విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అలా తాజాగా థియేటర్లలో రిలీజైన మూవీ 'రాధా మాధవం'. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. గోనాల్ వెంకటేష్ నిర్మాత. దాసరి ఇస్సాకు దర్శకుడు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో కావాలనే నన్నుఇరికించారు: డైరెక్టర్ క్రిష్)
కథేంటి?
రాధ (అపర్ణా దేవీ).. మాధవ (వినాయక్ దేశాయ్) పేరు మీద మాధవ కేర్ సెంటర్ పెట్టి, ఈ సంస్థ ద్వారా తాగుడుకి బానిసైన వాళ్లని, అనాథ పిల్లల్ని, వృద్దుల్ని అందరినీ చేరదీస్తుంది. ఈ క్రమంలోనే జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం (మేక రామకృష్ణ) కూడా అక్కడికి దిక్కుదోచని స్థితిలో వచ్చి పడతాడు. చివరకు తన కూతురి దగ్గరకే చేరుకున్నానని తెలుసుకుంటాడు. అసలు వీరభద్రం జైలుకు ఎందుకు వెళ్లాడు? ఈ తండ్రీ కూతుళ్ల మధ్య దూరం ఎందుకొచ్చింది? రాధ అసలు మాధవ పేరుతో కేర్ సెంటర్ ఎందుకు నడుపుతోంది? అనేది మెయిన్ స్టోరీ.
ఎలా ఉందంటే?
ప్రేమకు కులాల అడ్డు ఆ తర్వాత పరువు హత్య అనే పాయింట్‌తో పలు సినిమాలు వచ్చాయి. ఇలాంటి స్టోరీకి పీరియడిక్ బ్యాక్‌డ్రాప్ జోడించి తీసిన సినిమా 'రాధా మాధవం'. చిన్నపిల్లల ఎపిసోడ్, మాధవ కేర్ సెంటర్, అక్కడి ఫన్నీ సీన్లతో ఫస్టాప్ అంతా సరదా సరదాగా సాగుతుంది. ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ప్రేమకథ పర్వాలేదనిపిస్తుంది. అలా ఇంటర్వెల్ పడుతుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
సెకండాఫ్ అంతా కూడా ఎమోషనల్ సీన్లు ఉంటాయి. ప్రేమ జంట, పగతో రగిలిపోయే పెద్ద మనుషులు సీన్లు బాగానే రాసుకున్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్‌గా తీశారు. కులాలపై వేసిన డైలాగ్స్, రాసిన సీన్స్ బాగున్నాయి. పాటలు ఉన్నంతలో పర్వాలేదు. విజువల్స్ ఓకే. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.
ఎవరెలా చేశారు?
మాధవ పాత్రలో వినాయక్ దేశాయ్ చక్కగా నటించాడు. గ్రామీణ యువకుడిగా ఉన్నంతలో బాగానే చేశాడు. యాక్షన్, డ్యాన్సుల్లో పర్వాలేదనిపించాడు. రాధగా అపర్ణా దేవీ చక్కగా కుదిరింది. మేక రామకృష్ణ కూడా నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు ఫరిది మేరకు నటించారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా)
Comments
Please login to add a commentAdd a comment