలు. మునపటిలా చురుగ్గా ఉండడానికి తనకు ఇష్టమైన మ్యూజిక్‌ను నమ్ముకుంది. మ్యూజిక్ మ్యాజిక్‌తో హుషారు తెచ్చుకోవడమే కాదు ఆ తరువాత క్యాన్సర్ నుంచి బయటపడింది. పందొమ్మిది సంవత్సరాల వయసులో వేదికపై జాన్ మేయర్ ‘గ్రావిటీ’ పాట పాడి ‘వాహ్’ అనిపించుకుంది.
ఒక అద్భుతాన్ని సృష్టించే ముందు ‘లెట్స్ సీ వాట్ ఐ కెన్ డూ’ అంటూ నినదించడం ఆమె మంత్రం. టీనేజ్‌లో క్యాన్సర్ బారిన పడిన వారికి ధైర్యం ఇవ్వడం కోసం కాంచన్ క్లినికల్ సైకాలజీ చదువుకుంది. ముంబై కేంద్రంగా మిత్రులతో కలిసి మొదలుపెట్టిన ‘బ్లూస్ రాక్’ మ్యూజిక్ బ్యాండ్ సూపర్ హిట్ అయింది. మ్యూజిక్, మెంటల్ హెల్త్‌లను కలిపి కొత్త టానిక్ తయారు చేసిన కాంచన్... మొన్నటి కరోనా పరిస్థితుల్లో డిప్రెషన్ బారిన పడిన ఎంతోమంది టీనేజర్లకు తన సంగీతంతో ధైర్యాన్ని ఇచ్చింది. కృంగుబాటు నుంచి బయటికి వచ్చేలా చేసింది. (చదవండి: పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది)
Comments
Please login to add a commentAdd a comment