
చిన్న ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారా? అంటే ఫిల్మ్‌నగర్ వర్గాలు అవుననే అంటున్నాయి. ‘బిగ్ బాస్’ షోలో హోస్ట్‌గా తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చిన్న ఎన్టీఆర్. ఇప్పుడు ఓ రియాలిటీ షో చేయనున్నారని సమాచారం. ఈ షో కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్స్ వేస్తున్నారని తెలిసింది. నిజానికి భవిష్యత్తులో ‘బిగ్ బాస్’ రాబోయే సీజన్‌లో మళ్లీ చిన్న ఎన్టీఆర్ కనబడే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్న తరుణంలో ఈ షో వార్త తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఈ షూటింగ్‌లో పాల్గొంటూనే టీవీ షో చిత్రీకరణలో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారట. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ఈ షో ఉంటుందని టాక్.