విలేజ్‌ పాలిటిక్స్‌ షురూ | Vishwak Sen VS13 gets a grand launch | Sakshi
Sakshi News home page

విలేజ్‌ పాలిటిక్స్‌ షురూ

Published Fri, Aug 16 2024 3:26 AM | Last Updated on Fri, Aug 16 2024 3:26 AM

Vishwak Sen VS13 gets a grand launch

హీరో విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోని 13వ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ‘ఎవ్రీ యాక్షన్‌ ఫైర్స్‌ ఎ రియాక్షన్‌’ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ సంపద హీరోయిన్‌గా నటించనున్నారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాతో శ్రీధర్‌ గంటా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఎల్‌ఎస్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వశిష్ఠ క్లాప్‌ ఇవ్వగా, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కెమెరా స్విచాన్‌ చేశారు. నిర్మాతలు నాగవంశీ, సాహు గారపాటి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ పోలీసాఫీసర్‌గా నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ను సెప్టెంబరులో ఆరంభించనున్నామని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్, కెమెరా: కిశోర్‌ కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement