హైదరాబాద్: రియాలిటీ షోల మోజుతో ఓ యువకుడు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నా తనకేమీ కాదంటూ స్నేహితుల ఎదుటే నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడి మరణించాడు. వివరాలు.. నగరంలోని పాతబస్తీకి చెందిన జాన్ మాల్ కు చెందిన జలాలుద్దీన్(22) ఈ నెల 7 వ తేదీన తన స్నేహితుల వద్ద రియాలిటీ షో చేస్తానని చెప్పాడు. వారి ఎదుటే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కొద్దిసేపు అలాగే ఉన్న యువకుడు తర్వాత మంటలు వ్యాపించడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులు అతడిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్సపొందుతూ జలాలుద్దీన్ సోమవారం మృతిచెందాడు.