
రియాలిటీ షో కోసం హీరో సాహసం!
బాలీవుడ్ యువ కెరటం అర్జున్ కపూర్ ఓ రియాలిటీ షో కోసం ఒళ్లుగగుర్పొడిచే సాహసం చేశాడు. సాహసకృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఓ రియాలిటీ షోకి అర్జున్ మొదటిసారి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. దీనిలో భాగంగా మొదటి ఎపిసోడ్లోనే అర్జున్ సాహసానికి దిగాడు. ప్రమాదకరమైన తేనెటీగలు ఉన్న పెట్టెలో తలపెట్టి అందులో ఉన్న పండ్లను తిన్నాడు.
ముఖం నిండా స్వీట్ క్రీమ్ రాసుకుని భయంకరమైన రకరకాల ఈగలు ఉన్న పెట్టెలో తల పెట్టి అందులో ఉన్న స్ట్రాబెర్రీలు మొత్తం తినాలి. ఈ సాహసా కృత్యానికి అర్జున్ తనంతటతానుగా పూనుకున్నాడు. ఈగలన్నీ తన ముఖం మీద వాలి క్రీమ్ రుచి చూస్తుండగా ఏ మాత్రం తొణకకుండా పెట్టెలోని స్ట్రాబెర్రీలన్నీ తినేశాడు. కాస్త తేడా వచ్చినా పరిస్థితి ప్రమాదకరంగా ఉండేది. ఇటువంటి సాహసం చేసిన మొట్టమొదటి హోస్ట్ అర్జునే అంటూ సదరు రియాలిటీ షో యూనిట్ పొగడ్తలతో ముంచెత్తింది.
దీనిపై అర్జున్ మాట్లాడుతూ.. 'మాటలకన్నా చేతలు గట్టిగా పనిచేస్తాయి. షోలో పాల్గొనే అభ్యర్థులకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఇలా చేశాను. అయినా నాకెలాంటి ఫోబియాలు లేవు, అందువల్లే ప్రమాదకారి ఈగలన్నీ నాపై వాలినా నేను భయపడలేదు, ఏదేమైనా ఈ అనుభవం సరికొత్తగా ఉంది.. చాలా ఎంజాయ్ చేశాను' అంటూ చెప్పుకొచ్చాడు.