ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Tollywood Movie Getting Huge Response In OTT | Sakshi
Sakshi News home page

Radha Madhavam Movie: ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Thu, Jul 25 2024 3:20 PM | Last Updated on Thu, Jul 25 2024 3:27 PM

Tollywood Movie Getting Huge Response In OTT

పరువు హత్యల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చి మెప్పించాయి. విలేజ్ లవ్ స్టోరీలు ఈ మధ్య ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాంటి కంటెంట్‌తోనే వచ్చిన మరో సినిమానే 'రాధామాధవం'. ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా నటించగా గోనాల్ వెంకటేష్ నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజైంది.

అయితే బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దాసరి ఇసాక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడా అశ్లీలత లేకుండా పల్లెటూరు నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు. పరువు హత్యలు, పట్టింపులు, ప్రేమలు, ఆప్యాయత లాంటి ఎమోషనల్‌ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement