పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో గతంలోనే పలు సినిమాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అలాంటి స్టోరీతో తీసిన చిత్రమే 'రాధా మాధవం'. అలా ఈ ఏడాది మార్చిలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. కొన్నాళ్ల క్రితం ఓటీటీలోకి వచ్చేసింది. కుటుంబ ప్రేక్షకుల్ని అలరిస్తూ మంచి వ్యూస్ సొంతం చేసుకుంటోంది.
(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు)
దాసరి ఇస్సాక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రామీణ నేపథ్యంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నూతన నటీనటులతో రూపొందించిన ఈ సినిమాలో అశ్లీలత ఏం లేదు కాబట్టి కుటుంబమంతా కలిసి చూడొచ్చు. పరువు హత్యలు, పట్టింపులు, ప్రేమలు, ఆప్యాయతలు, పల్లెటూరు వాతావరణం లాంటి అంశాలని పీరియాడిక్ స్టైల్‌లో తీశారు. వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా నటించారు.
'రాధా మాధవం' కథ విషయానికొస్తే.. రాధ (అపర్ణా దేవి) మాధవ పేరుతో కేర్ సెంటర్ నడుపుతూ అనాథ పిల్లలు, వృద్ధులకు సేవ చేస్తుంటుంది. జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం (మేక రామకృష్ణ) ఇందులో చేరతాడు. తన కూతురు రాధనే ఇది నడుపుతోందని తెలుసుకుంటాడు. అసలు వీరభద్రం జైలుకి ఎందుకు వెళ్లాడు? రాధ ప్రేమించిన మాధవ్ (వినాయక్ దేశాయ్) ఏమయ్యాడు? మాధవ్ ప్రేమ కోసం రాధ ఏం చేసిందనేదే మెయిన్ పాయింట్.
(ఇదీ చదవండి: వాష్ రూమ్ కోసం అమితాబ్ పర్మిషన్.. అసలు విషయం ఇది)
Comments
Please login to add a commentAdd a comment