విజయ్ సేతుపతి
కోలీవుడ్‌లో వెండితెరపై నటుడిగా సూపర్‌సక్సెస్ సాధించారు విజయ్ సేతుపతి. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన హోస్ట్‌గా ఓ ప్రముఖ చానల్‌లో ఓ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి అధికారికంగా వెల్లడించారు. ఈ షో త్వరలో మొదలుకానుంది. ఆల్రెడీ కమల్‌హాసన్ బిగ్‌బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. రీసెంట్‌గా శ్రుతీ హాసన్, విశాల్, వరలక్ష్మి బుల్లితెర కమిట్‌మెంట్‌కు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సేతుపతి వంతు వచ్చినట్లు ఉంది. ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే... రజనీకాంత్ నటించిన ‘పేట్టా’ చిత్రంలో జీతూ అనే కీలక పాత్ర చేశారు. తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హీరోగానూ కొన్ని తమిళ సినిమాలు చేస్తున్నారాయన. ఇటీవల విజయ్‌సేతుపతి, త్రిష జంటగా వచ్చిన ‘96’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment