గాల్లో విహరించనున్న శిల్పాశెట్టి | Shilpa Shetty to do aerial act | Sakshi
Sakshi News home page

గాల్లో విహరించనున్న శిల్పాశెట్టి

Jan 29 2014 4:51 PM | Updated on Apr 3 2019 6:23 PM

గాల్లో విహరించనున్న శిల్పాశెట్టి - Sakshi

గాల్లో విహరించనున్న శిల్పాశెట్టి

బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి వినూత్నంగా నటించబోతోంది. ఓ రియాల్టీ షోలో శిల్పా గాల్లో నటిస్తూ అభిమానులను అలరించనుంది.

ముంబై: బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి వినూత్నంగా నటించబోతోంది. ఓ రియాల్టీ షోలో శిల్పా గాల్లో నటిస్తూ అభిమానులను అలరించనుంది. స్టార్ ప్లస్ చానెల్ లో ప్రసారమవుతున్న 'నచ్ బలియె 6' అనే షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ కోసం శిల్పా రిహార్సల్స్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో శనివారం ప్రసారంకానుంది.

గ్రాండ్ ఫైనల్ కోసం శిల్ప కఠోర సాధన చేస్తోందట. ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తోందని చానెల్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం తొలుత 11 జంటలతో ఆరంభమైంది. ఫైనల్లో నాలుగు జంటలు పోడీపడుతున్నాయి. వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న శిల్ప టీవీ షోలు, సినిమాలతో పాటు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ఇక భర్తతో కలసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో వాటాలున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement