Lock Upp Show Contestant Karanvir Bohra Reveals He Has Financial Crisis - Sakshi
Sakshi News home page

Karanvir Bohra: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాను.. 4 కేసులు కూడా ఉన్నాయి: లాకప్‌ కంటెస్టెంట్‌

Published Wed, Mar 16 2022 1:02 PM | Last Updated on Wed, Mar 16 2022 1:58 PM

Lock Up Contestant Karanvir Bohra Reveals He Has Financial Crisis - Sakshi

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌ కంగనా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాంట్రవర్సీ రియాలిటీ షో 'లాకప్‌'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షోలో కంటెస్టెంట్లు బయటపెడుతున్న రహస్యాలు విని ప్రేక్షకులు ఔరా..! అనుకుంటున్నారు. ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కడం కోసం, షోలో విజయం సాధించేందుకు ఇన్నాళ్లు దాచుకున్న సీక్రెట్స్‌ను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ఇటీవల ఓ ప్రముఖ వ్యాపార వేత్త తన భార్యతో నిద్రించాలని చెప్పి అందరినీ షాక్‌కు గురి చేశాడు. అలాగే క్రికెటర్‌ శివమ్‌ శర్మ తన తల్లి ఫ్రెండ్‌తో బెడ్‌ షేర్ చేసుకున్నట్లు చెప్పి కంటెస్టెంట్లు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశాడు. తాజాగా తన జీవితంలో తనకు ఎదురైన దుర్భరమైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు బాలీవుడ్‌ యాక్టర్‌ కరణ్‌వీర్‌ బోహ్రా. 

చదవండి: అతనే ఫస్ట్‌ ఎలిమినేషన్‌ కంటెస్టెంట్‌.. ఎందుకంటే ?

కరణ్‌వీర్‌ బోహ్రా తన జీవితంలోని చీకటి, లోతైనా, భావోద్వేగపు రహస్యాలను బహిర్గతం చేశాడు. ఏడేళ్లుగా తనకు పని లేకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొన్నాని తెలిపాడు. 'నేను నా జీవితంలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను. ఆ ఆప్పులు చెల్లించకపోవడంతో నాపై 3, 4 కేసులు కూడా నమోదయ్యాయి. 2015 నుంచి నేను చేసిన ప్రతీ పని కేవలం ఆ అప్పు తీర్చడానికే చేశాను. నేను నా కుటుంబానికి ఏమిచ్చాను? అని ఎప్పుడూ బాధపడుతుంటాను. ఈ బాధతో నేను ఆత్మహత్య కూడా చేసుకునే వాడిని. తీజయ్‌, అమ్మ, నాన్న, నా పిల్లలు లేకుంటే, నేను ఏం చేసేవాడినో నాకే తెలియదు. నాకు ఈ షో ఒక లైఫ్‌లైన్‌ లాంటింది.' అని తెలిపాడు కరణ్‌వీర్‌ బోహ్రా.

చదవండి: బడా వ్యాపారవేత్త ముందే తన భార్యతో నిద్రించాను: షాకింగ్‌ సీక్రెట్‌ బయటపెట్టిన కంటెస్టెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement