
రౌడీ బాయ్స్ హీరో ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ: ఇఫ్ యూ డేర్. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ గురువారం (మే 16న) రిలీజ్ చేశారు.

ఇందులో హీరో మొండితనాన్ని చూపించారు. ఎవరైనా ఏదైనా పని చేయొద్దంటే దాన్ని చేసి తీరతాననే రకం.. అలాంటి వ్యక్తి దెయ్యంతో ప్రేమలో పడ్డట్లు చూపించారు.

అయితే దెయ్యంతో హీరో ఎలా ప్రేమలో పడ్డాడనేది వైష్ణవి తనకు తెలియకుండానే లీక్ చేసేసింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మైక్ పట్టుకుని ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్లిపోయింది.

లవ్ మీ అనేది డిఫరెంట్ అండ్ డార్క్ మూవీ. ఇందులో నేను టఫ్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఈ క్యారెక్టర్ రియల్ లైఫ్‌లో అందరిలో ఉండదు. ఎవరిలో అయితే ఉంటుందో వారు మన కంటికి కనిపించరు.

అంతా మనసులోనే పెట్టుకుంటారు. ఆశిష్ కూడా మంచి పాత్రను పోషించాడు.

ఫలానా పని చేయొద్దంటే పనిగట్టుకుని మరీ అదే చేసే మొండిరకం. దెయ్యం చాలా డేంజర్, రెండోసారి చూడొద్దంటే.. లేదు, ఆ దెయ్యాన్ని చేజ్ చేసి పట్టుకుని దాని వెనక కథేంటో తెలుసుకుంటానని వెళ్తాడు.

ఈ క్రమంలో దెయ్యంతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ప్రేమలో పడతాడు అని కథ అంతా చెప్పేసింది. దీంతో అక్కడే ఉన్న దిల్ రాజు క్లైమాక్స్ చెప్పమ్మా అని నవ్వేశాడు.




