
సినిమా స్టార్స్ లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుంది? వాళ్లు చేసే విహార యాత్రలు, పార్టీలు, వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తోనే ‘ఫ్యాబులస్ లైఫ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ అనే రియాలిటీ షో తెరకెక్కింది. నెట్స్‌ఫ్లిక్స్‌లో ఈ షో అందుబాటులో ఉంది. బాలీవుడ్ స్టార్స్ భార్యల జీవితం ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్, చంకీ పాండే భార్య భావనా పాండే, సోహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్, హీరోయిన్ నీలమ్ (సమీర్ సోనీ భార్య) ఈ నలుగురూ కలసి చేసిన షో ఇది.
ఈ నలుగురూ 25 ఏళ్లుగా స్నేహితులు. వీళ్లు స్నేహితులుగా ఉండటంతో పాటు వీరి ఫ్యామిలీస్ కూడా ఎంత దగ్గరగా ఉన్నాయో తొలి భాగంలో చూపించారు. ఈ నలుగురి జీవితాల్లోని ముఖ్యమైన వ్యక్తులు, పార్టీలు, వెకేషన్స్, పిల్లలు, రోజువారి లైఫ్ తొలి సీజన్లో ఉంటాయి. 8 ఎపిసోడ్లుగా తొలి సీజన్ విడుదలైంది. ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. ఇందులో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కూడా కనిపించనున్నారు. ఇంటీరియర్ డిజైనర్‌గా, నిర్మాతగా గౌరీ ఖాన్ తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నారు. ఫార్చ్యూన్ మేగజీన్ విడుదల చేసిన ఫిఫ్టీ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్‌లో చోటు సంపాదించారు గౌరి. ‘ఫ్యాబులస్ లైఫ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్’ సీజన్ 2లో భాగం అవుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారామె.
Comments
Please login to add a commentAdd a comment