మరో తెలుగు సినిమా ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసింది. అప్పుడెప్పుడో మార్చిలో రిలీజైన ఈ చిత్రం.. ఇన్నాళ్ల తర్వాత ఎలాండి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతోంది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎప్పుడు థియేటర్లలోకి వచ్చి వెళ్లిందో తెలిసి రాలేదు. పరువు హత్యల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రమేంటి? ఏ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది? అనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'రాధా మాధవం'. ఈ ఏడాది మార్చి 1న థియేటర్లలోకి వచ్చింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో కులాంతర వివాహాలు-పరువు హత్యలకు సంబంధించిన స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. అప్పట్లో డీసెంట్ టాక్ తెచ్చుకుంది కానీ హిట్ కాలేకపోయింది.
'రాధా మాధవం' విషయానికొస్తే.. రాధ (అపర్ణా దేవి) మాధవ పేరు కేర్ సెంటర్ నడుపుతూ ఉంటుంది. అనాథలైన పిల్లలు, వృద్ధులకు సేవ చేస్తుంటుంది. జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం (మేక రామకృష్ణ) ఇందులో చేరతాడు. తన కూతురు రాధనే ఇది నడుపుతోందని తెలుసుకుంటాడు. అసలు వీరభద్రం జైలుకి ఎందుకు వెళ్లాడు? రాధ ప్రేమించిన మాధవ్ (వినాయక్ దేశాయ్) ఏమయ్యాడు? మాధవ్ ప్రేమ కోసం రాధ ఏం చేసింది అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment