టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ చిత్రంలో డీజే టిల్లు భామ నేహాశెట్టి, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'అడవికి గొడ్డలి బ్యాడ్.. కడుపుకి అంబలి బ్యాడ్.. మట్టికి నాగలి బ్యాడ్' అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన ఈ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తేదీ మరోసారి మారింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మే 31 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. మొదట ఈనెల 17న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment