కూలీగా విద్యాబాలన్! | Vidya Balan in Reality Show | Sakshi
Sakshi News home page

కూలీగా విద్యాబాలన్!

Published Mon, Oct 26 2015 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

కూలీగా విద్యాబాలన్!

కూలీగా విద్యాబాలన్!

ఆ రోజు జైపూర్ బస్టాండ్‌లో ఉన్న ప్రయాణీకులు, కూలీలు ఒక్కసారిగా షాకయ్యారు. తమను తాము గిచ్చి చూసుకున్నారు. దానికి కారణం లేకపోలేదు. హఠాత్తుగా విద్యాబాలన్ అక్కడ కూలీ డ్రెస్సులో ఎంటరయ్యారు. కాసేపు నిలబడి ఓ కుర్రాడి చేతిలోంచి సూట్‌కేస్ తీసుకుని నెత్తి మీద పెట్టుకుని, ఒక బస్సులో పెట్టారు. అందుకుగాను ఆ కుర్రాడి అమ్మ నుంచి వంద రూపాయలు అడిగి తీసుకున్నారు. ఇంకా మరికొంతమంది ప్రయాణీకుల లగేజీలను కూడా విద్యా మోసారు.
 
 ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలియక ప్రయాణీకులు తికమకపడ్డారు. విద్యా మాత్రం శ్రద్ధగా తన పని తాను చేసుకుపోయారు. ఓ రియాల్టీ షో కోసమే విద్యాబాలన్ ఇలా కూలీ అవతారమెత్తారు. త్వరలో ఈ షో ప్రసారం కానుంది. అసలు విషయం ఆ తర్వాత తెలుసుకుని ప్రయాణీకులు నవ్వుకున్నారట. అలాగే, విద్యాబాలన్ నటనను అభినందించారట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement