
సాక్షి, విజయనగరం: టీడీపీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం ముగింపు సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. యువగళాన్ని ప్రజలు పట్టించుకోకపోగా.. సభకు వెళ్లిన అరకొర మంది కూడా లోకేష్ స్పీచ్ విని భయంతో పరుగులు తీసినంత పనిచేశారు. దీంతో, ఎల్లో బ్యాచ్ తల పట్టుకునే పరిస్థితి ఎదురైంది.
అయితే, నారా లోకేష్ యువగళం ముగింపు టీడీపీని నిరాశకు గురిచేసింది. ముగింపు సభ అంచనాలను అందుకోలేదు. లోకేష్ సభకు ఆరు లక్షల మంది వస్తారని టీడీపీ నేతలు ఊదరగొట్టారు. కాగా, ఉత్తరాంధ్ర నేతలు, ప్రజలు ముఖం చాటేయడంతో ఎల్లో బ్యాచ్ అంచనాలు తప్పాయి. సభకు అనుకున్న సంఖ్యలో జనం రాకపోవడంతో ఎల్లో టీమ్ ఖంగుతుంది.
సరే అనుకుని వచ్చిన జనాలతో అయినా సభను నడిపిద్దామనుకుంటే నారా లోకేష్ మాట్లాడుతుండగా ఆయన స్పీచ్ భరించలేక బారికేడ్డు సైతం దూకి అక్కడి నుంచి పారిపోయారు. ఇక, నందమూరి బాలకృష్ణ మాట్లాడుతుండగా.. ఆపేయండి అంటూ మధ్యలోనే జనం కేకలు వేశారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీచ్‌ను కూడా ప్రజలు పట్టించుకోలేదు. స్పీచ్ మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు స్పీచ్ వచ్చే సమయానికే సభలో మూడు వంతులకు పైగా ప్రాంగణం ఖాళీ అయిపోయింది. దీంతో, టీడీపీ నేతలు బిత్తర చూపులు చూడాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment