Aha OTT Nenu Super Woman Reality Show - Sakshi
Sakshi News home page

Nenu Super Woman Show: 'ఆహా'లో సరికొత్త బిజినెస్ రియాలిటీ షో

Published Tue, Jun 27 2023 6:52 PM | Last Updated on Tue, Jun 27 2023 8:06 PM

Aha Ott Nenu Super Woman Reality Show - Sakshi

ఓటీటీల్లో ఆహా ఇప్పటికే దూసుకెళ్తోంది. అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు స్త్రీ సాధికార‌త‌కు పెద్దపీట వేస్తూ మ‌హిళ‌ల‌ను వ్యాపార రంగంలోనూ దూసుకెళ్లేలా చేయ‌టానికి బిజినెస్ రియాలిటీ షోని ప్రారంభించింది. అదే 'నేను సూప‌ర్ ఉమెన్‌'. కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించేలా మహిళలని ప్రేరేపించడమే ఈ షో ప్ర‌ధాన లక్ష్యం. దీని కార‌ణంగా పారిశ్రామిక రంగంలో మ‌హిళ‌ల ప్రాధాన్య‌త పెర‌గ‌డంతో పాటు వారిలో ఆర్థిక స్వాతంత్య్ర భావన పెంపొందుతుంది. 

(ఇదీ చదవండి: జెట్ స్పీడ్‌లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?)

'నేను సూపర్ ఉమెన్' ప్రోగ్రామ్ వినూత్న మార్గాలను చూపిస్తూ, మహిళలకు మార్గదర్శకం చేస్తూ వారికి ప్రత్యక్ష అనుభ‌వం ఏర్ప‌డేలా ఉపయోగపడుతుంది. 'తెలుగు ఇండియన్ ఐడల్'కి హోస్ట్ గా చేసి ఆకట్టుకున్న శ్రీరామ్ చంద్ర.. ఈ షోకి కూడా హోస్టింగ్ చేయబోతున్నాడు. ఈ కార్యక్రమంలో ఏంజెల్స్ అనే ప్యానెల్‌ ఉంటుంది. ఇందులో పాల్గొనే ఔత్సాహిక మ‌హిళా వ్యాపారులు వారి ఆలోచ‌న‌ల‌ను ఈ ఏంజెల్స్ తో పంచుకోవచ్చు. 40 మంది అసాధార‌ణ అభ్య‌ర్థులు ఈ 'సూపర్ ఉమెన్'కు ఎంపిక‌య్యారు. వీరంద‌రూ ఏంజెల్స్ ప్యానెల్ సమ‌క్షంలో త‌మ ఆలోచ‌న‌ల‌ను ముఖాముఖిగా బయటపెడతారు. ప్ర‌తి ఆలోచ‌న చాలా జాగ్ర‌త్త‌గా మూల్యాంక‌నం చేయ‌బ‌డుతుంది. తుది ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత ప్యానెల్ ఆఫ‌ర్స్‌ను పొడిగిస్తుంది. 

ఏంజెల్స్ ప‍్యానెల్ లో రోహిత్ చెన్న‌మ‌నేని (డార్విన్ బాక్స్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు), శ్రీధ‌ర్ గాది (క్వాంటెలా ఇన్క్ యొక్క వ్య‌వ‌స్థాప‌కుడు మ‌రియు ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌), రేణుకా బొడ్లా (సిల్వ‌ర్ నీడెల్ వెంచ‌ర్స్ భాగ‌స్వామి), సుధాక‌ర్ రెడ్డి (అభి బ‌స్ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఇఓ), దొడ్ల దీపా రెడ్డి (దొడ్ల డెయిరీ), సింధూర పొంగూరు (నారాయ‌ణ గ్రూప్‌) ఉన్నారు. వీళ్లంతా మ‌హిళ‌ల‌ను పారిశ్రామికవేత్త‌లుగా ప్రోత్స‌హించ‌టానికి సిద్ధంగా ఉన్నారు.

(ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement