Shubman Gill, Ishan Kishan, Yuzvendra Chahal recreate scene from reality show 'Roadies' - Sakshi
Sakshi News home page

Shubman Gill-Ishan Kishan: గిల్‌పై ఇషాన్‌ కిషన్‌ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్‌

Published Fri, Feb 3 2023 10:36 AM | Last Updated on Fri, Feb 3 2023 11:46 AM

Shubman Gill-Ishan Kishan Recreate Scene Reality Show Roadies Funny - Sakshi

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లను చేజెక్కించుకున్న టీమిండియా ఫుల్‌ జోష్‌లో ఉంది. ముఖ్యంగా ఈ సిరీస్‌ శుబ్‌మన్‌ గిల్‌కు బాగా ఉపయోగపడింది. కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అతను మంచి ఫామ్‌ కనబరుస్తుండడం.. వరుస సెంచరీలతో జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఇక కివీస్‌తో జరిగిన చివరి టి20మ్యాచ్‌లో గిల్‌ సుడిగాలి శతకంతో టి20 ప్లేయర్‌గా పనికిరాడన్న అపవాదును తొలగించుకున్నాడు. అయితే ఇషాన్‌ కిషన్‌ మాత్రం తన పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. 

సిరీస్‌ ముగిసిన అనంతరం శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, యజ్వేంద్ర చహల్‌లు కలిసి చేసిన ఫన్నీ వీడియో ప్రస్తుతం నవ్వులు పూయిస్తుంది. పాపులర్‌ యూత్‌ షో ఎంటీవీ రోడీస్‌లో ఆడిషన్‌ ఎపిసోడ్‌ను ఈ ముగ్గరు రీక్రియేట్‌ చేశారు. చహల్‌ దర్శకత్వం చేయగా.. గిల్‌, ఇషాన్‌లు తమ యాక్షన్‌ను షురూ చేశారు.

వీడియోలో ఇషాన్‌ కిషన్‌ గొరిల్లా లాగా జంప్‌ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. ఆడిషన్‌లో భాగంగా సరైన ప్రదర్శన ఇవ్వని గిల్‌ను ఇషాన్‌ కిషన్‌ తిట్టడం.. ఆపై చెంపలు వాయించుకోమనడం లాంటివి సరదాగా అనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోనూ గిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. వీడియోను బాగా ఎంజాయ్‌ చేసిన నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్స్‌ చేశారు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌ అనంతరం టీమిండియా టెస్టు క్రికెట్‌కు సిద్ధమవుతోంది.ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇప్పటికే టీమిండియా నాగ్‌పూర్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 9న ఇరుజట్ల మధ్య తొలిటెస్టు ప్రారంభం కానుంది.  ఈ టెస్టు సిరీస్‌ టీమిండియాకు చాలా కీలకం. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది.

ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్‌ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్‌ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది.

చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. నాగ్‌పూర్‌ చేరుకున్న టీమిండియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement