తృప్తి దేశాయ్ కు ‘బిగ్ బాస్’ ఆఫర్ | Trupti Desai gets offer to participate in reality show Bigg Boss 10 | Sakshi
Sakshi News home page

తృప్తి దేశాయ్ కు ‘బిగ్ బాస్’ ఆఫర్

Published Mon, Sep 12 2016 2:10 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

తృప్తి దేశాయ్ కు ‘బిగ్ బాస్’ ఆఫర్

తృప్తి దేశాయ్ కు ‘బిగ్ బాస్’ ఆఫర్

ముంబై: ఆలయాల్లో మహిళల సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ కు ’బిగ్ బాస్’ ఆఫర్ వచ్చింది. వివాదస్పద సెలబ్రిటీ రియాలిటీ షో ‘బిగ్ బాగ్ 10’ లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని తృప్తి దేశాయ్ ధ్రువీకరించారు. అయితే ఒక షరతుపై ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమని ఆమె తెలిపారు. ఇందులో పోటీపడే వారందరూ మహిళలు ఉండాలని ఆమె షరతు పెట్టారు. తన షరతుకు అంగీకరిస్తే పాల్గొంటానని వెల్లడించారు.

అక్టోబర్ 16 నుంచి బిగ్ బాగ్ 10 కార్యక్రమం ప్రారంభమవుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి సామాన్యులకు ఇందులో ప్రవేశం కల్పిస్తారని అంటున్నారు. సుల్తాన్, వ్యోమగామి వేషంలో సల్మాన్ ఖాన్.. ప్రొమోస్ లో కనిపిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement