వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'రాధా మాధవం'. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. అందమైన ఈ ప్రేమ కథా చిత్రానికి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా.. కథ, మాటలు, పాటలని అందించారు. ఇప్పటికే సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ సినిమాపై పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు విషయాలు పంచుకుంది.
మార్చి 1న ఓ అందమైన ప్రేమ కథా సినిమా చిత్రంగా 'రాధా మాధవం'.. ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మా సినిమాని ఆడియెన్స్ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని నిర్మాత గోనాల్ వెంకటేశ్ చెప్పారు. అలానే హీరోహీరోయిన్ తో పాటు దర్శకుడు కూడా సినిమాని హిట్ చేయాలంటూ ప్రేక్షకుల్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment