Radha Madhavam Movie
-
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
పరువు హత్యల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చి మెప్పించాయి. విలేజ్ లవ్ స్టోరీలు ఈ మధ్య ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాంటి కంటెంట్‌తోనే వచ్చిన మరో సినిమానే 'రాధామాధవం'. ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా నటించగా గోనాల్ వెంకటేష్ నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజైంది.అయితే బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దాసరి ఇసాక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడా అశ్లీలత లేకుండా పల్లెటూరు నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు. పరువు హత్యలు, పట్టింపులు, ప్రేమలు, ఆప్యాయత లాంటి ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. -
ఓటీటీలో ఫీల్ గుడ్ తెలుగు సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే?
పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో గతంలోనే పలు సినిమాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అలాంటి స్టోరీతో తీసిన చిత్రమే 'రాధా మాధవం'. అలా ఈ ఏడాది మార్చిలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. కొన్నాళ్ల క్రితం ఓటీటీలోకి వచ్చేసింది. కుటుంబ ప్రేక్షకుల్ని అలరిస్తూ మంచి వ్యూస్ సొంతం చేసుకుంటోంది.(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు)దాసరి ఇస్సాక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రామీణ నేపథ్యంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నూతన నటీనటులతో రూపొందించిన ఈ సినిమాలో అశ్లీలత ఏం లేదు కాబట్టి కుటుంబమంతా కలిసి చూడొచ్చు. పరువు హత్యలు, పట్టింపులు, ప్రేమలు, ఆప్యాయతలు, పల్లెటూరు వాతావరణం లాంటి అంశాలని పీరియాడిక్ స్టైల్లో తీశారు. వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా నటించారు.'రాధా మాధవం' కథ విషయానికొస్తే.. రాధ (అపర్ణా దేవి) మాధవ పేరుతో కేర్ సెంటర్ నడుపుతూ అనాథ పిల్లలు, వృద్ధులకు సేవ చేస్తుంటుంది. జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం (మేక రామకృష్ణ) ఇందులో చేరతాడు. తన కూతురు రాధనే ఇది నడుపుతోందని తెలుసుకుంటాడు. అసలు వీరభద్రం జైలుకి ఎందుకు వెళ్లాడు? రాధ ప్రేమించిన మాధవ్ (వినాయక్ దేశాయ్) ఏమయ్యాడు? మాధవ్ ప్రేమ కోసం రాధ ఏం చేసిందనేదే మెయిన్ పాయింట్.(ఇదీ చదవండి: వాష్ రూమ్ కోసం అమితాబ్ పర్మిషన్.. అసలు విషయం ఇది) -
మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసింది. అప్పుడెప్పుడో మార్చిలో రిలీజైన ఈ చిత్రం.. ఇన్నాళ్ల తర్వాత ఎలాండి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతోంది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎప్పుడు థియేటర్లలోకి వచ్చి వెళ్లిందో తెలిసి రాలేదు. పరువు హత్యల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రమేంటి? ఏ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'రాధా మాధవం'. ఈ ఏడాది మార్చి 1న థియేటర్లలోకి వచ్చింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో కులాంతర వివాహాలు-పరువు హత్యలకు సంబంధించిన స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. అప్పట్లో డీసెంట్ టాక్ తెచ్చుకుంది కానీ హిట్ కాలేకపోయింది.'రాధా మాధవం' విషయానికొస్తే.. రాధ (అపర్ణా దేవి) మాధవ పేరు కేర్ సెంటర్ నడుపుతూ ఉంటుంది. అనాథలైన పిల్లలు, వృద్ధులకు సేవ చేస్తుంటుంది. జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం (మేక రామకృష్ణ) ఇందులో చేరతాడు. తన కూతురు రాధనే ఇది నడుపుతోందని తెలుసుకుంటాడు. అసలు వీరభద్రం జైలుకి ఎందుకు వెళ్లాడు? రాధ ప్రేమించిన మాధవ్ (వినాయక్ దేశాయ్) ఏమయ్యాడు? మాధవ్ ప్రేమ కోసం రాధ ఏం చేసింది అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా) -
'రాధా మాధవం' సినిమా రివ్యూ
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అలా తాజాగా థియేటర్లలో రిలీజైన మూవీ 'రాధా మాధవం'. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. గోనాల్ వెంకటేష్ నిర్మాత. దాసరి ఇస్సాకు దర్శకుడు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో కావాలనే నన్నుఇరికించారు: డైరెక్టర్ క్రిష్) కథేంటి? రాధ (అపర్ణా దేవీ).. మాధవ (వినాయక్ దేశాయ్) పేరు మీద మాధవ కేర్ సెంటర్ పెట్టి, ఈ సంస్థ ద్వారా తాగుడుకి బానిసైన వాళ్లని, అనాథ పిల్లల్ని, వృద్దుల్ని అందరినీ చేరదీస్తుంది. ఈ క్రమంలోనే జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం (మేక రామకృష్ణ) కూడా అక్కడికి దిక్కుదోచని స్థితిలో వచ్చి పడతాడు. చివరకు తన కూతురి దగ్గరకే చేరుకున్నానని తెలుసుకుంటాడు. అసలు వీరభద్రం జైలుకు ఎందుకు వెళ్లాడు? ఈ తండ్రీ కూతుళ్ల మధ్య దూరం ఎందుకొచ్చింది? రాధ అసలు మాధవ పేరుతో కేర్ సెంటర్ ఎందుకు నడుపుతోంది? అనేది మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? ప్రేమకు కులాల అడ్డు ఆ తర్వాత పరువు హత్య అనే పాయింట్‌తో పలు సినిమాలు వచ్చాయి. ఇలాంటి స్టోరీకి పీరియడిక్ బ్యాక్‌డ్రాప్ జోడించి తీసిన సినిమా 'రాధా మాధవం'. చిన్నపిల్లల ఎపిసోడ్, మాధవ కేర్ సెంటర్, అక్కడి ఫన్నీ సీన్లతో ఫస్టాప్ అంతా సరదా సరదాగా సాగుతుంది. ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ప్రేమకథ పర్వాలేదనిపిస్తుంది. అలా ఇంటర్వెల్ పడుతుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) సెకండాఫ్ అంతా కూడా ఎమోషనల్ సీన్లు ఉంటాయి. ప్రేమ జంట, పగతో రగిలిపోయే పెద్ద మనుషులు సీన్లు బాగానే రాసుకున్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్‌గా తీశారు. కులాలపై వేసిన డైలాగ్స్, రాసిన సీన్స్ బాగున్నాయి. పాటలు ఉన్నంతలో పర్వాలేదు. విజువల్స్ ఓకే. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ఎవరెలా చేశారు? మాధవ పాత్రలో వినాయక్ దేశాయ్ చక్కగా నటించాడు. గ్రామీణ యువకుడిగా ఉన్నంతలో బాగానే చేశాడు. యాక్షన్, డ్యాన్సుల్లో పర్వాలేదనిపించాడు. రాధగా అపర్ణా దేవీ చక్కగా కుదిరింది. మేక రామకృష్ణ కూడా నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు ఫరిది మేరకు నటించారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా) -
రాధా మాధవం సినిమా విడుదల తేదీ ప్రకటన
-
మా సినిమాని పెద్ద హిట్ చేయాలి.. 'రాధా మాధవం' మూవీ టీమ్
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'రాధా మాధవం'. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. అందమైన ఈ ప్రేమ కథా చిత్రానికి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా.. కథ, మాటలు, పాటలని అందించారు. ఇప్పటికే సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ సినిమాపై పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు విషయాలు పంచుకుంది. మార్చి 1న ఓ అందమైన ప్రేమ కథా సినిమా చిత్రంగా 'రాధా మాధవం'.. ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మా సినిమాని ఆడియెన్స్ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని నిర్మాత గోనాల్ వెంకటేశ్ చెప్పారు. అలానే హీరోహీరోయిన్ తో పాటు దర్శకుడు కూడా సినిమాని హిట్ చేయాలంటూ ప్రేక్షకుల్ని కోరారు. -
ప్రేమకు అర్థం చెప్పేలా...
గ్రామీణ ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘రాధా మాధవం’. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా నటించిన ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. గోనాల్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ప్రేమకు అర్థం చెప్పేలా మా ‘రాధా మాధవం’ సినిమా ఉంటుంది. ఈ చిత్రం సందేశాత్మకంగా కూడా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
'రాధా మాధవం' సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
గ్రామీణ ప్రేమ కథతో తీసిన సినిమా 'రాధా మాధవం'. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలని అందించారు. (ఇదీ చదవండి: కాంగ్రెస్ పార్టీలోకి హీరో అల్లు అర్జున్ మామ.. త్వరలో ఎంపీగా పోటీ?) 'రాధా మాధవం' పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా గత కొన్నిరోజుల క్రితం రిలీజ్ కాగా.. మంచి స్పందన దక్కించుకున్నాయి. తాజాగా సెన్సార్ పూర్తి కాగా.. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. చక్కని సందేశాత్మక చిత్రమని ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే మార్చి 1న సినిమా థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: తెలివిగా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'దేవర') -
పల్లెటూరి ప్రేమకథ
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించిన చిత్రం ‘రాధా మాధవం’. గోనాల్ వెంకటేశ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘రాధా మాధవం’ ట్రైలర్ చూస్తే అందమైన ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది.. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘అందమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రం ‘రాధా మాధవం’. మా సినిమా సెన్సార్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు దాసరి ఇస్సాకు. ‘‘ఈ నెలలోనే మా సినిమా రిలీజ్ అవుతుంది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గోనాల్ వెంకటేశ్. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో సహజత్వం ఉట్టి పడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దాసరి ఇస్సాకు. మా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన శ్రీకాంత్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు వినాయక్ దేశాయ్. -
నేల మీద నేను ఉన్నా...
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా రూపొందిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనాల్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ‘నేల మీద నేను ఉన్నా..’ అంటూ సాగే ఫాస్ట్ మాస్ బీట్ సాంగ్‌ను బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ విడుదల చేశారు. కొల్లి చైతన్య స్వరపరచిన ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా వీఎం మహాలింగం, ఎంఎం మానసి ఆలపించారు. -
Radha Madhavam:నేల మీద నేను ఉన్నా.. నింగిలోన తేలుతున్నా
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే ఫాస్ట్ మాస్ బీట్‌ను బిగ్ బాస్ సోహెల్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. 'నేల మీద నేను ఉన్నా' అంటూ సాగే ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా.. వీఎం మహాలింగం, ఎంఎం మానసి ఆలపించారు. కొల్లి చైతన్య ఇచ్చిన బాణీ బాగుంది. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ నెలలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.