
బుల్లితెరపై మరోసారి సందడి చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. ఆయన హోస్ట్‌గా చేయబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాల్టీ షో ప్రోమో శనివారం విడుదల అయింది. ఈ రియాల్టీ షో జెమిని టీవీలో ప్రసారం కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్‌లో కనిపించడం విశేషం. అయితే ఈ షో ఎప్పుడు మొదలు కానుంది, కంటెస్టెంట్స్ ఎవరనేది మాత్రం ప్రకటించకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. బుల్లితెరపై ఎన్టీఆర్ రెండో సారి సందడి చేయబోతున్నాడు. బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు.ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో మంచి సక్సెస్ అయింది. ఇక నాగార్జున, చిరంజీవి హోస్ట్‌లుగా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాల్టీ షో ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మొదటి మూడు సీజన్లకి కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించగా, 2017లో వచ్చిన నాలుగో సీజన్‌కి మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా చేశాడు. ఇప్పుడు అదే షోని కొన్ని మార్పులతో ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమిని టీవీలో ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment