విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఎన్నికలు, ఐపీఎల్ వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఫైనల్‌గా ప్రేక్షకులని పలకరించింది. అయితే విడుదలకు ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం మిక్స్‌డ్ టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ మూవీకి ఓటీటీ పార్ట్‌నర్ కూడా ఎవరనేది ఫిక్స్ అయింది. ఆ డీటైల్స్ ఇవిగో.
(ఇదీ చదవండి: 'భజే వాయువేగం' సినిమా రివ్యూ)
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ పేరుకు తగ్గట్లే యాక్షన్ ఎలిమెంట్స్‌తో నింపేశారు. 90ల్లో గోదావరి జిల్లాలోని ఓ లంక ప్రాంతాంలో జరిగే కథతో దీన్ని తీశారు. ఇక నటుడిగా విశ్వక్ సేన్ ఆకట్టుకున్నప్పటికీ ఓవరాల్‌గా మాత్రం యావరేజ్ అనే టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అయితే 28 తర్వాత స్ట్రీమింగ్ ఉండొచ్చని అంటున్నారు.
దీనిబట్టి చూస్తే మే 31న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థియేటర్లలోకి వచ్చింది. అంటే జూన్ చివరికల్లా ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేయొచ్చు. ఈ మూవీలో విశ్వక్ సేన్‌తో పాటు నేహాశెట్టి, అంజలి కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. నాగవంశీ నిర్మించారు.
(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment