
విరాన్, బన్నీ వాసు, లావణ్య
హీరో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. ఇందులో లావణ్య హీరోయిన్. సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజశేఖర్, సాయికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘ఏ పరిశ్రమలోనైనా ఓర్పు, కష్టం.. ఈ రెండింటినీ నమ్ముకున్న వారు ఫెయిల్ కాలేదు.
హీరో కావాలన్న విరాన్ కల ఈ సినిమాతో నిజం అవుతోంది. అల్లు అర్జున్‌గారితో పాటుగా కథలు వినేవాడు విరాన్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యాక, సక్సెస్ మీట్‌కు తాను వస్తానన్నట్లుగా అల్లు అర్జున్ నాకు చెప్పారు. ‘ముఖ్య గమనిక’ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఓర్పుగా ఉంటే ఏదో రోజు సక్సెస్ అవుతాం అనడానికి బన్నీ వాసు అన్న ఓ ఉదాహరణ. హీరోగా నాకు చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విరాన్. ‘‘ఈ కథ అనుకున్నప్పుడే హీరోగా విరాన్‌ను అనుకున్నాను’’ అన్నారు వేణు మురళీధర్. ‘‘మా సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలి’’ అన్నారు రాజశేఖర్, సాయికృష్ణ.