
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించిన చిత్రం ‘రాధా మాధవం’. గోనాల్ వెంకటేశ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘రాధా మాధవం’ ట్రైలర్ చూస్తే అందమైన ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది.. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘అందమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రం ‘రాధా మాధవం’.
మా సినిమా సెన్సార్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు దాసరి ఇస్సాకు. ‘‘ఈ నెలలోనే మా సినిమా రిలీజ్ అవుతుంది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గోనాల్ వెంకటేశ్. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో సహజత్వం ఉట్టి పడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దాసరి ఇస్సాకు. మా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన శ్రీకాంత్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు వినాయక్ దేశాయ్.
Comments
Please login to add a commentAdd a comment