వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు.
ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే ఫాస్ట్ మాస్ బీట్‌ను బిగ్ బాస్ సోహెల్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. 'నేల మీద నేను ఉన్నా' అంటూ సాగే ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా.. వీఎం మహాలింగం, ఎంఎం మానసి ఆలపించారు. కొల్లి చైతన్య ఇచ్చిన బాణీ బాగుంది. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ నెలలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment