వార్న్‌కు పాముకాటు! | Shane Warne bitten by snake on reality show | Sakshi
Sakshi News home page

వార్న్‌కు పాముకాటు!

Published Fri, Feb 19 2016 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

వార్న్‌కు పాముకాటు!

వార్న్‌కు పాముకాటు!

 టీవీ షోలో ఘటన

మెల్‌బోర్న్:  టీవీ రియాల్టీ షోలో సాహసాలు చేయబోయిన దిగ్గజ క్రికెటర్ షేన్‌వార్న్ అనకొండ బారిన పడ్డాడు. ‘ఐయామ్ ఎ సెలబ్రిటీ...గెట్ మి అవుట్ హియర్’ అనే కార్యక్రమంలో పాల్గొంటున్న వార్న్‌ను అనకొండ తలపై కరిచింది. అయితే ఇది విషరహితమైన సర్పం కావడంతో పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు షోలో భాగంగా వివిధ రకాల కీటకాలతో కూడిన బాక్స్‌లలో తల ఉంచిన వార్న్...అనకొండ బాక్స్ దగ్గరికి రాగా, వాసనను గుర్తించిన పాము దాడి చేసింది. అప్పటికే వార్న్‌ను వ్యాఖ్యాత హెచ్చరించినా... ధైర్యంగా దగ్గరికి వెళ్లబోయిన క్రికెటర్‌పై ఒక్కసారిగా పాము దూసుకొచ్చింది. విషం లేకపోయినా దాని కాటు పడితే...అది ఒకేసారి వంద ఇంజెక్షన్‌లతో గుచ్చినంత నొప్పి కలిగిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement